BRICS summit: బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరుగుతోంది. ప్రపంచ దేశాల అధినేతలు వచ్చిన నేపథ్యంలో ఈ స్థాయిలో సమావేశం నిర్వహించడం భారత దేశ దార్శనికతకు నిదర్శనం గా నిలిచింది. భారతదేశం ఈ స్థాయిలో బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం నిర్వహించడం వెనుక లక్ష్యాలు ఏమైనా ఉన్నప్పటికీ.. సమావేశం నిర్వహించిన వేదిక మాత్రం ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును భారత మండపంలో నిర్మిస్తున్నారు. భారత మండపాన్ని ఢిల్లీలోని చారిత్రాత్మకమైన ప్రగతి మైదాన్ లో నిర్మించారు. ఈ మండపాన్ని 2023లో పూర్తి చేశారు. ఈ మండపం ప్రారంభమైన కొద్ది రోజులకే జి20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించారు. ఆసదస్సు విజయవంతమైంది. ఈ వేదికలో అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించడంతో.. ఒకసారిగా దీని గురించి చర్చ మొదలైంది. పైగా భారత మండపానికి దగ్గరలో కీలక ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాలు.. దౌత్య కేంద్రాలు ఉన్నాయి. అందువల్లే ఇక్కడ వరుసగా అంతర్జాతీయ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
7000 మంది కూర్చోవచ్చు
భారత మండపంలో 7000 మంది ఒకేసారి కూర్చునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్లీనరీ హాల్ ను అత్యంత విశాలంగా నిర్మించారు. ప్రపంచ సదస్సులు నిర్వహించడానికి అనుకూలంగా ఇక్కడ డిజిటల్ సాంకేతికతను ఏర్పాటు చేశారు. ప్రపంచ దేశాలు అధినేతలు తమ మాతృ భాషలలో ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఏకకాలంలో అనువాదం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ అతిపెద్దదైన ఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. అత్యాధునిక ప్రసార సౌకర్యాలు ప్రపంచ దేశాలు అధినేతలకు అనుకూలంగా ఉంటున్నాయి.
ఇక్కడ యాంపి థియేటర్ లో ఒకేసారి మూడు వేలమంది ప్రేక్షకులు కూర్చోవచ్చు. అలక్ష చదరపు మీటర్లకు పైగా విస్తీర్ణంలో ఆత్యాధునికమైన ఎగ్జిబిషన్ హాల్స్ నిర్మించారు. ఇంటర్నేషనల్ ఎక్స్ పో.. కల్చరల్ ఈవెంట్స్ ఒకేసారి ఇక్కడ నిర్వహించవచ్చు. ఈ మండపంలో యాంటి డ్రోన్ సాంకేతికత ఉంటుంది. వివిఐపీల రాకపోకలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉన్నాయి. 5500 వాహనాలను పార్కు చేసుకోవడానికి అత్యంత పెద్దదైన భూగర్భ పార్కింగ్ సదుపాయం ఇందులో ఉంది. దీంతో ట్రాఫిక్ ఒత్తిడి పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది.
ఈ భవన నిర్మాణంలో అడుగడుగునా భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తుంది. ఆధునిక ఇంజనీరింగ్ కలయిక కూడా అద్భుతంగా ఉంటుంది. వాస్తవానికి ఈ భవనాన్ని కేవలం ఇటుకలు.. సిమెంట్.. ఇసుక.. ఇనుముతో మాత్రమే కాకుండా.. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా నిర్మించామని.. ఈ భవన నిర్మాత వివేక్ శుక్లా పేర్కొన్నారు.. కాగా, బ్రిక్స్ సదస్సు జరుగుతున్న నేపథ్యంలో.. ప్రపంచ దేశాలు అధినేతలు ఇక్కడ చర్చలు సాగిస్తుంటే.. వారి వెనుక ఇది నయా భారత్ అనే నినాదం కనిపించడం.. మారుతున్న మనదేశ విధానాలకు నిదర్శనం.
Another productive morning at Bharat Mandapam.
Happy to welcome the Leaders of BRICS Member and Partner Countries, Outreach Invitees and Heads of International Organisations. pic.twitter.com/NRCAJrrPDo
— Narendra Modi (@narendramodi) September 13, 2026
Finally, babus changed Bharat Mandapam’s lighting after facing backlash on SM pic.twitter.com/GY1fJa8rOg
— Pulse of the People (@CitizenPulseX) September 13, 2026