Chandrababu Naidu Yoga: మనకు యోగ అంటే ఎవరు గుర్తుకొస్తారు.. ఇంకెవరు రాందేవ్ బాబానే.. ఒళ్ళును విల్లులాగా వంచుతూ ఉంటారు ఆయన. అనేక రకాల ఆసనాలు చేస్తూ ఉంటారు. ఫలితంగా ఈ వయసులో కూడా అత్యంత చైతన్యవంతుడిగా కనిపిస్తుంటారు. వేదికల మీద అత్యంత కఠినమైన ఆసనాలు వేస్తూ అందరిని ఆశ్చర్యంలో ముంచేస్తుంటారు రాందేవ్ బాబా. అటువంటి రాందేవ్ బాబా కూడా ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఆయన ఎందుకు ఆశ్చర్యపోయారో తెలుసా..
అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాందేవ్ బాబా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం విజయవాడ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఐటి శాఖ మంత్రి నారా లోకేష్.. పౌర శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వంటి వారు పాల్గొన్నారు.

వేదిక మీద రాందేవ్ బాబా రకరకాల యోగాసనాలు వేశారు. చంద్రబాబు… నారా లోకేష్ కూడా ఇందులో పాల్గొన్నారు. నారా లోకేష్ రాందేవ్ బాబా చెప్పినట్టుగా యోగాసనాలు వేశారు.. ఇటీవల కాలంలో పూర్తిగా బరువు తగ్గిపోయిన నారా లోకేష్.. అత్యంత సులువుగా యోగాసనాలు వేశారు. ఏపీ సీఎం ఈకాలపు యువకుడి లాగా రాందేవ్ చెప్పినట్టు యోగాసనాలు వేశారు. ఆయన యోగాసనాలు వేస్తుంటే రాందేవ్ బాబా అలానే చూస్తూ ఉండిపోయారు. మీరు నాకే యోగ ఆసనాలు నేర్పించే విధంగా ఉన్నారని చంద్రబాబును ఉద్దేశించి రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు.
చంద్రబాబు ప్రతిరోజు యోగా చేస్తూ ఉంటారు. ఈ వయసులో కూడా ఆయన ఆ స్థాయిలో ఉత్సాహంగా ఉండడానికి ప్రధాన కారణం యోగానే. పైగా ఆయన అత్యంత కఠినంగా డైట్ కొనసాగిస్తూ ఉంటారు. అన్నం అసలు ముట్టుకోరు. తన రోజువారి మెనూ లో కచ్చితంగా ఫైబర్.. ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటారు. కార్బోహైడ్రేట్ లను తక్కువ మోతాదులో తీసుకుంటారు. ప్రోటీన్లను ఎక్కువగా శాకాహార వంటల నుంచి ఆయన గ్రహిస్తారు. అందువల్లే చంద్రబాబు ఇంత ఆరోగ్యంగా ఉన్నారు.
2024 ఎన్నికల్లో మండే ఎండల్లో కూడా చంద్రబాబు ప్రచారం చేశారు. చాలా దూరం నడిచారు. అంతేకాదు ఏమాత్రం అలసిపోలేదు. ఇబ్బంది కూడా పడలేదు. తోటి నాయకులు ఎండకు తట్టుకోలేక అవస్థలు పడుతుంటే.. చంద్రబాబు మాత్రం ఉత్సాహంగా కనిపించారు. తాజాగా యోగేంద్ర కార్యక్రమంలో చంద్రబాబు రాందేవ్ బాబాను సైతం ఆశ్చర్యంలో ముంచేశారంటే.. ఆయన శరీర సామర్థ్యం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మిత ఆహారం.. ఒత్తిడి లేని దినచర్య.. శారీరక వ్యాయామం.. వంటివి చంద్రబాబు ఆరోగ్య రహస్యాలు.
