Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: టైర్ వన్ హీరోల లిస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకోబోతున్నాడా..? కారణమేంటంటే..?

Pawan Kalyan: టైర్ వన్ హీరోల లిస్ట్ నుంచి పవన్ కళ్యాణ్ పక్కకు తప్పుకోబోతున్నాడా..? కారణమేంటంటే..?

Pawan Kalyan: ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుంది. ఇంతకుముందు బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్లో ఉండేది. కానీ మనవాళ్ళు బాలీవుడ్ వాళ్ళను వెనక్కి నెట్టేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని నెంబర్ వన్ పొజిషన్ లోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా రాజమౌళి చేసిన ‘బాహుబలి’ సినిమా పాన్ ఇండియాలో ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా మన స్టార్ హీరోలు, […]

Pawan Kalyan: ప్రస్తుతం పాన్ ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ నెంబర్ వన్ పొజిషన్లో కొనసాగుతుంది. ఇంతకుముందు బాలీవుడ్ ఇండస్ట్రీ టాప్ పొజిషన్లో ఉండేది. కానీ మనవాళ్ళు బాలీవుడ్ వాళ్ళను వెనక్కి నెట్టేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని నెంబర్ వన్ పొజిషన్ లోకి తీసుకువచ్చారు. ముఖ్యంగా రాజమౌళి చేసిన ‘బాహుబలి’ సినిమా పాన్ ఇండియాలో ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేసిందో మనందరికి తెలిసిందే. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్ తో వరుసగా మన స్టార్ హీరోలు, డైరెక్టర్లు పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లను సాధించడంతో ఒక్కసారిగా తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ పొజిషన్లోకి వెళ్లిపోయింది. ఇక ఇప్పుడు కూడా మన దర్శక నిర్మాతలు సైతం భారీ ఎత్తున సినిమాలను నిర్మిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం…అయితే గత కొద్ది రోజుల నుంచి టైర్ వన్ హీరోల లిస్టులో మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లు ఉన్నారు…

పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉండి సినిమాలను సరిగ్గా చేయలేకపోవడం వల్ల ఆయన మార్కెట్ అనేది అంతకంతకు పడిపోతూ వస్తుంది. మిగతా హీరోలతో పోలిస్తే ప్రస్తుతం ఉన్న హీరోల్లో టైర్ వన్ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ కి చాలా తక్కువ మార్కెట్ ఉంది. ఆయన సినిమాలు కేవలం తెలుగుకి మాత్రమే పరిమితమవుతుండటం వల్ల ఆయన కలెక్షన్స్ ని భారీగా రాబట్టలేకపోతున్నాడు…

ఇక ముందు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే రీతిలో కలెక్షన్స్ ని సాధించినట్టయితే మాత్రం ఆయన టైర్ వన్ హీరోల లిస్ట్ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మినిమం మిగతా హీరోలు ఎంతటి వసూళ్లను సాధిస్తున్నారో అందులో 40% కలెక్షన్స్ అయిన పవన్ కళ్యాణ్ సాధించాల్సి ఉంది. లేకపోతే మాత్రం ఆయన టైట్ వన్ హీరోల లిస్ట్ నుంచి బయటికి వెళ్ళిపోయే ప్రమాదమైతే ఉంది.

ఒకవేళ ఆయన టైర్ వన్ హీరోల లిస్ట్ నుంచి అవుట్ అయిపోతే ఆ లిస్టులోకి చేరే కొత్త హీరో ఎవరు అనే దాని మీద కూడా చాప చర్చలు జరుగుతున్నాయి. మరో రెండు మూడు సంవత్సరాల్లో టైర్ వన్ హీరోల లిస్టులోకి కొత్తగా వచ్చే హీరోలు ఎవరు అనేదానిమీద ఒక సరైన క్లారిటి అయితే వస్తుంది అంటూ చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper