Homeఆంధ్రప్రదేశ్‌Godavari Pulasa Fish: రెండు కిలోల చేప రూ.24 వేలు.. ఏంటి స్పెషల్?!*

Godavari Pulasa Fish: రెండు కిలోల చేప రూ.24 వేలు.. ఏంటి స్పెషల్?!*

Godavari Pulasa Fish: ‘పుస్తెలమ్మైనా పులస తినాలి’.. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఈ మాట వింటాం. అంతలా ఉంటుంది అక్కడి పులస చేప ప్రాధాన్యం. సాధారణంగా వర్షాల కాలంలో.. గోదావరిలో ఎర్ర నీరు ప్రవాహ సమయంలో ఎక్కువగా ఈ పులస చిక్కుతుంది. ధర కూడా అమాంతం ఉంటుంది. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆశాజనకంగా వర్షాలు పడడం లేదు. గోదావరిలో నీటి ప్రవాహం కూడా అంతంత మాత్రమే ఉంది. దీంతో పులస చేపల లభ్యత […]

Godavari Pulasa Fish: ‘పుస్తెలమ్మైనా పులస తినాలి’.. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా ఈ మాట వింటాం. అంతలా ఉంటుంది అక్కడి పులస చేప ప్రాధాన్యం. సాధారణంగా వర్షాల కాలంలో.. గోదావరిలో ఎర్ర నీరు ప్రవాహ సమయంలో ఎక్కువగా ఈ పులస చిక్కుతుంది. ధర కూడా అమాంతం ఉంటుంది. అయితే ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఆశాజనకంగా వర్షాలు పడడం లేదు. గోదావరిలో నీటి ప్రవాహం కూడా అంతంత మాత్రమే ఉంది. దీంతో పులస చేపల లభ్యత లేదు. అయితే ఇటీవల ఓ రెండు కిలోల చేప చిక్కింది. అయితే వేలంలో ఆ చేప 24 వేల రూపాయలకు అమ్ముడు కావడం ఆసక్తి గొల్పింది. పార్వతి అనే మహిళ వేలంలో ఆ చేపను దక్కించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే అంశం వైరల్ గా మారింది.

* సంతానోత్పత్తి కోసం..
ఈ పులస చేప సముద్రాల్లో వేల కిలోమీటర్లు ఈదుకుంటూ నదుల వైపు వస్తుంది. ప్రతి సంవత్సరం గోదావరి నదిలో కొత్తనీరు చేరుతున్న క్రమంలో.. సంతానోత్పత్తి కోసం నది వైపు ఎగబడుతుంది. ఆ సమయంలోనే పులస చేపలు మత్స్యకారుల వలకు చిక్కుతాయి. ఈ ఏడాది ఎల్ నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు కురవడం లేదు. దీంతో గోదావరి నదిలో కొత్తనీరు చేరడం లేదు. అందుకే పులస చేప మత్స్యకారుల వలకు చిక్కడం లేదు. ఇటీవల మత్స్యకారులకు ఒకే ఒక చేప చిక్కింది. ఒకటిన్నర నుంచి రెండు కిలోల మధ్య ఉంటుంది ఆ చేప. విపరీతమైన డిమాండ్ నేపథ్యంలో బహిరంగ వేలం వేశారు. యానాం తీరంలో ఈ చేప బహిరంగ వేలంలో చాలామంది పాల్గొన్నారు. చివరకు పార్వతి అనే మహిళ 24 వేల రూపాయలకు ఆ చేపను వేలంలో దక్కించుకోవడం విశేషం..

* చాలా అరుదైనది..
ఈ పులస చేప చాలా అరుదైనది. ఎంతో రుచికరమైనది. ఔషధ గుణాలు కూడా కలిగి ఉంటుంది. గోదావరి జిల్లాలో కొత్తగా పెళ్లయి అత్తవారింటికి వచ్చే అల్లుడికి కచ్చితంగా పులస చేప మర్యాద ఉండాల్సిందే. ఇక్కడ లభ్యమయ్యే పులస చేపను తమ బంధువులతోపాటు స్నేహితులకు కూడా పంపిస్తుంటారు. కానీ గత కొన్నేళ్లుగా ఈ పులస చేపల అభ్యత క్రమేపి తగ్గిపోతూ వస్తోంది. ఈ ఏడాది మరింత తీసుకట్టుగా మారింది. మొన్న ఆ మధ్యన గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగినప్పుడు పులస చేపలు కొంతవరకు లభ్యమయ్యాయి. మళ్లీ ఇప్పుడు నిన్ననే ఒక చేప చిక్కింది. గతంలో అయితే రోజుకు పదుల సంఖ్యలో ఇవి చిక్కేవి. సాధారణ ధరకు అందుబాటులోకి వచ్చేవి. ఇప్పుడు ఎప్పుడో ఒక్క చేప చిక్కుతుండడంతో ధర మండిపోతోంది. వేలంలో వేల రూపాయలకు పాకుతోంది. తాజా చాప 24 వేల రూపాయలకు అమ్ముడు కావడం ఒక రికార్డ్. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by kakinadakiran (@kakinada_kiran)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper