Kuppam Viral Video: ఏపీ సీఎం చంద్రబాబు( CM Chandrababu) సొంత నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న ఘటనలు సంచలనం సృష్టిస్తున్నాయి. కుప్పం మండలంలో ఓ మహిళను చెట్టుకు కట్టి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. భర్త తీసుకున్న అప్పు కట్టకపోవడంతో భార్యపై దాష్టికం చూపారు. పిల్లల ఎదుట తల్లిని చెట్టుకు కట్టి హింసించారు. పిల్లలు గుక్క పట్టి ఏడ్చుతున్న కనికరించలేదు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. మహిళపై దాడికి పాల్పడిన నలుగురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు స్పందించి బాధిత మహిళలకు ఆర్థిక సాయం అందించారు. అయితే ఆ ఘటన మరువకముందే మరో మహిళ తన భూమిని టిడిపి నేత స్వాధీనం చేసుకున్నారంటూ సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేసింది ప్రస్తుతం మీదే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
టిడిపి నేత కబ్జా బైరెడ్డిపల్లి( bhaireddypally ) మండలం వేలుపల్లి పంచాయితీ శెట్టిపల్లి గ్రామానికి చెందిన రమాదేవికి 2.72 ఎకరాల భూమి ఉంది. గత కొన్నేళ్లుగా ఆ భూమి సాగు చేస్తోంది ఆమె. అదే భూమిపై రుణాలు కూడా పొందింది. అయితే గ్రామానికి చెందిన టిడిపి నాయకుడు నాగరాజు నాయుడు ఆ భూమి తనది అంటూ ముందుకు వచ్చాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమిని వేరొకరి పేరు మీద మార్చి బెదిరింపులకు దిగుతున్నాడని బాధిత మహిళ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించడం లేదని చెబుతోంది. అందుకే సోషల్ మీడియా వేదికగా వేడుకుంటున్నట్లు చెప్పుకొస్తోంది. అయితే ఈ వీడియోను వైయస్సార్ కాంగ్రెస్ సోషల్ మీడియా ట్రోల్ చేస్తోంది. వైరల్ చేస్తోంది.
Also Read: Kuppam: 80 వేలు అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసి దారుణం
నకిలీ పత్రాలు సృష్టించి
20 సంవత్సరాలుగా తన ఆధీనంలోనే ఆ భూమి ఉందని బాధితురాలు చెబుతోంది. కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చిన తర్వాత నకిలీ పత్రాలు సృష్టించారని చెప్పింది. అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు టిడిపి నేత నాగరాజు నాయుడుకు కొమ్ముకాస్తున్నారంటూ ఆరోపించింది. టిడిపి నేత నుంచి తమ భూమిని కాపాడాలని.. తమ కుటుంబానికి ఏమైనా జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. అయితే కుప్పం నియోజకవర్గంలో వరుసగా జరుగుతున్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం సీరియస్గా యాక్షన్ లోకి దిగే అవకాశం ఉంది.
కుప్పంలో మరో ఘటన
చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మహిళపై టీడీపీ నాయకుడి దౌర్జన్యం
మహిళ భూమికి నకిలీ పత్రాలు సృష్టించి, మహిళను బెదిరిస్తున్న టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు
చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం బేలుపల్లి పంచాయతీ పరిధిలోని శెట్టిపల్లి గ్రామానికి చెందిన రమాదేవి అనే… pic.twitter.com/ENBEvXQnhO
— Telugu Scribe (@TeluguScribe) June 19, 2025