Homeఆంధ్రప్రదేశ్‌Jogi Rajeev: చంద్రబాబుకు మానసిక, శారీరక సమస్య.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ వ్యాఖ్యల వీడియో...

Jogi Rajeev: చంద్రబాబుకు మానసిక, శారీరక సమస్య.. జోగి రమేష్ కుమారుడు రాజీవ్ వ్యాఖ్యల వీడియో వైరల్..

Jogi Rajeev: ఫ్యాన్ పార్టీలో ముఖ్య నాయకుడు, నోటి దురుసు బిరుదాంకితుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వ్యవహారం కొద్ది రోజులుగా ఏపీ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఇతడు సూర్యాపేటకు చెందిన మేఘన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో సఖ్యతగా ఉండకుండా ఇబ్బంది పెట్టేవాడు. అర్ధరాత్రి మూడు గంటల వరకు బాత్రూంలోనే ఉండేవాడు. ఆమెతో సంసార జీవితం సాగించకుండా రకరకాల వ్యవహారాలు నడిపేవాడు. అనేకసార్లు ఆమె నిలదీస్తే.. అతడు ఆరుగురు […]

Jogi Rajeev: ఫ్యాన్ పార్టీలో ముఖ్య నాయకుడు, నోటి దురుసు బిరుదాంకితుడు జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్ వ్యవహారం కొద్ది రోజులుగా ఏపీ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీస్తోంది. ఇతడు సూర్యాపేటకు చెందిన మేఘన అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత ఆమెతో సఖ్యతగా ఉండకుండా ఇబ్బంది పెట్టేవాడు. అర్ధరాత్రి మూడు గంటల వరకు బాత్రూంలోనే ఉండేవాడు. ఆమెతో సంసార జీవితం సాగించకుండా రకరకాల వ్యవహారాలు నడిపేవాడు. అనేకసార్లు ఆమె నిలదీస్తే.. అతడు ఆరుగురు ప్రతివతలు సినిమాను లైవ్ లో చూపించేవాడు. దీంతో తట్టుకోలేక మేఘన ఈ విషయాన్ని మామ జోగి రమేష్ కు చెప్తే.. అతడు ఎదురుదాడికి దిగాడు. ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.. అనేక పర్యాయాలు ఇలా జరిగిన తర్వాత.. అనేక సందర్భాలలో మేఘన మీద దారుణాలు చోటు చేసుకున్న తర్వాత.. ఆమె ధైర్యం తెచ్చుకుని బయటికి వెళ్ళింది. పోలీసులకు జరిగిన విషయాన్ని చెప్పింది.

మేఘన ఫిర్యాదు చేసిన తర్వాత ఏపీ పోలీసులు జోగి రమేష్.. అతని కుటుంబ సభ్యుల మీద కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుంటే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జోగి రమేష్ కుటుంబం మేఘన కుటుంబం మీద ఒత్తిడి తీసుకొచ్చి.. పెళ్లి జరిపించిందని తెలుస్తోంది. పెళ్లి సమయంలోనే భారీగా బంగారం.. నగదు.. ఇతర కానుకలు స్వీకరించారు. ఆ తర్వాత తన భర్త అసలు వ్యవహారం తెలియడంతో మేఘన నిలదీసింది. అనంతరం మేఘనను రమేష్ కుటుంబం తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఒక దశలో ఆ యువతి కుటుంబ సభ్యులను అంతం చేస్తామని బెదిరించారు కూడా. ఇన్ని ఇబ్బందులను తట్టుకుంటూ మేఘన జీవితాన్ని సాగించింది. ఒక రకంగా చెప్పాలంటే నరకాన్ని ప్రత్యక్షంగా అనుభవించింది. ఆ తర్వాత ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో జోగి రమేష్ అసలు బాగోతం బయటపడింది.

జోగి రమేష్ కుమారుడు రాజీవ్ కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో చంద్రబాబును ఉద్దేశించి జోగి రమేష్ కుమారుడు రాజీవ్ చాలా దారుణంగా మాట్లాడాడు. చంద్రబాబుకు మానసిక సమస్య ఉందని.. శారీరక సమస్య ఉందని అడ్డగోలుగా ఆరోపించాడు. నాడు జోగి రమేష్ కుమారుడు రాజీవ్ చేసిన వ్యాఖ్యల పట్ల టిడిపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయితే ఇప్పుడు రాజీవ్ కే శారీరక సమస్య ఉందని తేలడంతో.. ‘దేశం’ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ” వాడికి భాష మాట్లాడటం రాదు. పెద్దలను గౌరవించడం రాదు. పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంటాడు. చివరికి ఎవరినైతే విమర్శించాడో.. వాడే ఆ విమర్శలకు తలవంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుడు లాంటి చంద్రబాబును తిడితే భగవంతుడు ఎందుకు ఊరుకుంటాడు.. ఇటువంటి గతినే పట్టిస్తాడని” టిడిపి నేతలు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper