Andhra Political Satire: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి బలమైన కేడర్ ఉంది. అది కాదనలేని సత్యం. ఇప్పటికీ ఆ పార్టీ అంటే విపరీతంగా అభిమానించేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని అభిమానిస్తుంటారు. దానికి కారణాలు లేకపోలేదు. ఆయన వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు. ఆపై ఐదు సంవత్సరాలు సంక్షేమ పథకాలను బాగానే అమలు చేశారు. అయితే అభివృద్ధిని కోరుకున్న వారు మాత్రం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకులుగా మారిపోయారు. అయితే సంక్షేమ పథకాలకు ఇష్టపడిన వారు ఆయన భక్తులుగా మారారు. ఎంతటి భక్తులుగా మారారంటే.. జగన్మోహన్ రెడ్డిని ఓడించిన వారిని బూతులు తిట్టే దాకా పరిస్థితి వచ్చింది. అయితే ఇలా బూతులు తిట్టిన వారు పెద్ద నేతలు కాదు. సామాన్యులు సైతం తిట్ల దండకం అందుకుంటున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ జగన్ అభిమాని కామెంట్స్ కు సంబంధించి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
Also Read: టీడీపీ.. చంద్రబాబు.. పవన్ లో అదే భయం భక్తి..
శ్రీకాకుళం మండలికంలో.. శ్రీకాకుళం( Srikakulam) మాండలికంలో.. తేడాగా కనిపిస్తున్న వ్యక్తి చేసిన కామెంట్స్ నవ్వు పుట్టిస్తున్నాయి. జగన్ అన్ని చేశాడని.. జనాలు మాత్రం ఆయనను నమ్మలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ వ్యక్తి చేసిన కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి. ఆయన అనుకరిస్తూ చేసిన ఈ వ్యాఖ్యలు నవ్వు పుట్టిస్తున్నాయి. జగన్ అన్నీ చేస్తే.. మీరేం చేశారంటూ ఆ వీధి వాసులను ప్రశ్నిస్తున్న తీరు మాత్రం ఆకట్టుకుంది. కొంచెం ఆలోచింపజేసింది. దానికి కామెడీ జోనర్ జతచేస్తూ.. తన హావ భావాలతో రక్తి కట్టిస్తూ ఆయన చేసిన కామెంట్స్ ను ఎవరో సోషల్ మీడియాలో పెట్టారు. అది విపరీతంగా వైరల్ అవుతోంది.
Also Read: అందర్నీ స్మరించి.. ఒక్కరిని మరిచిన చంద్రబాబు.. కారణమేంటి?
వింత ప్రశ్నలతో మహిళ..
అయితే సదరు వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి( Y S Jagan Mohan Reddy ) వీరాభిమానిగా కనిపిస్తున్నారు. ఓ వీడియోతో అనుసరిస్తున్న మహిళ జగన్ ఏం చేశాడు? ఏం చేయలేదు అంటూ అనేసరికి సదరు వ్యక్తి విరుచుకుపడ్డాడు. వాలంటీర్లు తినేశారు, ఉద్యోగులు తినేశారు, జగన్ ఇచ్చిన పథకాలను తినేశారు, కానీ ఓట్లు వేయలేదు అంటూ సదరు వ్యక్తి నిష్ఠూర మాడుతూ.. శ్రీకాకుళం మండలికంలో దీర్ఘాలు పలుకుతూ.. చేసిన కామెంట్స్ మాత్రం తెగ నవ్వు పుట్టించాయి. అన్నింటికీ మించి జగన్ పై ఉన్న అభిమానాన్ని చాటిచెప్పాయి.