Rishabh Pant Brook Controversy: క్రికెట్ జెంటిల్మెన్ గేమ్. ఇందులో డౌటే లేదు. కానీ ఆధునిక కాలంలో ఇది అనేక రకాలుగా మార్పులకు గురైంది. ఇందులో భాగంగా ప్లేయర్లు రకరకాల మయోపాయాలకు పాల్పడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ నాలుగు ఆకులు ఎక్కువే చదివాడు.
మైదానంలో చిచ్చరపిడుగు మాదిరిగా రెచ్చిపోతాడు రిషబ్ పంత్. తాజాగా జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్లో సూపర్ సెంచరీ తో అదరగొట్టాడు. ముఖ్యంగా సెంచరీ ముందు భారీ సిక్సర్ కొట్టి తన బ్యాటింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మరోసారి నిరూపించాడు. వికెట్ కీపింగ్ లో రిషబ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాలలో మినహా అన్నిసార్లు కూడా వికెట్ల వెనుక గోడ కట్టినట్టే ఉంటాడు. బంతులను ఎగిరి గంతులు వేస్తూ మరి ఆపుతాడు. తనదైన హిందీ మాట్లాడుతూ బౌలర్లలో బూస్ట్ నింపుతాడు. అంతేకాదు ఎలాంటి బంతులు వేయాలో వికెట్ల వెనుక నుంచి సంకేతాలు ఇస్తాడు. అందువల్లే రిషబ్ పంత్ ఈ కాలపు ధోనిగా పేరు తెచ్చుకున్నాడు.
మాస్టర్ బ్రెయిన్ ప్రదర్శించాడు
తాజాగా జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్లో రిషబ్ పంత్ తనదైన మాస్టర్ బ్రెయిన్ ప్రదర్శించాడు. లీడ్స్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో మైదానం వేదికగా అద్భుతమైన నాటకాన్ని ప్రదర్శించాడు. మూడోరోజు ఆట సాగుతున్నప్పుడు ఇంగ్లాండ్ ప్లేయర్ బ్రూక్ సెంచరీ దిశగా వెళ్తున్నాడు. మైదానంలో బీభత్సంగా పరుగులు చేస్తూ భారత బౌలర్లకు సింహ స్వప్నం లాగా నిలిచాడు. ఈ నేపథ్యంలో రిషబ్ పంత్ ఎలాగైనా సరే బ్రూక్ కు అడ్డుకట్ట వేయాలని భావించాడు వెంటనే మూమెంటమ్ ను నిలుపుదల చేశాడు. ఈలోగా మైదానంలోకి జట్టు ఫిజియో వచ్చాడు. పంత్ పాదాలకు కట్టు కట్టాడు. ఈ సమయాన్ని టీం ఇండియా ప్లేయర్లు సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ప్రసిద్ బౌన్సర్ వేశాడు. దానిని భారీ షాట్ ఆడాడు బ్రూక్. బౌండరీ లైన్ వద్ద ఉన్న శార్దూల్ ఠాకూర్ దానిని అత్యంత చాకచక్యంగా అందుకున్నాడు. రిషబ్ పంత్ మూమెంటమ్ బ్రేక్ చేయడంతో బ్రూక్ ఏకాగ్రత దెబ్బతిన్నది. దీంతో అతడు 99 పరుగుల వద్ద వెను తిరగాల్సి వచ్చింది.
Also Read: Rishabh Pant: రిషభ్ పంత్ కు భారీ జరిమానా విధించిన బీసీసీఐ
నాటకం ఆడాడా
రిషబ్ పంత్ నొప్పితో ఇబ్బంది పడుతునట్టు జట్టు ఫిజియోను పిలిచిన నేపథ్యంలో.. మ్యాచ్ కు కాస్త బ్రేక్ ఇచ్చారు. ఈ బ్రేక్ లో జట్టు ప్లేయర్లు రకరకాల అంచనాలు రూపొందించుకున్నారు. అప్పటికే ప్రసిద్ ఒక బౌన్సర్ వేశాడు. దానిని బ్రూక్ సిక్సర్ కొట్టాడు. రిషబ్ పంత్ ఈలోగా తనకు పాదాలు నొప్పి పెడుతున్నాయంటూ జట్టు ఫిజియోకు సంకేతాలు ఇచ్చాడు. దీంతో మ్యాచ్ నిర్వహణ కాసేపు ఆగిపోయింది. ఆ తర్వాత జట్టు ఫిజియో వచ్చి రిషబ్ పంత్ పాదాలకు బ్యాండేజ్ వేశాడు. ఆ తర్వాత క్యాచ్ మొదలైంది. ప్రసిద్ ఎప్పటిలాగే బౌన్సర్ వేశాడు. దానిని భారీ షాట్ కొట్టాడు బ్రూక్.. లాంగ్ ఆన్ లో ఉన్న శార్దుల్ ఎటువంటి పొరపాటు చేయకుండా దానిని అందుకున్నాడు.. దీంతో బ్రూక్ కథ 99 పరుగుల వద్ద సమాప్తమైంది. అయితే రిషబ్ నాటకం ఆడటం వల్లే ఇదంతా జరిగిందని కొంతమంది సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తుండగా.. అతడికి నిజంగానే ఇబ్బంది ఎదురైందని.. అందువల్లే జట్టు ఫిజియోను పిలిచాడని మరి కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ రిషబ్ పంత్ చాకచక్యం వల్ల బ్రూక్ సెంచరీ దూరమైంది.
HARRY BROOK MISSED HIS HUNDRED BY JUST 1 RUN pic.twitter.com/9DgZKTFXEP
— Johns. (@CricCrazyJohns) June 22, 2025