Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Janata Cockroach Party: కాక్రోచ్ లను చంపేయాలి.. ఆ పార్టీపై పవన్ వీరావేశం...

Pawan Kalyan Janata Cockroach Party: కాక్రోచ్ లను చంపేయాలి.. ఆ పార్టీపై పవన్ వీరావేశం వైరల్!

Pawan Kalyan Janata Cockroach Party: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి జాతీయస్థాయిలో సరికొత్త చర్చకు కారణం అయ్యారు. ఢిల్లీ వేదికగా జనసేన ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ సమైక్యతకు దెబ్బతీసే ఏ శక్తులను జనసేన సమర్ధించదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా జనతా కాక్రోచ్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సమాజానికి ఇలాంటివి మంచిది కాదు అంటూ.. ఈ బొద్దింకల పార్టీ విషయంలో అనుసరించాల్సిన అంశాలపై ఆయన జాతీయస్థాయిలో ఇచ్చిన పిలుపు కొత్త చర్చకు దారితీస్తోంది. ఎవరికి వారే కాక్రోచ్ పార్టీలుగా అభివర్ణిస్తూ హైజాక్ చేస్తుండడాన్ని పవన్ గుర్తుచేస్తూ.. ఇటువంటి బొద్దింకలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

* వ్యంగ్య రాజకీయ అస్త్రంగా..
ఇటీవల దేశంలో ప్రముఖ డిజిటల్, వ్యంగ్య రాజకీయ ఉద్యమంగా పుట్టుకు వచ్చింది జనతా కాక్రోచ్ పార్టీ. భారతీయ జనతా పార్టీ పేరును పోలి ఉండే ఈ ఉద్యమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజిత్ దీప్ కే గత నెల 16న ప్రారంభించారు. అక్కడకు ముందు రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా జనతా కాక్రోచ్ పార్టీ పుట్టుకొచ్చింది. నిరుద్యోగ యువతను, సంస్థలను విమర్శించే కొందరిని ఉద్దేశించి బొద్ధింకలు, సమాజ పరాన్న జీవులు అని సంబోధించడం ద్వారా దేశవ్యాప్తంగా ఆగ్రహవేశాలు వ్యక్తమయ్యాయి. అందులో భాగంగా జనతా కాక్రోచ్ పార్టీ ముందుకు వచ్చింది. సోషల్ మీడియాలో మీమ్స్, ఆన్లైన్ ప్రచారంతో పాటు ఆఫ్ లైన్ లో సైతం బొద్దింకల దుస్తులు ధరించి దేశ రాజధాని జంతర్ మంతర్, తెలంగాణ రాజధాని హైదరాబాదులోని ధర్నా చౌక్ వద్ద ప్రత్యక్ష నిరసనలు కూడా జరిగాయి. గత కొంతకాలంగా దేశంలో జనతా కాక్రోచ్ అనేది ట్రెండీగా నిలిచింది.

* తప్పు అని తేల్చి చెప్పిన పవన్..
అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లో సమైక్యత భావం ఎక్కువ. దేశభద్రతకు విఘాతం కలిగేలా ఎవరు వ్యవహరించినా పవన్ కళ్యాణ్ నిలదీస్తుంటారు. ఇప్పుడు జనతా కాక్రోచ్ పార్టీ గురించి కూడా ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్. సమాజానికి విఘాతం కలిగించే బొద్దింకలను, కాక్రోచ్ పార్టీని సమూలంగా నాశనం చేయాల్సిన అవసరం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్. సమాజానికి ఇటువంటివి ఎంత మాత్రం ఉపయోగపడవని అభిప్రాయపడ్డారు. అందుకే అటువంటి వ్యవస్థకు ప్రోత్సహించాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు. జనతా కాక్రోచ్ పై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్న వేళ.. పవన్ ఈ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇవే ఇప్పుడు వైరల్ అంశంగా మారాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వెనుక.. ఇంత జరిగిందా..

Dharmendra Pradhan: నరేంద్ర మోడీ ఒప్పుకోలేదు. అమిత్ షా అంగీకరించలేదు. కేంద్ర మంత్రివర్గం కూడా ఈ విషయంలో సానుకూలంగా లేదు. అయినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశారు.. రాజీనామా చేయాల్సిన...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas: దేశం గర్వించే దినం.. కార్గిల్‌ విజయం

Kargil Vijay Diwas: దాయాది దేశం పాకిస్తాన్‌తో 1999లో జరిగిన కార్గిల్‌ యుద్ధం భారత సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. నిట్టనిలువు పర్వతాల మీద, అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైనికులు చూపిన...
Samsung Galaxy S25

Samsung Galaxy S25: ఈ ఫోన్ పై రూ.18,000 తగ్గింపు.. బ్యాంక్ ఆఫర్స్ కూడా వర్తింపు..

Samsung Galaxy S25: ప్రముఖ మొబైల్ కంపెనీ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్లు అంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కాస్త ధర ఎక్కువైనా అద్భుతమైన ఫీచర్లు, అనుకూలమైన సాఫ్ట్...
Festivals this year

Festivals this year: ఈ ఏడాదిలో ముఖ్యమైన పండుగలు ఏ తేదీల్లో ఉన్నాయంటే..

Festivals this year: తెలుగు పంచాంగం ప్రకారం.. ఆషాడ మాసం లో వచ్చే తొలి ఏకాదశి తో పండుగల సీజన్ ప్రారంభమైనట్లు గా భావిస్తారు. ఆషాడ మాసం పూర్తికాగానే వరుసగా పండుగలు వస్తుంటాయి....
YCP Leaders

YCP Leaders: కుమారులతో వైసిపి నేతలకు తలవంపులు!

YCP Leaders: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వింత పరిస్థితి కనిపిస్తోంది. ఆ పార్టీలో దూకుడు కలిగిన నేతలు చుట్టూ ఇప్పుడు కేసులు అలుముకుంటున్నాయి. అయితే అవి కూటమి ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు....
Oktelugu Epaper