Homeఆంధ్రప్రదేశ్‌Nagari Municipality: నగరి టిడిపికి ఏకగ్రీవం.. రోజా దగ్గరుండి కుట్ర చేశారా..

Nagari Municipality: నగరి టిడిపికి ఏకగ్రీవం.. రోజా దగ్గరుండి కుట్ర చేశారా..

Nagari Municipality: ఏపీలో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలలో రకరకాల నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్బాయి. వైసీపీలో కీలకమైన నాయకులుగా పేరుపొందిన వారి నియోజకవర్గాలలో పోటీ పోరా పోరిగా సాగుతోంది అనుకుంటే.. ఏకపక్షంగా ముగుస్తుంది. అయితే టిడిపి లేకుంటే జనసేన.. లేకుంటే బిజెపి ఏకపక్షంగా ఆయా మున్సిపాలిటీలను దక్కించుకుంటున్నాయి. సాధారణంగా గ్రామాలలో సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారంటే ఏదో ఒప్పందం కుదిరింది అనుకోవచ్చు.. కానీ మున్సిపాలిటీలను కూడా ఏకగ్రీవం చేసుకుంటున్నారు అంటే మామూలు విషయం కాదు. వైసీపీలో కీలక నాయకురాలు.. […]

Nagari Municipality: ఏపీలో స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికలలో రకరకాల నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్బాయి. వైసీపీలో కీలకమైన నాయకులుగా పేరుపొందిన వారి నియోజకవర్గాలలో పోటీ పోరా పోరిగా సాగుతోంది అనుకుంటే.. ఏకపక్షంగా ముగుస్తుంది. అయితే టిడిపి లేకుంటే జనసేన.. లేకుంటే బిజెపి ఏకపక్షంగా ఆయా మున్సిపాలిటీలను దక్కించుకుంటున్నాయి. సాధారణంగా గ్రామాలలో సర్పంచ్ స్థానాలను ఏకగ్రీవం చేసుకున్నారంటే ఏదో ఒప్పందం కుదిరింది అనుకోవచ్చు.. కానీ మున్సిపాలిటీలను కూడా ఏకగ్రీవం చేసుకుంటున్నారు అంటే మామూలు విషయం కాదు.

వైసీపీలో కీలక నాయకురాలు.. మాజీ మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో టిడిపి తిరుగులేని విజయాన్ని అందుకుంది. వైసీపీలో ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరుపొందిన రోజా.. అనుచరులతో దగ్గరుండి మరి నామినేషన్లు వేయించారు. అయినప్పటికీ ఇక్కడ టిడిపి ఏకపక్షంగా నగరి నియోజకవర్గాన్ని సొంతం చేసుకుంది. రోజా దగ్గరుండి మరి నామినేషన్లు వేయించినప్పటికీ.. ఒక్కదాంట్లో కూడా సరైన వివరాలు లేవు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో దాడులు.. విధ్వంసాలు జరిగితే.. నగరి ప్రాంతంలో మాత్రం వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఇలాంటి చోట రోజా తన బలాన్ని నిరూపించుకోలేకపోయారు.

వైసీపీలో తనకు తానే గొప్ప లీడర్ ని అని చెప్పుకుంటారు రోజా. పైగా తనకు వ్యతిరేకంగా ఎవరైనా గొంతు సవరిస్తే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారు. సస్పెండ్ చేయించే దాకా వెనుకాడరు.. ఇక తాజాగా నగరిలో క్షేత్రస్థాయిలో సరైన అభ్యర్థులను నిలబెట్టడంలో రోజా విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. నామినేషన్ల పరిశీలన సమయంలో తగిన స్థాయిలో అప్రమత్తత ప్రదర్శించలేదని.. అందువల్లే ఈ స్థానం చేజారిపోయిందని విమర్శలు ఉన్నాయి. దీని వెనక ఏదైనా జరిగిందా.. ప్రత్యర్థి పార్టీతో ఒప్పందం చేసుకున్నారా.. అనే అనుమానాలను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

ఏకగ్రీవం కావడానికి రోజా కారణమని మీడియాలో భారీ ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో.. వీటిని ఆమె ఖండించారు. అంతేకాదు కోర్టుకు వెళ్తానని చెబుతున్నారు. హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేస్తామని రోజా చెప్తున్నారు. డెమోక్రసీని అబాహ్యం చేసే విధంగా అధికార పార్టీ కుట్ర చేసిందని రోజా ఆరోపిస్తున్నారు. ఆమె ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ.. సొంత నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీకి మున్సిపాలిటీ ని అప్పగించడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మున్సిపాలిటీలు లేదా ఇతర స్థానాలు ఏకగ్రీవం అయితే వచ్చే అసెంబ్లీలో టికెట్ ఇచ్చేది లేదని జగన్ స్పష్టం చేశారు. ఈ ప్రకారం చేసుకుంటే వచ్చే ఎన్నికల్లో రోజాకు జగన్ టికెట్ ఇవ్వరా.. ఇచ్చే అవకాశం లేదా.. ఒకవేళ టికెట్ ఇస్తే జగన్ తన మాట తానే తప్పినట్టు అవుతారు కదా అని.. రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper