Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' షాలిని జీవితం లో ఇంతటి విషాదం...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ షాలిని జీవితం లో ఇంతటి విషాదం ఉందా..!

Bigg Boss 10 Telugu: ఒక మనిషిని కేవలం రెండు మూడు సంఘటనలను చూసి క్యారెక్టర్ ని నిర్ణయించకూడదు, అది చాలా పెద్ద తప్పు అని పెద్దలు అంటుంటారు. ‘అగ్ని పరీక్ష 2’ లో షాలిని ని చూసినప్పుడు చాలా మంది ఈ అమ్మాయికి పొగరు, యాటిట్యూడ్ ఎక్కువ అని అనుకున్నారు. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి రాకూడదు అని కూడా చాలా మంది కోరుకున్నారు. రివ్యూయర్స్ ఈమె పై పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో […]

Bigg Boss 10 Telugu: ఒక మనిషిని కేవలం రెండు మూడు సంఘటనలను చూసి క్యారెక్టర్ ని నిర్ణయించకూడదు, అది చాలా పెద్ద తప్పు అని పెద్దలు అంటుంటారు. ‘అగ్ని పరీక్ష 2’ లో షాలిని ని చూసినప్పుడు చాలా మంది ఈ అమ్మాయికి పొగరు, యాటిట్యూడ్ ఎక్కువ అని అనుకున్నారు. ఈమె బిగ్ బాస్ హౌస్ లోకి రాకూడదు అని కూడా చాలా మంది కోరుకున్నారు. రివ్యూయర్స్ ఈమె పై పలు సందర్భాల్లో తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ‘అగ్ని పరీక్ష 2’ పూర్తి అయ్యి , బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చేంత వరకు కూడా, ఈమె జీవితం లోని విషాద సంఘటన గురించి ఎవరికీ తెలియదు. తన తోటి కంటెస్టెంట్స్ లాగానే ఈమె కూడా ఆ విషాద ఘటన గురించి చెప్పుకుంటే బోలెడంత సానుభూతి లభించేది.

కానీ ఆమె ఒక్క ఎపిసోడ్ లో కూడా సానుభూతి కోసం ప్రయత్నం చేయలేదు. ఇదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం. పూర్తి వివరాల్లోకి వెళ్తే , ‘అగ్ని పరీక్ష 2’ పూర్తి అయ్యాక, బిగ్ బాస్ 10 లోకి ఎంట్రీ ఇచ్చేముందు ఈమె ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ ఇంటర్వ్యూ లో ఆమె తన జీవితం లోని ఒక విషాద సంఘటన గురించి చెప్తూ ‘నాకు 8 ఏళ్ళ వయస్సులోనే అమ్మ చనిపోయింది. ఆ తర్వాత నాన్న కూడా చనిపోయాడు. నేను ఈ విషయాన్ని అగ్ని పరీక్ష షో లో చెప్పలేదు. ఎందుకంటే సానుభూతి తో ఓట్లు సంపాదించడం నాకు ఇష్టం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది షాలిని. అయితే ఈమె ‘బిగ్ బాస్’ హౌస్ లోకి వెళ్తుంది కాబట్టి, భవిష్యత్తులో సానుభూతి కి ఉపయోగపడుతుందనే ఉద్దేశ్యం తో ఇలా చెప్పిందేమో అని కొంతమంది అనుకోవచ్చు.

కానీ ఎవరెవరు బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళబోతున్నారు అనే విషయం షో మొదలయ్యే రెండు మూడు రోజుల ముందు వరకూ కూడా ఎవరికీ తెలియదు. కాబట్టి షాలిని ఇది సానుభూతి కోసం చెప్పలేదు, నిజాయితీగానే చెప్పింది అనే భావన కలుగుతోంది. అంతే కాదు , రివ్యూయర్స్ కి కూడా షాలిని బిగ్ బాస్ హౌస్ లో నడుచుకునే తీరు బాగా నచ్చింది. గేమ్స్ బాగా ఆడుతోంది, పాయింట్స్ పెట్టాల్సిన సమయం లో పెడుతుంది, ఎవరికోసమైన స్టాండ్ తీసుకోవాలని అనిపించినప్పుడు స్టాండ్ తీసుకుంటుంది, ఆమె వాదనలు కూడా చాలా లాజికల్ గా ఉన్నాయి. అందుకే ‘డోంట్ జడ్జ్ ఏ బుక్ బై కవర్ పేజ్’ అని పెద్దలు అంటుంటారు. ఇలాంటి సందర్భాలు చూసినప్పుడే వాళ్ళు చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తూ ఉంటుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper