Homeఆంధ్రప్రదేశ్‌AP Assembly: ఇదెక్కడి ఊర మాస్ గురు.. బొత్సకు గ్యాప్ ఇవ్వని మంత్రి పయ్యావుల!

AP Assembly: ఇదెక్కడి ఊర మాస్ గురు.. బొత్సకు గ్యాప్ ఇవ్వని మంత్రి పయ్యావుల!

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. శాసనమండలికి వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందులో వారికి సక్సెస్ కంటే మైనస్ ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన చర్చలో వైసిపి పక్ష నాయకుడు బొత్స కాగ్ నివేదిక అంటూ ఓ పేపర్ ను చూపించారు. ఆదాయంలో 24వ స్థానంలో ఏపీ ఉందంటూ చెప్పుకొచ్చారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. అసలు […]

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. శాసనమండలికి వైసీపీ సభ్యులు హాజరవుతున్నారు. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అందులో వారికి సక్సెస్ కంటే మైనస్ ఎక్కువగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి సంబంధించిన చర్చలో వైసిపి పక్ష నాయకుడు బొత్స కాగ్ నివేదిక అంటూ ఓ పేపర్ ను చూపించారు. ఆదాయంలో 24వ స్థానంలో ఏపీ ఉందంటూ చెప్పుకొచ్చారు. దీనిపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కౌంటర్ ఇచ్చారు. అసలు బొత్స మారు మాట్లాడకుండా చేశారు. పయ్యావుల కేశవ్ బొత్సను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసేసారు. ఏం చేయాలో బొత్సకు పాలు పోలేదు.

* కాగ్ నివేదిక పేరుతో..
రాష్ట్ర ఆదాయం తగ్గుముఖం పట్టింది అనేది బొత్స వాదన. ఇదిగో కాగ్ నివేదిక అంటూ ఓ పేపర్ను చూపించగా.. దానిని పంపించాలని పయ్యావుల కేశవ్ సూచించారు. అయితే తాను చెబుతుంది తప్పా అంటూ ప్రశ్నించారు బొత్స. ఈ క్రమంలోనే పయ్యావుల కేశవ్ మాట్లాడారు. రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందని.. మద్యం ద్వారా ఆదాయం బాగా సమకూరుతుందని చెప్పుకొచ్చారు. అయితే అది రాత్రికి రాత్రి మద్యం తాగేవారు సంఖ్య పెరగడం వల్ల కాదు అని.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పక్కదారి పట్టకుండా పటిష్ట చర్యలు చేపట్టడం వల్లే అది సాధ్యమైందని చెప్పుకొచ్చారు. తద్వారా వైసిపి హయాంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు అని విమర్శలు చేశారు.

* ఎక్కడ ముద్రించారు అంటూ సెటైర్…
ఇంతకీ కాగ్ నివేదిక పంపించాలి అంటూ పదే పదే పయ్యావుల కేశవ్ కోరడంతో.. తన చేతిలో ఉన్న పేపర్ ను పంపించారు బొత్స. అది చూసిన పయ్యావుల కేశవ్ ఇది కాగ్ నివేదిక కానే కాదు అని.. ఎక్కడ ప్రింట్ చేయించారు అంటూ సెటైర్ వేశారు పయ్యావుల. దీంతో బొత్స బిక్క మొఖం వేస్తూ కనిపించారు. దీంతో సభలో ఒక్కసారిగా ఆశ్చర్యకర వాతావరణం ఏర్పడింది. వైసిపి ఎమ్మెల్సీలు సరైన సమాచారంతో సభకు రావడం లేదు అని అర్థం అవుతోంది. పయ్యావుల కేశవ్ తనదైన సెటైరికల్ వ్యాఖ్యలతో.. ఉక్కిరి బిక్కిరి ప్రశ్నలతో బొత్స కు మారు మాట ఆడకుండా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి దీనిపై..

 

View this post on Instagram

 

A post shared by Yathaartha Media (@yathaartha_media)

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper