Ashish Banerjee : రాజకీయాలు పరమపద సోపానం లాంటి. ఎక్కెందుకు నిచ్చెనలు ఉంటాయి. ఎక్కిన నిచ్చెనలను లాగేందుకు పాములు కూడా ఉంటాయి. ఎలా వ్యవహరించాలి.. ఎలా ముందుకు సాగాలి అనేది మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. అందువల్లే రాజకీయాల్లోకి రావడానికి ముందు ఒకటికి 1000 సార్లు ఆలోచించుకోవాలి.. ఒకసారి ఇందులోకి దిగిన తర్వాత.. విజయమో.. వీర స్వర్గమో అనేది మాత్రమే అంతిమం కావాలి.
రాజకీయాలు చేసే నాయకులు సాధ్యమైనంత వరకు సున్నితమైన అంశాలకు స్పందించడం మానేయాలి. దృఢంగా ఉండాలి. మానసికంగా ధైర్యంగా ఉండాలి. అలా ఉండని పక్షంలో రాజకీయ నాయకులు ఇబ్బంది పడక తప్పదు.. ఇటువంటి పరిస్థితి ఓ రాజకీయ నాయకుడికి ఎదురైంది. చివరికి ఆయన ఇబ్బంది పడటమే కాదు.. తన పార్టీ కార్యాలయంలోనే కీలక నిర్ణయం తీసుకున్నారు. నేటి కాలంలో రాజకీయాలు ఎలా మారిపోయాయో నిరూపించారు.
బెంగాల్ రాష్ట్రంలో ఆశిష్ బెనర్జీ అనే నాయకుడు ఉన్నారు. ఈయన మమత బెనర్జీకి అత్యంత దగ్గరి సన్నిహితుడు. మమత బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్గా వ్యవ. ఈయన బీర్భూమ్ ప్రాంతంలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పార్టీ కార్యాలయం ఆయన ఇంటికి సమీపంలో ఉండడం విశేషం. పోలీసులు ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టంకి పంపించారు. ఆశిష్ బెనర్జీ రామ్ పూర్హాట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2001 నుంచి 2026 వరకు ఆయన దాదాపు 25 సంవత్సరాల పాటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. బెంగాల్ రాష్ట్రానికి విద్య.. వ్యవసాయ శాఖలకు మంత్రిగా పనిచేశారు. 2020 కట్ల శాసనసభకు డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి నాయకుడు సహా అనే నాయకుడి చేతిలో ఓటమి పాలయ్యారు.
ఆశిష్.. తారా పీట్ రాంపూర్ హాట్ డెవలప్మెంట్ అథారిటీ కి చైర్మన్ గా వ్యవహరించారు. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఆర్థికంగా అవకతవకలు జరిగాయని ఆరోపణలు వినిపించాయి. ఇందులో ఆయనకు భాగం కూడా ఉందని విపక్షాలు ఆరోపించడం మొదలుపెట్టాయి.. దీంతో ఆయన ఒక్కసారిగా కలత చెందారు. ఆత్మహత్య చేసుకున్నారు. దానికంటే ముందు ఒక నోట్ రాశారు..” నేను జీవితంలో ఎన్నడు అవినీతికి పాల్పడలేదు.. టెండర్లు.. చెక్కులు జారీ చేయడం.. ప్రణాళిక అనుమతులు.. ఎన్వోసీ వంటి వాటిపై ఎటువంటి సంబంధం లేదని.. నామీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాజకీయాలకు రావడమే నేను చేసిన అతి పెద్ద తప్పు. నా కుటుంబంలో యువకులు ఎవరు కూడా రాజకీయాల్లోకి రావద్దు. వారంతా కూడా సొంత పనులు చూసుకోవాలని” ఆశిష్ తన లేఖలో పేర్కొన్నారు. అయితే తన మరణానికి ఎవరూ కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. ఇక తన పార్టీలో తప్పుడు చర్యలు జరిగాయని.. వాటిని తాను అడ్డుకోలేదని.. వ్యతిరేకించలేదని.. తన స్థాయిలో నిరసన కూడా తెలపలేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.