Singayya Death Video: ఏపీ( Andhra Pradesh) రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి ఇప్పుడు వేణు సంచలనాలకు కారణమవుతోంది. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పర్యటించిన సంగతి తెలిసిందే. గత బుధవారం ఈ పర్యటనలో భాగంగా జగన్ కాన్వాయ్ ఢీకొని సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతి చెందారంటూ అధికార పార్టీ నేతలు ఆరోపించారు. మొదట సింగయ్య కాన్వాయ్ లోని ఒక వాహనం పైకి ఎక్కబోయి కిందపడి గాయపడ్డారని.. ఆ తరువాత మృతి చెందినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ ఘటనకు సంబంధించి గుంటూరు ఎస్పీ స్పందించారు. ఓ ప్రైవేటు వాహనం ఢీ కొట్టి సింగయ్య మృతి చెందారని ప్రకటించారు. దీంతో వివాదం సద్దుమణిగిందని అంతా భావించారు.
పోలీసుల సీరియస్ యాక్షన్..
మరోవైపు జగన్( Jagan Mohan Reddy) ప్రయాణిస్తున్న వాహనం కిందపడి సింగయ్య మృతి చెందినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోల ఆధారంగా జగన్ ప్రయాణిస్తున్న వాహనం కిందపడి సింగయ్య మృతి చెందారని మీడియా సంస్థలు కథనాలు ప్రచురిస్తున్నాయి. మరోవైపు ఏపీ పోలీసులు ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నారు. వాహన డ్రైవర్ ను ఏ 1గా చూపారు. జగన్మోహన్ రెడ్డిని ఏ 2 గా చూపుతూ కేసు నమోదు చేశారు. ప్రధానంగా ఆధారాలు సేకరించిన తరువాత పోలీసులు సెక్షన్లు మార్చుతూ అభియోగాలు నమోదు చేశారు. కారు ముందు టైరు సింగయ్య మెడ పైనుంచి వెళ్లినట్లు దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోలు వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ కేసులో కీలక మలుపులు కనిపిస్తున్నాయి. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే జగన్ పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
Also Read: Jagan Mohan Reddy : ఇదేంది సామీ.. ఒప్పుకోవాలి మనం కూడా.. జగన్ టీజింగ్ పీక్స్..
ప్రత్యేక వీడియో విడుదల
తాజాగా సింగయ్య కు సంబంధించిన వీడియోను వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా( social media) విడుదల చేసింది. జగన్ కాన్వాయ్ ప్రమాదం తర్వాత సింగయ్య క్షేమంగానే ఉన్నారని ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. అంబులెన్స్ వచ్చిన సమయంలో కూడా సింగయ్య కాలు మీద కాలు వేసుకుని కనిపించారు. సింగయ్య విషయంలో ఏదో తప్పు జరిగిందని.. దానిని కూటమి ప్రభుత్వం దాస్తున్నట్లు కనిపిస్తోందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ కారు కిందపడి సింగయ్య మృతి చెందలేదని.. అది తప్పుడు ప్రచారం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఖండించారు. పార్టీ తరఫున సింగయ్య కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించారు.
సింగయ్యను మొదట ఆటో ఎక్కించారు.. మరో ప్రదేశంలో రోడ్డు పై పడుకోబెట్టి అంబులెన్స్ ఎక్కించారు
పోలీస్ కూడా వున్నారు pic.twitter.com/BW9aT3t1JV
— VV (@NebulaSpectrum) June 22, 2025