Homeఆంధ్రప్రదేశ్‌Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ పెట్టుబడుల వేట!

Nara Lokesh: దక్షిణ కొరియాలో లోకేష్ పెట్టుబడుల వేట!

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో భాగంగా ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు, ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆకర్షించేందుకు వీలుగా.. లోకేష్ నేతృత్వంలో ఏం చేస్తున్న ప్రయత్నాలు అందరి ప్రశంసలను అందుకుంటున్నాయి. దక్షిణ కొరియా ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలో పనిచేసే అత్యున్నత పరిశోధనా సంస్థ కొరియా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీ ఇండియా, సౌత్ ఆసియా టీం హెడ్ […]

Nara Lokesh: మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రానికి పెట్టుబడుల వేటలో భాగంగా ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఏపీని పెట్టుబడుల స్వర్గధామంగా తీర్చిదిద్దేందుకు, ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆకర్షించేందుకు వీలుగా.. లోకేష్ నేతృత్వంలో ఏం చేస్తున్న ప్రయత్నాలు అందరి ప్రశంసలను అందుకుంటున్నాయి. దక్షిణ కొరియా ప్రధానమంత్రి కార్యాలయం పరిధిలో పనిచేసే అత్యున్నత పరిశోధనా సంస్థ కొరియా ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ పాలసీ ఇండియా, సౌత్ ఆసియా టీం హెడ్ క్యూంగ్ హూన్ కిమ్ లోకేష్ టూర్ ను అభినందిస్తూ ట్విట్ చేశారు. ఎకనామిక్ డిప్లమసి ఎల్ ఫుల్ త్రాటిల్ అంటూ ఏపీ టీం పర్యటనను కొనియాడారు. నారా లోకేష్ బృందం దక్షిణ కొరియా పర్యటనలు ఏమాత్రం సమయం వృధా చేయకుండా.. గ్లోబల్ మార్కెట్ ను శాసిస్తున్న షూ ఆల్స్, సోలమ్, అపాక్ట్, సాంసంగ్, ఎల్జి, బు యంగ్, హ్వాసింగ్ వంటి ఎన్నో దిగ్గజ బహుళ జాతి కంపెనీల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహించడాన్ని ప్రస్తావించారు. హాట్సాఫ్ టు ద టీం అంటూ కిమ్ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు.

* పెట్టుబడులపైనే ఫోకస్..
లోకేష్ నిజంగా చేస్తున్న ప్రయత్నాలు ఆహ్వానించాల్సిందే. ఎందుకంటే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి ఆయన పెట్టుబడులపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. విదేశీ పర్యటనలు చేస్తూ భారీగా పరిశ్రమలను తెస్తున్నారు. గత ఐదేళ్ల కాలంలో పెట్టుబడులు లేక ఏపీ స్తబ్దుగా మారింది. కానీ ఇప్పుడు చంద్రబాబు విజన్, నారా లోకేష్ స్పీడ్ తో పూర్వ వైభవం రావడం ఖాయం అనే నమ్మకం పారిశ్రామిక వర్గాల్లో వ్యక్తం అవుతుంది. ఒక దేశ ప్రధాని కార్యాలయం కింద పనిచేసి అంతర్జాతీయ ఆర్థిక నిపుణుడే స్వయంగా లోకేష్ ఎకనామిక్ డిప్లమసిని మెచ్చుకోవడం.. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను గ్లోబల్ లెవెల్లో మరింత పెంచిందనడంలో సందేహం లేదు.

* రేపు భారీ రోడ్ షో..
ఈనెల 10 వరకు పర్యటన కొనసాగనుంది దక్షిణ కొరియాలో. రేపు భారీ రోడ్ షో ఉండనుంది. దక్షిణ కొరియా రాజధాని సియోల్ లోని ప్రఖ్యాత లొట్టి హోటల్ క్రిస్టల్ బాల్ రూమ్ లో భారీ ఎత్తున ఏపీ – దక్షిణ కొరియా బిజినెస్ ఫోరం, సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షో నిర్వహించబోతున్నట్లు కిమ్ తన పోస్టులో పేర్కొన్నారు. ఏపీ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్, కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఇండియన్ ఎంబసీ సమన్వయంతో.. జూలై 10 మధ్యాహ్నం 3:30 గంటల నుంచి ఈ రోడ్ షో మొదలు కానుంది. దక్షిణ కొరియాలోని అగ్రశ్రేణి కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున ముందుకు వచ్చే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper