Jagan Mohan Reddy Political Mistakes: అదృష్టం ఒకసారి మాత్రమే వరిస్తుంది. అన్నివేళలా వరిస్తుందంటే పొరపడినట్టే. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సైతం అదే అదృష్టం పట్టింది. తండ్రి అకాల మరణంతో ఎనలేని సానుభూతి లభించింది. కనీసం ఏ ఉద్యమము చేయని.. రాష్ట్ర రాజకీయాల పట్ల అవగాహన లేని జగన్మోహన్ రెడ్డిని తిరుగులేని నేతను చేసింది. అంతకుమించి రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ కుదేలైంది. ఆ సమయంలోనే పార్టీని ఏర్పాటు చేసి అద్భుత నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. జైలుకు వెళ్లడంతో ఆయనపై మరింత సానుభూతి పెరిగింది.. ఈ కారణాలతోనే ఆ పార్టీకి 2014 ఎన్నికల్లో గౌరవప్రదమైన సీట్లు వచ్చాయి. 2019లో అయితే ఏకపక్ష విజయం దక్కింది. అయితే అప్పటివరకు ఆ పార్టీ హవా అలా కొనసాగుతూ ఉండగా.. అధికారంలో ఉన్నపుడు జగన్మోహన్ రెడ్డి చేసిన ఒక్కో తప్పిదం ఆ పార్టీకి మరణ శాసనంగా మారింది. అధికారాన్ని దూరమైన తర్వాత కూడా అదే తప్పులను చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. ఫలితంగా పార్టీ ఉనికి కూడా ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Also Read: 15 రోజుల్లో 1500 కోట్లు కొల్లగొట్టిన ‘ధురంధర్ 2’.. ఇక మిగిలిన రికార్డు టార్గెట్స్ ఇవే..
* 2019లో తన గెలుపులో భాగమైన తల్లి విజయలక్ష్మిని, చెల్లి షర్మిలను దూరం చేసుకోవడం జగన్మోహన్ రెడ్డి చేసిన మొదటి తప్పు. వైసిపి గౌరవాధ్యక్షురాలుగా ఉన్న తన తల్లి విజయలక్ష్మిని ఆ పదవి నుంచి తొలగించడం, ఆస్తి పంపకాల విభాగంతోనో.. లేకుంటే ఆ ఒక్క ఎంపీ సీటు అంశంతోనో తెలియదు కానీ షర్మిల తో విభేదించడం మాత్రం ఆయన చేసిన తొలి తప్పటడుగు. అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ తప్పిదంగా మారింది. అందుకు ఆ పార్టీ మూల్యం చెల్లించుకుంది. వైయస్సార్ బ్రాండ్ ఇమేజ్ ను కోర్టుకు ఎక్కించింది. కుటుంబ వివాదాలు రాజకీయ విభేదాలుగా మారేలా చేసింది.
* సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి దారుణ హత్య వెనుక దాగి ఉన్న గుండెపోటు, నారా సుర రక్త చరిత్ర ఒట్టి కట్టు కథలు అని సోదరి సునీత నుంచి ప్రకటనలు రావడం.. ఆమెతో పాటు కుటుంబ సభ్యులు వైసీపీ విభేదించడం జగన్ చేసిన రెండో తప్పిదం.
* అమరావతి రాజధాని నుంచి మూడు రాజధానులకు మారడం జగన్మోహన్ రెడ్డి చేసిన ఇంకో తప్పిదం. నిండు సభలో అమరావతిని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి ఇంకా భూ సమీకరణ చేయాలని సూచనలు చేశారు. అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నారు. దీనిని కూడా ప్రజలు తప్పుగా భావించారు.
* మరోవైపు చంద్రబాబు అరెస్ట్ అత్యంత తప్పిదం. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయమే వైయస్సార్ కాంగ్రెస్ పాలిట శాపంగా మారింది. ఒకవైపు చంద్రబాబు అరెస్ట్.. ఇంకోవైపు అందుకు నిరసన తెలిపిన పవన్ కళ్యాణ్ ను నిర్బంధించడం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా పాతాళానికి నెట్టేసింది.
* వై నాట్ 175 అన్న నినాదం ప్రత్యర్థుల్లో కసిని పెంచింది. వారు సర్వశక్తులు వడ్డేలా చేసింది. అందుకే 151 స్థానాలు ఉన్న వైసిపి 15 కు పడిపోయింది.
* ఇప్పుడు కొత్తగా మావిగన్ అంటూ ప్రకటన చేశారు. అమరావతి నుంచి మూడు రాజధానులకు షిఫ్ట్ అయ్యారు. ఇప్పుడు మూడు రాజధానుల నుంచి మావిగన్ అంటున్నారు. ఇలా రాజకీయ అపరిపక్వత నిర్ణయాలతో లేని ఇబ్బందులను తెచ్చుకొని ఇక్కట్లు పడుతున్నారు జగన్.
