Homeఆంధ్రప్రదేశ్‌Kodali Nani: అజ్ఞాతంలోకి కొడాలి నాని?!

Kodali Nani: అజ్ఞాతంలోకి కొడాలి నాని?!

Kodali Nani: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరచూ ఆరోపిస్తూ ఉంటుంది. వైసిపి హయాంలో టిడిపి శ్రేణులను ఇబ్బంది పెట్టిన నేతలతో పాటు అధికారుల పేర్లు రాసుకుంటున్నానని చెప్పి లోకేష్ రెడ్ బుక్ చూపించారు అప్పట్లో. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందని సంకేతాలు ఇచ్చారు. వైసీపీకి అది ప్రతికూల అంశం గా కనిపించవచ్చు. కానీ టిడిపి శ్రేణులు మాత్రం రెడ్ […]

Kodali Nani: ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరచూ ఆరోపిస్తూ ఉంటుంది. వైసిపి హయాంలో టిడిపి శ్రేణులను ఇబ్బంది పెట్టిన నేతలతో పాటు అధికారుల పేర్లు రాసుకుంటున్నానని చెప్పి లోకేష్ రెడ్ బుక్ చూపించారు అప్పట్లో. అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ తన పని తాను చేసుకుంటూ ముందుకు సాగుతుందని సంకేతాలు ఇచ్చారు. వైసీపీకి అది ప్రతికూల అంశం గా కనిపించవచ్చు. కానీ టిడిపి శ్రేణులు మాత్రం రెడ్ బుక్ ను ఒక పవిత్ర గ్రంథంగా చూస్తున్నారు. అయితే కూటమి రెండేళ్ల పాలన పూర్తవుతున్న తరుణంలో రెడ్బుక్ సైతం అమలు చేయాలని కోరుతున్నారు తమ పార్టీ యువ నేత లోకేష్ ను. మొన్ననే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది కూటమి. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని పై కేసు విచారణలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఏ క్షణం అయినా కొడాలి నాని అరెస్టు తప్పదన్న ప్రచారం నడుస్తోంది. ఆయన సైతం అరెస్టు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు టాక్ నడుస్తోంది.

* ఎన్నికల నియమావళి ఉల్లంఘన..
వైసిపి హయాంలో 2021లో పంచాయితీ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో ప్రభుత్వంతో రాష్ట్ర ఎన్నికల అధికారి వివాదం నడిచింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ అధికారిగా ఉండేవారు. ఈ వివాద క్రమంలో అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాలి నాని చంద్రబాబుతో పాటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఫిర్యాదు చేసిన కేసు విచారణ జరగలేదు. కొడాలి నాని మంత్రిగా ఉండడంతో ప్రభుత్వ అనుమతి లేదని భావించి.. విచారణ జరపలేదు. అయితే ఇప్పుడు ప్రాసిక్యూషన్కు రాష్ట్ర ప్రభుత్వ హోం శాఖ అనుమతి జారీ చేసింది. దీంతో విచారణ ప్రారంభమైంది. అయితే ఆ ఒక్క కేసు మాత్రమే కాదు. వరుసగా కేసులు నమోదు కానున్నాయి కొడాలి నాని పై.

* ఏ క్షణమైనా అరెస్టు..
తాజాగా కొడాలి నాని పై కేసులు నమోదు అవుతుండడంతో.. ఆయన అరెస్టు తప్పదన్న ప్రచారం జరుగుతోంది. మళ్లీ రెడ్ బుక్ పాలన మొదలైందని వైసిపి ఎద్దేవా చేస్తోంది. కానీ కూటమి పార్టీల శ్రేణులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పటివరకు నమోదైన కేసులు, అరెస్టులు ఒక ఎత్తైతే.. కొడాలి నాని అరెస్టు మరో ఎత్తు. అంతలా కూటమి పార్టీల శ్రేణులను టార్గెట్ చేశారు.. వారి మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించారు కొడాలి నాని. ఆయన అరెస్టు జరిగితే రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరగడం ఖాయం. బహుశా అరెస్టు భయంతోనే కొడాలి నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper