Homeబిజినెస్IQ 00 pad ultra: కాంపాక్ట్ డిస్ ప్లే.. యాక్టివ్ కూలింగ్ ప్యాడ్.. ఇంకా ఎన్నో...

IQ 00 pad ultra: కాంపాక్ట్ డిస్ ప్లే.. యాక్టివ్ కూలింగ్ ప్యాడ్.. ఇంకా ఎన్నో ఫీచర్లు.. ధర ఎంత ఉందంటే

IQ 00 pad ultra: నేటి స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో టాబ్లెట్ లకు విపరీతమైన డిమాండ్ ఉంది. కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. లాప్టాప్ స్థాయిలో సదుపాయాలను కల్పిస్తున్నాయి. దీంతో చాలామంది టాబ్లెట్లు కొనుగోలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నేటి యువత వీటిని కొనుగోలు చేయడంలో విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అందువల్లే కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. టాబ్లెట్ తయారీ కంపెనీలలో మనదేశంలో ఐక్యూ కంపెనీకి మంచి రికార్డు ఉంది. […]

IQ 00 pad ultra: నేటి స్మార్ట్ ఫోన్ ప్రపంచంలో టాబ్లెట్ లకు విపరీతమైన డిమాండ్ ఉంది. కంపెనీలు కూడా కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తున్నాయి. లాప్టాప్ స్థాయిలో సదుపాయాలను కల్పిస్తున్నాయి. దీంతో చాలామంది టాబ్లెట్లు కొనుగోలు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నేటి యువత వీటిని కొనుగోలు చేయడంలో విపరీతమైన ఇంట్రెస్ట్ చూపిస్తోంది. అందువల్లే కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.

టాబ్లెట్ తయారీ కంపెనీలలో మనదేశంలో ఐక్యూ కంపెనీకి మంచి రికార్డు ఉంది. తాజాగా ఈ కంపెనీ ఐక్యూ00 బ్రాండ్ నుంచి ఒక పవర్ఫుల్ గేమింగ్ టాబ్లెట్ తీసుకొచ్చింది. చైనాలో ఇది ఐక్యూ డబల్ జీరో 16 స్మార్ట్ ఫోన్ తో పాటు లాంచ్ కాబోతోంది. దీని ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే

ఇందులో స్క్రీన్ సైజు 8.8 అంగుళాల కాంపాక్ట్ ఓ ఎల్ ఈ డి డిస్ప్లే మాదిరిగా వచ్చేసింది. ఇది చూసేందుకు అత్యంత కాంతివంతంగా… ఆకర్షణీయంగా ఉంది.

స్క్రీన్ చుట్టూ సన్నని బార్డర్లు ఏర్పాటు చేశారు. సెంటర్ హోల్ పంచ్ కెమెరా ప్రత్యేకంగా ఉన్నాయి. ఈ మోడల్ ను యువత ఎక్కువగా ఇష్టపడేందుకు దీనిని ఏర్పాటు చేశారు.

ఈ మోడల్ ఎండర్ బ్లాక్.. స్టార్ సిల్వర్ వంటి రంగుల్లో లభిస్తుంది.

దీని ప్రాసెస్ అత్యంత శక్తివంతమైన 2n క్వాల్ కం స్నాప్ డ్రాగన్.. ఎయిట్ ఎలైట్ జెన్ సిక్స్ (Snapdragon 8 Elite Gen 6) లేదా ఎక్స్ట్రీమ్ వెర్షన్లో ఇది పనిచేస్తూ ఉంటుంది.

ఇది కంటిన్యూగా గేమింగ్ ఆడుతున్నప్పుడు వేడి ఎక్కకుండా ఇందులో ప్రత్యేకంగా యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్ (active cooling fan).. వెంట్స్ అనేవి ఉంటాయి.

గేమింగ్ యాక్ససరీలను పరిశీలిస్తే.. ఇందులో హ్యాండ్ హెల్డ్ కంట్రోలర్స్ ఉన్నాయి. ఇది ప్రత్యేకంగా గేమింగ్ యాక్సిసరికి పనిచేస్తూ ఉంటుంది.

బ్యాటరీ కెపాసిటీ ఇందులో 9000 ఎంఏహెచ్ కంటే ఎక్కువ సామర్ధ్యం గల భారీ బ్యాటరీ ఉంటుంది..

ఇందులో ఆల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. ఇక మనదేశంలో లీకైన వివరాల ప్రకారం దీని ధర అక్షరాల 59,999 రూపాయల వరకు ఉండొచ్చు.. దీనిని అతి త్వరలోనే విడుదల చేసే అవకాశం ఉంది. యువతను టార్గెట్ చేస్తూ ఈ మోడల్ అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి.. మార్కెట్లో భారీగానే అమ్మకాలు ఉండే అవకాశం ఉంది. పైగా ధర కూడా బడ్జెట్ స్థాయిలో ఉండడంతో యువత ఈ మోడల్ ఎక్కువగా ఇష్టపడే అవకాశం కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper