Homeఎంటర్టైన్మెంట్Actress Sneha: అభిమానిని ముద్దుల్లో ముంచెత్తిన హీరోయిన్ స్నేహా..వీడియో వైరల్!

Actress Sneha: అభిమానిని ముద్దుల్లో ముంచెత్తిన హీరోయిన్ స్నేహా..వీడియో వైరల్!

Actress Sneha: తెలుగు , తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ , ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న స్నేహ , ఇప్పటికీ సినిమాల్లో హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. మంచి సంసార పక్షమైన హీరోయిన్ అని , సౌందర్య తర్వాత అంతటి గొప్ప నటి ఈమెనే అనే ఫీలింగ్ జనాల్లో ఉండబట్టే , ఇంతమంది […]

Actress Sneha: తెలుగు , తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ , ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకున్న స్నేహ , ఇప్పటికీ సినిమాల్లో హీరోయిన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ ఫుల్ బిజీ గా ఉంటున్న సంగతి తెలిసిందే. మంచి సంసార పక్షమైన హీరోయిన్ అని , సౌందర్య తర్వాత అంతటి గొప్ప నటి ఈమెనే అనే ఫీలింగ్ జనాల్లో ఉండబట్టే , ఇంతమంది కొత్త హీరోయిన్స్ వచ్చినా ఆమెకు డిమాండ్ తగ్గకపోవడానికి కారణం అని అంటుంటారు విశ్లేషకులు. అంతే కాదు స్నేహ తన అభిమానులను కూడా చాలా గౌరవిస్తుంది , రీసెంట్ గానే ఒక అభిమాని స్నేహ ఇంటికి వచ్చి, ఆమెని కలిసి , ఆమె కెరీర్ లోని సూపర్ హిట్ పాటని పాడుతాడు. అతని వాయిస్ అద్భుతంగా ఉండడం తో దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

స్నేహా ఒక అభిమాని పట్ల ఇలా వ్యవహరించడం ఇదే తొలిసారి. ఆ వీడియో లో ఉన్నటువంటి అభిమాని పాడిన పాట కూడా చాలా అద్భుతంగా ఉంది. అందుకే స్నేహ ఆనందాన్ని కంట్రోల్ చేసుకోలేక ముద్దు పెట్టింది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే స్నేహా రీసెంట్ గా మూకుతి అమ్మన్ 2 అనే చిత్రం లో కీలక పాత్ర పోషించింది. వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో నయనతార ప్రధాన పాత్ర పోషిస్తుండగా , రెజీనా కాసాండ్రా మెయిన్ విలన్ గా నటించింది. ఎప్పుడో విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం గ్రాఫిక్స్ వర్క్ కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఎట్టకేలకు అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని వచ్చే నెల దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ చిత్రం. వీటితో పాటు తెలుగు లో కూడా ఆమె రెండు సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper