Homeఆంధ్రప్రదేశ్‌YSR Congress future plans: తెలంగాణ ఫలితం.. వైయస్సార్ కాంగ్రెస్ కిం కర్తవ్యం!?

YSR Congress future plans: తెలంగాణ ఫలితం.. వైయస్సార్ కాంగ్రెస్ కిం కర్తవ్యం!?

YSR Congress future plans: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల( Telangana Municipal Elections ) ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా నడుస్తోంది. గులాబీ పార్టీ గట్టి పోటీ ఇచ్చినట్టు కనిపించినా తుది ఫలితాల్లో మాత్రం వెనుకబడింది. ఆ పార్టీ కేవలం నాలుగు మున్సిపాలిటీల్లో మాత్రమే సత్తా చాటింది. మిగతా చోట్ల కాంగ్రెస్ హవా నడుస్తోంది. ఒకటి రెండు చోట్ల బిజెపి ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన కలవరం మొదలైంది. ఒకటి అధికార పార్టీకి అనుకూలమైన ఫలితాలు. రెండు మిత్రుడైన కెసిఆర్ పార్టీ ఓడిపోవడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిలో ఆందోళనకు కారణం అవుతుంది. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో గులాబీ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. గౌరవప్రదమైన అసెంబ్లీ సీట్లు కూడా దక్కాయి. కానీ ఏపీలో మాత్రం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను కేవలం 11చోట్ల మాత్రమే వైసిపి గెలుపొందింది. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతోంది. ప్రభుత్వం పట్ల సంతృప్తి శాతం కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరిగితే తమ పరిస్థితి ఎలా ఉంటుందోనన్న ఆందోళన జగన్ మోహన్ రెడ్డి లో ఉంది.

అక్కడ నిలబడిన గులాబీ పార్టీ..
తెలంగాణలో గులాబీ పార్టీ నాయకులు బలంగా ఉన్నారు. కెసిఆర్ కు అటు కుమారుడు కేటీఆర్, ఇటు మేనల్లుడు హరీష్ రావు తో పాటు సీనియర్ నేతలంతా గట్టిగానే మద్దతుదారులుగా నిలుస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో గులాబీ పార్టీ నెగ్గుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో దెబ్బతింది. కానీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం కొంతవరకు ప్రభావం చూపగలిగింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఏకపక్ష విజయాన్ని అడ్డుకోగలిగింది. కానీ ఆ పరిస్థితి ఏపీలో ఉంటుందా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలబడగలగా? కనీసం ఉనికి చాటుకోగలద? అనే అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఏపీలో కూటమి బలంగా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో మున్సిపల్ ఎన్నికలను ఫేస్ చేయడం అంత ఈజీ కాదు.

సంక్లిష్ట సమయం..
ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా ఇప్పుడు అధికార పార్టీగా టిడిపి కూటమి ఉంటుంది. అందులోనూ మూడు పార్టీల మధ్య గ్యాప్ చూడాలనుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ రోజురోజుకు వారి మధ్య మంచి బంధం ఏర్పడుతోంది. రాజకీయంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు అభ్యర్థులు ముందుకు రాని పరిస్థితి. 2021 మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా దూకుడు ప్రదర్శించింది. చాలాచోట్ల ఏకగ్రీవాలను సైతం చేసుకుంది. ప్రస్తుతం బిజెపి సైతం కూటమిలో ఉంది. కేంద్ర ప్రభుత్వం అండ కూడా కూటమికి ఉంటుంది. పొరుగునే ఉన్న తెలంగాణలో అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపించింది. అది ఏపీలో సైతం రిపీట్ అవుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి సైతం ఇది తెలుసు. అందుకే ఆ పార్టీ నిర్ణయం ఇప్పుడు కీలకంగా మారనుంది. మున్సిపల్ ఎన్నికలను ఆ పార్టీ ఫేస్ చేస్తుందా? లేదా? అనేది ఒక అనుమానం?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Gen Z Protests : జెన్ జీ ఆందోళన నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలేంటి?

Gen Z Protests : దేశ రాజకీయాల్లో, ప్రజాస్వామ్యంలో విద్యార్థి ఉద్యమాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. చరిత్ర చెబుతున్నదేమిటంటే.. యువత ముందుకు వస్తే మార్పు సాధ్యమవుతుంది. అయితే అదే యువత ఆవేశానికి,...
Vivo T5e

Vivo T5e: అధికారికంగా రిలీజ్ అయిన వివో కొత్త ఫోన్.. ధర రూ.14 వేల లోపే..

Vivo T5e: ప్రస్తుత కాలంలో బడ్జెట్ లో మొబైల్ కొనేవారు చాలా మందే ఉన్నారు. ఓ వైపు ప్రీమియం మొబైల్స్ అందుబాటులోకి వస్తున్నప్పటికీ దీనిపై ఎక్కువ డబ్బు పెట్టలేని వారికోసం Vivo...
Narendra Modi And Rahul Gandhi

Narendra Modi And Rahul Gandhi: మోడీ గేమ్ అర్థం కాలేదా రాహుల్ గాంధీ…

Narendra Modi And Rahul Gandhi: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా… ఈ పరిణామాలను చూసి విపక్షాలు...
Electricity Complaint Number

Electricity Complaint Number: మీ ప్రాంతంలో కరెంటు పోయిందా.. జస్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి..

Electricity Complaint Number: ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యుత్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే చాలా ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది....
Ramayana Movie

Ramayana Movie: రామాయణంలో రావణుడు.. యష్ బీభత్సకాండ కు రణబీర్ షాక్

Ramayana Movie: నితీష్ తివారీ డైరెక్షన్లో 'రామాయణ' అనే భారీ పౌరాణిక చిత్రం సిద్ధమవుతోంది. ఇందులో రాముడిగా రణబీర్ కపూర్.. రావణుడిగా యశ్ పాత్రను పోషించనున్నారు. సీతాదేవిగా సాయి పల్లవి నటిస్తున్నారు. హనుమంతుడి...
Oktelugu Epaper