Pawan Kalyan: వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏపీ రాష్ట్రంలో ఒక్క రోడ్డు కూడా వేయలేదు. రోడ్లు ధ్వంసమైనా పట్టించుకోలేదు. ఐదేళ్ల పరిపాలన కాలంలో రోడ్లు సరిగా లేక ఏపీ ప్రజలు నరకం చూశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్లను బాగు చేయడం మొదలుపెట్టింది. వాస్తవానికి రోడ్లు బాగయితే అభివృద్ధి వేగంగా సాగిపోతూ ఉంటుంది. రవాణాకు అనుకూలమైన మార్గాలు ఏర్పడి.. ప్రజల జీవితాలు సమూలంగా మారిపోతాయి. కానీ ఏపీ రాష్ట్రంలో రోడ్ల బాగును వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైగా రోడ్లను ధ్వంసం చేస్తున్నారు.
స్థానిక ఎన్నికల నేపథ్యంలో.. పోటీ చేసే దమ్ము లేక.. వైసీపీ నేతలు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వాహనాలు తగలబెడుతున్నారు. కూటమి కార్యకర్తల మీద దాడులు చేస్తున్నారు. అంతటితోనే ఆగడం లేదు. ఒక వైసీపీ నాయకుడు ఏకంగా తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన రహదారని ధ్వంసం చేశారు.. రోడ్డును అత్యంత నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తే.. జెసిబి ని తీసుకొచ్చి ధ్వంసం చేశాడు.
తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలోని అనంతసముద్రం, పాపక్క గారి పల్లె గ్రామాల మధ్యలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా ఈ రహదారి నిర్మించారు. ఈ రహదారిని వైసీపీ నేత ధ్వంసం చేయడంతో.. పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. తన ఉగ్రరూపాన్ని చూపించారు. ఏపీ రాష్ట్రంలో రోడ్లను బాగుచేయడానికి కంకణం కట్టుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెడితే రాయలసీమ వరకు దాదాపు అన్ని రోడ్లను ఆయన బాగు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కష్టపడి రోడ్డులను బాగు చేస్తుంటే వైసీపీ కార్యకర్తలు ఇలా ధ్వంసం చేయడం పట్ల పవన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు..
పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా అనంతసముద్రం, పాపకు గారి పల్లె మద్య సుమారు 4.75 కోట్ల ఖర్చుతో వారం క్రితం రహదారి నిర్మించారు. అయితే వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి అనే వ్యక్తి.. వెంకటసుబ్బారెడ్డి అనే మరో వ్యక్తి సహాయంతో జెసిబి తో.. దాదాపు 100 మీటర్ల మేర రహదారిని దున్నేశారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్.. ప్రజల కోసం.. ప్రభుత్వా నిధులతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడం పట్ల తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ చర్యకు పాల్పడిన వ్యక్తి మీద నాన్ బెయిలబుల్.. సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.
రోడ్డును ధ్వంసం చేసిన ప్రత్యక్ష నిందితులతో పాటు.. ఈ ఘటన వెనుక ఉండి నడిపించిన రాజకీయ శక్తుల పాత్ర పై కూడా విచారణ జరిపి.. బాధ్యులను చట్టం ముందు నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసే ఘటనలలో బాధ్యులపై చర్యలు తీసుకోవడంతో పాటు.. ఇలాంటి చర్యలకు పాల్పడే వ్యక్తుల వివరాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ వివరించారు.
ధ్వమసమైన రహదారిని తిరిగి నిర్మించేందుకు అయ్యే ఖర్చుతో పాటు.. ప్రభుత్వానికి జరిగిన మొత్తం నష్టాన్ని అంచనా వేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బాధ్యులైన వ్యక్తుల నుంచే తన నష్టాన్ని రికవరీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని.. దీనికోసం రెవెన్యూ రికవరీ యాక్ట్ ఉపయోగించాలని సూచించారు. భవిష్యత్తులో ప్రభుత్వ ఆస్తులు.. ప్రజా మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయకుండా నిరోధించే విధంగా ఈ చర్యలు ఉండాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.