Homeఆంధ్రప్రదేశ్‌Pithapuram Varma emotional video: మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న పిఠాపురం వర్మ.. వీడియో వైరల్..

Pithapuram Varma emotional video: మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్న పిఠాపురం వర్మ.. వీడియో వైరల్..

Pithapuram Varma emotional video: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన రోజు నుండి, మొన్నటి వరకు, ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి గా వ్యవహరిస్తూ , పిఠాపురం నుండి గెలుపొందిన పవన్ కళ్యాణ్ పై , ఆ ప్రాంత టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ , ఎదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈయన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా కృషి చేసాడు, […]

Pithapuram Varma emotional video: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన రోజు నుండి, మొన్నటి వరకు, ఈ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రి గా వ్యవహరిస్తూ , పిఠాపురం నుండి గెలుపొందిన పవన్ కళ్యాణ్ పై , ఆ ప్రాంత టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ , ఎదో ఒక విధంగా ఇబ్బంది పెడుతూనే ఉన్న సంగతి తెలిసిందే. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈయన పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలా కృషి చేసాడు, అందుకు చంద్రబాబు నాయుడు , పవన్ కళ్యాణ్ , నారా లోకేష్ వంటి వారు ఈయనకు ఎంతో గౌరవం ఇస్తూ వచ్చారు. కానీ వర్మ మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ లోకల్ నాయకులతో గొడవలు పడుతూనే ఉన్నాడు. రీసెంట్ గా కార్యకర్తల స్థాయికి చేరుకొని ఆయన ఫ్లెక్షీల విషయం లో ఏ రేంజ్ లో గొడవ పడ్డాడో మన కళ్లారా చూశాము.

సీఎం చంద్రబాబు నాయుడు కూడా వర్మ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే జనసేన నాయకుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురు అవ్వడంతో , వర్మ ని పిఠాపురం ఇంచార్జి బాధ్యతల నుండి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై సోషల్ మీడియా లో తెలుగు దేశం పార్టీ కార్యకర్తల నుండి తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతుండగా, జనసేన పార్టీ అభిమానుల నుండి హర్షం వ్యక్తం అవుతోంది. మరోపక్క వర్మ కాసేపటి క్రితమే ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసిన మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. అందులో ఆయన బాగా ఎమోషనల్ అయిపోవడం గమనార్హం.

ఆయన మాట్లాడుతూ ‘అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటే , ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని పిఠాపురం ప్రజలందరికీ తెలుసు. పార్టీ కి అండగా నిలబడాలి అన్నారు , నిలబడ్డాం, పార్టీ కి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా పని చెయ్యలేదు. బలోపేతం చేయడానికే నిత్యం కృషి చేస్తూ వచ్చాను. లోకేష్ గారిని రీసెంట్ గానే కలిసి , రీసెంట్ గా పిఠాపురం నియోజకవర్గం లో జరిగిన పరిస్థితులను వివరించి, ఒక కమిటీ ని వేయమని చెప్పాను, కానీ చివరికి ఇలా అవుతుందని ఊహించలేదు. నన్ను ఇంచార్జి పదవి నుండి తప్పించే ముందు , నాకు సమాచారం ఇచ్చారు లోకేష్’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. దీంతో టీడీపీ కార్యకర్తలు ఈ వీడియో ని షేర్ చేస్తూ ఈసారి స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చెయ్యి అంటూ వర్మ ని ట్యాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయినటువంటి ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Telugu Chitraalu (@teluguchitraalu)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper