Homeఆంధ్రప్రదేశ్‌Malla Reddy: మల్లారెడ్డి కోడలా మజాకా..మేఘా సుధా రెడ్డిని మించిపోయిందిగా..

Malla Reddy: మల్లారెడ్డి కోడలా మజాకా..మేఘా సుధా రెడ్డిని మించిపోయిందిగా..

Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియాలో.. సోషల్ మీడియాలో ఆయన గురించి ప్రతిరోజు ఏదో ఒక రకంగా చర్చ నడుస్తూనే ఉంటుంది. ఆయన కూడా మీడియాలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఏదో ఒక రకమైన పని చేస్తుంటారు. అది కాస్త సెన్సేషన్ అవుతుంది. తాజాగా మల్లారెడ్డి ప్రమేయం లేకుండానే ఒక సంఘటన జరిగింది. అది కాస్త ఆయనతోపాటు.. ఆయన కోడలు ప్రీతి రెడ్డిని కూడా వార్తల్లో నిలిచేలా చేసింది. ప్రీతి […]

Malla Reddy: మాజీ మంత్రి మల్లారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీడియాలో.. సోషల్ మీడియాలో ఆయన గురించి ప్రతిరోజు ఏదో ఒక రకంగా చర్చ నడుస్తూనే ఉంటుంది. ఆయన కూడా మీడియాలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఏదో ఒక రకమైన పని చేస్తుంటారు. అది కాస్త సెన్సేషన్ అవుతుంది.

తాజాగా మల్లారెడ్డి ప్రమేయం లేకుండానే ఒక సంఘటన జరిగింది. అది కాస్త ఆయనతోపాటు.. ఆయన కోడలు ప్రీతి రెడ్డిని కూడా వార్తల్లో నిలిచేలా చేసింది. ప్రీతి రెడ్డి రాజకీయాల్లోకి వస్తున్నారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంతవరకు మల్లారెడ్డి కుటుంబం క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే ఆ మధ్య ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తన మామ మల్లారెడ్డి తో కలిసింది. అంతకుముందు బోనాల వేడుకలో ఓ బిజెపి కార్యకర్త ఇంటికి భోజనానికి వెళ్ళింది. ఆ సమయంలో బండి సంజయ్ కూడా అక్కడే ఉన్నారు. దీంతో మల్లారెడ్డి కోడలు బిజెపిలో చేరుతున్నారని ప్రచారం మొదలైంది.

మల్లారెడ్డి కూడా ఆమధ్య గులాబీ పార్టీకి దూరంగా ఉన్నటువంటి వార్తలు వచ్చాయి. మల్లారెడ్డి ఇటీవల గులాబీ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్యాన్స్ కూడా చేశారు. ఇప్పుడు తాజాగా మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి సోషల్ మీడియా మొత్తం తన చుట్టూ తిప్పుకున్నారు. బెంగళూరులోని కోరమంగళ స్టేడియం లో సైమా అవార్డుల వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ తారలతో పాటు.. ప్రీతి రెడ్డి కూడా హాజరయ్యారు. ప్రీతి రెడ్డి కి ఎటువంటి సినీ నేపథ్యం లేకపోయినప్పటికీ ఆమె ఈ ఈవెంట్లో కనిపించడం చర్చనీయాంశమైంది

మల్లారెడ్డి విద్యాసంస్థలలో సాధారణంగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతుంటాయి. ఇటీవల టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అక్కడే జరిగింది. ఈ నేపథ్యంలో ఆమెకు సైమా నిర్వాహకులు ఆహ్వానం అందించి ఉంటారని తెలుస్తోంది. వచ్చిన అవకాశాన్ని ప్రీతి రెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. ప్రీతి రెడ్డి ఈవెంట్లో అద్భుతమైన డిజైనర్ దుస్తులు ధరించారు. స్టార్ హీరోయిన్లకు మించిన అందచందాలతో ఆకట్టుకున్నారు. రెడ్ కార్పెట్ మీద ఆమె వేసిన అడుగులు.. ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు అదిరిపోయాయి. పైగా ఆమె హుందాగా ప్రవర్తించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆమె లుక్స్ సోషల్ మీడియాను షేర్ చేస్తున్నాయి. ప్రీతి రెడ్డి గ్లామర్ ను..మేఘా కృష్ణారెడ్డి సతీమణి సుధా రెడ్డితో చాలామంది పోల్చుతున్నారు. అంతర్జాతీయ ఈవెంట్లో సుధా రెడ్డి సందడి చేస్తుంటారు. మెట్ గాలాలో కూడా ఆమె అదరగొడుతుంటారు. అయితే ఇంటర్నేషనల్ వేదికలలో సుధా రెడ్డి అదరగొడితే.. డొమెస్టిక్ వేదికలలో ప్రీతి రెడ్డి సందడి చేస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper