Homeఆంధ్రప్రదేశ్‌Jagan Mohan Reddy: జగన్ కు షాక్ ఇచ్చిన.. బొత్స మేనల్లుడు..

Jagan Mohan Reddy: జగన్ కు షాక్ ఇచ్చిన.. బొత్స మేనల్లుడు..

Jagan Mohan Reddy: వైసీపీ కి వరుసగా షాక్ లు తగులుతున్నాయి.. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి బయటికి వెళ్లిపోయిన తర్వాత జగన్ వైఖరి గురించి చెబుతున్నారు. విజయసాయిరెడ్డి.. బోరుగడ్డ అనిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది. ఈ జాబితాలో ఇప్పుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను కూడా చేరిపోయారు. ఈయనను మజ్జి శ్రీనివాసరావు అని పిలుస్తుంటారు. చిన్న శ్రీను వైసిపికి రాజీనామా […]

Jagan Mohan Reddy: వైసీపీ కి వరుసగా షాక్ లు తగులుతున్నాయి.. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా చేసి బయటికి వెళ్లిపోయిన తర్వాత జగన్ వైఖరి గురించి చెబుతున్నారు. విజయసాయిరెడ్డి.. బోరుగడ్డ అనిల్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దది.

ఈ జాబితాలో ఇప్పుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు చిన్న శ్రీను కూడా చేరిపోయారు. ఈయనను మజ్జి శ్రీనివాసరావు అని పిలుస్తుంటారు. చిన్న శ్రీను వైసిపికి రాజీనామా చేశారు. ఈయన విజయనగరం జిల్లాకు వైసిపి అధ్యక్షుడు కొనసాగుతున్నారు. భీమిలి నియోజకవర్గానికి సమన్వయకర్తగా ఉన్నారు. ఈ రెండు పదవులకు ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేసిన విలేకరులు వైసీపీ అధినేత జగన్ కు పంపించారు.

చిన్న శ్రీను విజయనగరం జిల్లా చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఈయనకు విజయనగరం జిల్లాలో గట్టిపట్టు ఉంది. ఈయన ఏ పార్టీలోకి వెళ్తారు అనేది క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే జనసేనలో చేరుతారని వార్తలు వినిపిస్తున్నాయి. 2019 ఎన్నికల్లో వైసిపి ఇక్కడ భారీ స్థాయిలో స్థానాలు గెలుచుకోవడం వెనుక చిన్న శ్రీను తెరవెనుక పాత్ర పోషించారు. పైగా విజయనగరం జడ్పీపీఠం వైసిపికి దక్కడం లో ఈయన కీలకపాత్ర పోషించారు. బొత్స సత్యనారాయణ కు మేనల్లుడు అయినప్పటికీ.. రాజకీయంగా తనకంటూ బలమైన ఫాలోయింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇటీవల కాలంలో వైసీపీలో సరైన గుర్తింపు లభించకపోవడం.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు బాగో లేకపోవడం.. వంటి కారణాలతో ఆయన రాజీనామా చేసినట్టు తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో చిన్న శ్రీను రాజీనామా చేయడం సంచలనంగా మారింది. స్థానిక ఎన్నికలకు ముందు డీఎస్సీ వ్యవహారాన్ని మసి పూసి మారేడు కాయ చేసింది వైసిపి. కానీ ఆ పాచిక పారలేదు. చివరికి ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు రాజీనామా బాటపడుతున్నారు. అధినేత పోకడలు తట్టుకోలేక.. పార్టీ అధినాయకత్వం భరోసా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో.. రాజీనామా చేస్తున్నారు. ఏకంగా బొత్స సత్యనారాయణ మేనల్లుడు రాజీనామా చేశాడు అంటే వైసీపీలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని టిడిపి నేతలు అంటున్నారు. సొంత మేనల్లుడికి భరోసా ఇవ్వలేని పరిస్థితుల్లో బొత్స సత్యనారాయణ ఉన్నాడని.. ఇక స్థానిక ఎన్నికల ముందు మిగతా కార్యవర్గం పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని టిడిపి నేతలు చెబుతున్నారు. ఇప్పటికైనా వైసీపీలో పని చేసే నాయకులు వాస్తవ పరిస్థితిని గుర్తించి.. కీలక నిర్ణయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper