Homeఆంధ్రప్రదేశ్‌Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్టుకు పేరు ఫిక్స్.. చంద్రబాబు ప్లాన్ అదుర్స్

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్ పోర్టుకు పేరు ఫిక్స్.. చంద్రబాబు ప్లాన్ అదుర్స్

అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణాన్ని శరవేగంగా జరపాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. భోగాపురంలో నిర్మిస్తున్న ఈ ఎయిర్ పోర్టుకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఖరారు చేసింది కూటమి ప్రభుత్వం.

Bhogapuram Airport: కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉంది. కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి పేరు ఫిక్స్ చేసింది. శాసనసభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు సీఎం చంద్రబాబు. ఎయిర్పోర్ట్ కు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడంతో పాటు పక్కనే ఆయన స్మారక మ్యూజియం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన బిల్లును శాసనసభ ఆమోదించింది. శాసనమండలిలో సైతం ఆమోదం పొందింది. అల్లూరి పేరును మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రతిపాదించారు. దీంతో శాసనసభలో సభ్యులు ఆమోదం తెలిపారు. పార్లమెంటులో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలు పెట్టాలని భావించామని.. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంట్లో పెడతామని.. అవసరమైతే తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని చంద్రబాబు చెప్పారు. అల్లూరి సీతారామరాజు గొప్ప పోరాట యోధుడిగా అభివర్ణించారు. ప్రధాని మోదీ అల్లూరి సీతారామరాజు 125వ జయంతిని పురస్కరించుకుని.. కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయాన్ని గుర్తు చేశారు బాబు. దేశం కోసం పోరాడిన ఇలాంటి వీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే అల్లూరి పేరును భోగాపురం ఎయిర్ పోర్టుకు పెట్టాలని నిర్ణయం తీసుకున్నామని వివరించారు.

* పనులు వేగవంతం
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి కావడం, టిడిపికి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఎంపిక కావడంతో ఇక్కడి ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరగడానికి అవకాశం ఏర్పడింది. 2026 నాటికి ఈ ఎయిర్ పోర్ట్ నుంచి తొలి విమానం ఎగరాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీనికి అనుగుణంగా మంత్రి రామ్మోహన్ నాయుడు అడుగులు వేస్తున్నారు. పనులను నిత్య పర్యవేక్షణ చేస్తున్నారు.

* పక్కా వ్యూహంతోనే
మరోవైపు విజయనగరం జిల్లాలో గిరిజన యూనివర్సిటీ నిర్మితమవుతోంది. ఇంకోవైపు భారత నావికా దళానికి సంబంధించి ఆయుధ డిపో ఏర్పాటుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇలా జాతీయ సంస్థలన్నీ ఉత్తరాంధ్రలో కొలువుతీరుతున్నాయి. ఇంకోవైపు ప్రత్యేక రైల్వే జోన్ ఉత్తరాంధ్ర కేంద్రంగా ఏర్పాటు కానుంది. అందుకే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కు మన్యం వీరుడు పేరు పెడితే రాజకీయంగా కలిసి వస్తుందని కూడా కూటమి ప్రభుత్వం అంచనా వేస్తోంది. పైగా గత ఐదు సంవత్సరాలుగా కుటుంబ సభ్యుల పేర్లతో జగన్ నింపేశారు. దానికి చెక్ చెబుతూ ఇప్పుడు మహనీయుల పేర్లను పథకాలకు పెడుతోంది కూటమి ప్రభుత్వం. అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి పేరు పెట్టడం శుభపరిణామం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper