spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బలహీనమైతే.. కాపుల పరిస్థితి ఏంటి?!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బలహీనమైతే.. కాపుల పరిస్థితి ఏంటి?!

Pawan Kalyan: ఏపీ ( Andhra Pradesh) రాజకీయాలు విచిత్రంగా మారుతున్నాయి. కూటమి మధ్య రోజు రోజుకు బంధం బలపడుతోంది. కూటమిలో విచ్ఛిన్నం రానిదే వైసిపికి ఛాన్స్ లేదన్నట్టు పరిస్థితి ఉంది. విజయసాయి రెడ్డి లాంటి రాజకీయాలు తెలిసిన వ్యక్తి కూడా దీనిని తేల్చేశారు. కూటమి ఉన్నంతవరకు జగన్ అధికారంలోకి రారని కూడా తేల్చి చెప్పారు. తనకు మళ్ళీ అవకాశం ఇస్తే కూటమిలో విచ్చిన్నానికి ప్రయత్నిస్తాను అన్నట్టు ఆయన మాట్లాడారు. కానీ విజయసాయి రెడ్డి అవసరం లేదు. తమ పార్టీ నేతలు చాలు అన్నట్టు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎలాగూ చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ విడిపోరు. ఆ రెండు పార్టీలతో కలిసి వెళుతుంది బిజెపి. అందుకే ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. కాపులతో రాజకీయం చేయడం ద్వారా… పవన్ కళ్యాణ్ ను బలహీనపరచడం ద్వారా.. కూటమి బలం తగ్గించవచ్చు అన్న ఆలోచన చేస్తున్నారు.

* ఆ ప్రయత్నంలో వైసీపీ కాపు నేతలు..
అంబటి రాంబాబును( ambati Rambabu) ఇప్పుడు కాపు నాయకుడిగా ప్రాజెక్ట్ చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. దీని వెనుక కాపు వ్యూహం ఉంది. టిడిపి తో జనసేన కలిసి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గెలవలేరు.. వారు విడిపోవాలని అనుకోవడం లేదు. ఏం చేసినా విడిపోయే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే పవన్ కళ్యాణ్ ను బలహీనం చేయాలి. అలా చేయాలంటే కాపుల ఆలోచన మారాలి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గంతో కాపులకు వైరుధ్యం వచ్చేలా చేయాలి. అందులో భాగంగానే అంబటి రాంబాబు తిట్ల దండకం అని విశ్లేషణలు కూడా ఉన్నాయి. చంద్రబాబును తిట్టడం ద్వారా కమ్మ సామాజిక వర్గం వారికి కోపం రావాలి. వారి నుంచి వచ్చే విమర్శలతో కాపు సామాజిక వర్గంలో ఆగ్రహం తేవాలి. తద్వారా కాపులు కూటమి నుంచి టర్న్ కావాలి.

* ఆ ఆలోచనతోనే..
పవన్ కళ్యాణ్ ( AP deputy CM Pawan Kalyan) వెంట మెజారిటీ కాపులు ఉన్నారు అన్నది జగన్ అంచనా. పవన్ కళ్యాణ్ నుంచి కాపులను దూరం చేస్తే తన రాజకీయానికి సులువు అవుతుందని జగన్మోహన్ రెడ్డి బలంగా విశ్వసిస్తున్నారు. ఆపై కూటమి పార్టీలో ఛాన్స్ లేక వైసీపీలో కొనసాగుతున్న కాపు నేతలకు మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. అందుకే అంబటి ఎపిసోడ్ ద్వారా పవన్ కళ్యాణ్ నుంచి కాపులను దూరం చేసేందుకు వైసీపీ కాపు నేతలు కూడా పాల్గొన్నారు. తమ పాత్ర పోషిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని బలహీనం చేయడం అంటే తమను తాను బలహీనం చేసుకోవడం అని కాపులు నమ్మినంతకాలం వీరి డ్రామాలు చెల్లకపోవచ్చు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

YS Jagan Mohan Reddy

YS Jagan Mohan Reddy: ఫైర్ బ్రాండ్లకు జగన్ షాక్!

YS Jagan Mohan Reddy: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పార్టీ నడిపే విధానంపై సీనియర్లు కాస్త ఆగ్రహంగా ఉన్నారు. ఇకనైనా మేల్కొనకపోతే ఇబ్బందికర పరిస్థితులు...
Vivo T5 Lite

Vivo T5 Lite: పవర్ ఫుల్ బ్యాటరీ… లో బడ్జెట్.. ఈ ఫోన్ అమ్మకాలు ప్రారంభం..

Vivo T5 Lite: ప్రస్తుత కాలంలో ఫోన్ కొనే వినియోగదారులు బ్యాటరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కువ సేపు ఫోన్ వినియోగం అవసరం ఉండడంతో పవర్ ఫుల్ బ్యాటరీ ఉండే మొబైల్స్...
Today 24 July 2026 Horoscope

Today 24 July 2026 Horoscope: ఈ ఐదు రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. వారి ఇంట్లో ధన...

Today 24 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రవారం ద్వాదశ రాశులపై అనురాధ నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఈరోజు లక్ష్మీదేవి అనుగ్రహం ఉండడం ద్వారా...

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
Oktelugu Epaper