Homeఆంధ్రప్రదేశ్‌Lokesh Helping Student: ఆ చిన్నారిపై పెద్ద మనసు చాటుకున్న లోకేష్!

Lokesh Helping Student: ఆ చిన్నారిపై పెద్ద మనసు చాటుకున్న లోకేష్!

Lokesh Helping Student: నారా లోకేష్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తన దృష్టికి వచ్చిన ఓ పేద విద్యార్థి సమస్యకు పరిష్కార మార్గం చూపించారు. లోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఏదైనా సమస్యపై సామాన్యులు తనకు ట్యాగ్ చేస్తే.. సమస్య తీవ్రతను బట్టి ఇట్టే స్పందిస్తారు. ముఖ్యంగా వీడియో, ఫోటో తో తమ గోడును వెల్లబోసుకుంటే.. అలాంటి పోస్టులకు వెంటనే రియాక్ట్ అవుతారు. రాజ్యాంగ ఓ చిన్నారి లోకేష్ […]

Lokesh Helping Student: నారా లోకేష్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తన దృష్టికి వచ్చిన ఓ పేద విద్యార్థి సమస్యకు పరిష్కార మార్గం చూపించారు. లోకేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ఏదైనా సమస్యపై సామాన్యులు తనకు ట్యాగ్ చేస్తే.. సమస్య తీవ్రతను బట్టి ఇట్టే స్పందిస్తారు. ముఖ్యంగా వీడియో, ఫోటో తో తమ గోడును వెల్లబోసుకుంటే.. అలాంటి పోస్టులకు వెంటనే రియాక్ట్ అవుతారు. రాజ్యాంగ ఓ చిన్నారి లోకేష్ మామ నాకు సీటు కావాలి అంటూ పెట్టిన వీడియో చూసిన మంత్రి లోకేష్ వెంటనే ఎక్స్ వేదికగా స్పందించారు. సమస్యకు పరిష్కారం చూపించి ఆకట్టుకున్నారు.

* సీటు రాకపోవడంతో..
కర్నూలు జిల్లాకు చెందిన మానస అనే చిన్నారి కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం పాఠశాలలో సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఆ చిన్నారికి సీటు రాలేదు. దీంతో తనకు ఎలాగైనా కేజీబీవీలు సీటు వచ్చేలా చేయాలంటూ ఆ చిన్నారి ఒక వీడియోను విడుదల చేసింది. నేరేడుప్పల గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీల కుటుంబానికి చెందిన మానస ఐదో తరగతి పూర్తి చేసింది. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం కేజీబీవీ పరీక్ష రాసినా అందులో సెలెక్ట్ కాలేదు. ఈ క్రమంలో పొలం పనులు చేస్తూ.. ఆ పొలంలో నుంచి తన ఆవేదనను వీడియో తీసి మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువచ్చింది. ఈ వీడియో పై స్పందించిన మంత్రి నారా లోకేష్ మానస చదువుకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

* నిరుపేద కుటుంబం
మానస తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఈ క్రమంలో తన చదువు మధ్యలోనే ఆగిపోతోందన్న ఆందోళన మానసలో పెరిగింది. ఈ క్రమంలోనే లోకేష్ మామ అంటూ మానస చేసిన విజ్ఞప్తి ప్రతి ఒక్కరిని కదిలించింది. దీనిపై నారా లోకేష్ స్పందించారు. సంబంధిత అధికారులను ఆదేశించారు. మానసకు హాస్టల్ సీటు ఇప్పించడమే కాకుండా.. ఆమె చదువుకు సహాయం చేస్తానని కూడా మాట ఇచ్చారు. బాగా చదువుకుని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి అంటూ చిన్నారి మానసకు ఆశీస్సులు అందించారు. దీనిపై మానస తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ మంత్రి నారా లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper