HomeతెలంగాణTeenmar Mallanna: కేటీఆర్ కు సారీ చెప్పిన తీన్మార్ మల్లన్న..

Teenmar Mallanna: కేటీఆర్ కు సారీ చెప్పిన తీన్మార్ మల్లన్న..

Teenmar Mallanna: రాజకీయ నాయకులు అయినంతమాత్రాన వాళ్లు ఏమీ దేవుళ్ళు కాదు. వాళ్లు కూడా మనలాంటి మనుషులే. వాళ్లు ఏమి ఆకాశం నుంచి ఊడిపడలేదు. కాకపోతే జనాలు వారు చేసే ప్రతి పనిని సమర్థించడం వల్ల డేమీ గాడ్స్ లాగా భావిస్తూ ఉంటారు. తాము మనుషులము అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతుంటారు. అలాంటి సందర్భంలోనే వారి నాలుక తడబడుతుంది. అనకూడని మాట.. పలక కూడని మాట వారి నోటివెంట నుంచి వస్తుంది. ఒకప్పుడు అంటే ఇటువంటి మాటలకు […]

Teenmar Mallanna: రాజకీయ నాయకులు అయినంతమాత్రాన వాళ్లు ఏమీ దేవుళ్ళు కాదు. వాళ్లు కూడా మనలాంటి మనుషులే. వాళ్లు ఏమి ఆకాశం నుంచి ఊడిపడలేదు. కాకపోతే జనాలు వారు చేసే ప్రతి పనిని సమర్థించడం వల్ల డేమీ గాడ్స్ లాగా భావిస్తూ ఉంటారు. తాము మనుషులము అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతుంటారు. అలాంటి సందర్భంలోనే వారి నాలుక తడబడుతుంది. అనకూడని మాట.. పలక కూడని మాట వారి నోటివెంట నుంచి వస్తుంది.

ఒకప్పుడు అంటే ఇటువంటి మాటలకు అంతగా ప్రాధాన్యం ఉండేది. కానీ ఇప్పుడు మీడియా విస్తృతి పెరిగిపోయింది. అందువల్లే రాజకీయ నాయకులు మాట్లాడే ప్రతి మాటకు ఒక రికార్డు అంటూ ఉంటుంది. నాలుక మడత వేసినంతమాత్రాన సోషల్ మీడియా అబద్ధం చెప్పదు. మీడియా అబద్ధం చెప్పదు. ఎందుకంటే మాట్లాడిన మాటలకు సంబంధించిన ప్రతి వీడియో రికార్డెడ్గా ఉంటుంది. కాకపోతే ఎన్ని ఆధారాలు ఉన్నప్పటికీ చాలామంది రాజకీయ నాయకులు తమ ధోరణి మార్చుకోలేరు.

కాకపోతే ఇప్పుడు తీన్మార్ మల్లన్న తన ధోరణి మార్చుకున్నారు. ఒకప్పుడు నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడిన ఆయన ఇప్పుడు క్షమాపణలు చెబుతున్నారు. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించేవారు. కెసిఆర్ కుటుంబాన్ని తీవ్రమైన పదజాలంతో తిట్టేవారు. ఒక సందర్భంలో కేటీఆర్ కుమారుడిని బాడీ షేమింగ్ చేశారు. అప్పట్లో తీన్మార్ మల్లన్న మాట్లాడిన మాటలపై గులాబీ నేతలు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన కార్యాలయానికి వెళ్లి దాడి కూడా చేశారు. అప్పట్లో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యల పట్ల కవిత కూడా స్పందించారు. కేటీఆర్ కు సంఘీభావం తెలిపారు. అయితే ఇన్నాళ్లకు తాను చేసింది తప్పు అని తీన్మార్ మల్లన్నకు తెలిసింది. అంతేకాదు ఆయన కేటీఆర్ కు క్షమాపణలు కూడా చెప్పారు. ఆరోజు అలా మాట్లాడాల్సి ఉండేది కాదని పేర్కొన్నారు.

ఇటీవల ఓ సుప్రసిద్ధ జర్నలిస్ట్ నిర్వహించిన ఇంటర్వ్యూలో తీన్మార్ మల్లన్న మాట్లాడారు. కేటీఆర్ కుమారుడు మీద చేసిన వ్యాఖ్యలను ఆ జర్నలిస్ట్ ప్రస్తావిస్తే.. తీన్మార్ మల్లన్న తాను చేసింది తప్పు అని ఒప్పుకున్నారు. తాను అలా మాట్లాడి ఉండకూడదని చెప్పారు. బాడీ షేమింగ్ చేయడం వల్ల కేటీఆర్ కుటుంబ సభ్యులు బాధపడ్డారని తన దృష్టికి వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. నాడు తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. తీన్మార్ మల్లన్న మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియోలను గులాబీ పార్టీ నాయకులు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్కులేట్ చేస్తున్నారు. మొత్తానికి రాజకీయాలలో ఉన్న నాయకులు వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకపోవడమే మంచిది. ఒకవేళ ప్రస్తావిస్తే ఇదిగో తీన్మార్ మల్లన్న మాదిరిగానే క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper