Jagan Mohan Reddy : రాజకీయ నాయకులు విమర్శలు నేరుగా చేసుకుంటారు. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. మీడియా ప్రాబల్యం పెరిగిపోయిన తర్వాత.. రాజకీయ నాయకులు పరోక్షంగా విమర్శలు చేసుకుంటున్నారు. జనాలకు కాస్త వినోదాన్ని అందివ్వడానికి దానికి సెటైర్లు కూడా జోడిస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలోకి ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేరిపోయారు.
Jagan Mohan Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు మాత్రమే వచ్చిన తర్వాత.. వైసిపి పై ఒత్తిడి పెరిగిపోయింది. అంతస్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ ఇలాంటి తీర్పు ఏమిటని జగన్ మోహన్ రెడ్డి లోను ఆగ్రహం పెరిగిపోయింది. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి 2.0 ను ప్రజలకు చూపిస్తున్నారు. కాకపోతే అది శాంపిల్ మాత్రమే నట. అసలు సినిమా మునుముందు ఉంటుందట. అదే విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి ఇటీవల జరిగిన సభలలో ప్రస్తావించారు. బాబు నాయుడు పై నేరుగానే విమర్శలు చేశారు. అయితే ఆయన విమర్శలు చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ లేదా భారతీయ జనతా పార్టీ ప్రస్తావన తీసుకురాకపోవడం విశేషం. కేవలం చంద్రబాబు నాయుడు, రెడ్ బుక్ రాజ్యాంగం మీద మాత్రమే ఆయన విమర్శలు చేశారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పర్యటన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై ఓపెన్ గానే విమర్శ చేసిన జగన్మోహన్ రెడ్డి.. ఒక సందర్భంలో మాత్రం పరోక్షమైన దారిని ఎంచుకున్నారు.
సెటైర్లు వేస్తూ..
జగన్మోహన్ రెడ్డి తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు నాయుడు మీద కొన్ని సందర్భాలలో ఓపెన్ గానే విమర్శలు చేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు.. తెలుగుదేశం పార్టీ నాయకుల వ్యవహారాలు అడ్డగోలుగా కొనసాగుతున్నాయని.. రాజ్యాంగం బదులుగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. తన పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారని.. నాయకులను పోలీస్ స్టేషన్లో వేసి ఇబ్బంది పెడుతున్నారని.. ఇలాంటి వ్యవహారాలు ప్రభుత్వానికి ఎంత మాత్రం మంచివి కావని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక పాఠశాలల విషయంలో, అమ్మ ఒడి విషయంలో, జగన్మోహన్ రెడ్డి వేరే లెవెల్లో విమర్శలు చేశారు..” చంద్రబాబు చేసిన పనిని మనం అభినందించి తీరాలి. ఎందుకంటే అమ్మ ఒడి లో 2000 తగ్గించినాడు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను తగ్గించి.. వాటి స్థానంలో ప్రవేట్ పాఠశాలలు, కళాశాలలను పెంచినాడు. అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసుకోమని చెప్పినాడు. ఇక విద్యుత్ చార్జీల విషయంలో చెప్పాల్సిన పనిలేదు. ప్రజలనుంచి 16 వేల కోట్లను వసూలు చేసినాడు. అడ్డగోలుగా అప్పులు తెచ్చినాడు. ఈ విషయంలో చంద్రబాబును కచ్చితంగా మనం అభినందించాలని” జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా విమర్శలు చేశారు. సాధారణంగా ఆగ్రహంతో.. దూకుడుతనంతో చంద్రబాబును విమర్శించే జగన్మోహన్ రెడ్డి.. తన తీరుకు వ్యతిరేకంగా.. ఇలా వ్యూహాత్మకంగా విమర్శలు చేయడానికి వైసిపి శ్రేణులు స్వాగతిస్తున్నాయి. అంతేకాదు జగన్మోహన్ రెడ్డిలో కొత్త కోణాన్ని చూస్తున్నామని వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలతాలూకూ సంబంధించిన వీడియోలను వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నాయి.
ఇదేం వెటకారం బాస్ pic.twitter.com/x1bWLiNE4N
— రామ్ (@ysj_45) June 19, 2025