Vijaya Sai Reddy Amaravati Statement: ఏపీ( Andhra Pradesh) రాజకీయాలపై ఇప్పుడిప్పుడే స్పష్టత వస్తోంది.. ముఖ్యంగా అమరావతిపై కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతున్న తరుణంలో రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా అమరావతి రైతుల మాటేంటి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అదే అజెండాతో ముందుకు సాగాలని నిర్ణయించింది. కానీ తన నిర్ణయం నేరుగా చెప్పలేకపోతోంది. కానీ అంతర్గతంగా ఆ పార్టీ నేతలు అక్కడక్కడ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి అమరావతి రైతుల ప్రస్తావన తెస్తున్నారు. అన్ని రకాల ప్రయత్నాలు విఫలం కావడంతో ఇప్పుడు అమరావతి రైతుల ద్వారా రాజధానిపై విషం చిమ్మే పనిలో ఉంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు ఆ పార్టీని వీడిన నాయకులు సైతం ఇప్పుడు అమరావతి రైతుల ప్రస్తావన తెస్తున్నారు. ఈ 12 సంవత్సరాల్లో అమరావతి రైతులకు ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఐదు సంవత్సరాల పాటు తాము అమరావతిని నిర్వీర్యం చేశామన్న విషయాన్ని గుర్తుంచుకోవడం లేదు.
* సరికొత్త ప్రశ్నలు..
తాజాగా అమరావతి రాజధాని విషయంలో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy ). అమరావతి రాజధాని లో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో ఇళ్లు ఎందుకు కట్టలేదు అని ప్రశ్నించారు. కమర్షియల్ ప్లాట్ లలో షాపింగ్ కాంప్లెక్స్ లు ఎందుకు నిర్మించలేదు అని కామెంట్ చేశారు. అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్లో ఉన్నట్టు అనిపిస్తున్నాయి ఆ వ్యాఖ్యలు. కనీస పరిజ్ఞానం లేకుండా విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నట్టు అనిపిస్తున్నారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అందరి ఏకాభిప్రాయంతో అమరావతి రాజధానిగా ఎంపిక చేసింది. 2017 నుంచి అమరావతి పనులు మొదలయ్యాయి. పనులు ప్రాథమిక దశలో ఉండగా 2019లో రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అమరావతి నిర్వీర్యం అయింది. మళ్లీ ఇప్పుడు కూటమి రావడంతో కదలిక మొదలైంది. ఈ పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి లాంటి వారు రైతుల ఇళ్లు గురించి.. వారి షాపింగ్ కాంప్లెక్స్ ల గురించి మాట్లాడుతుండడం సిగ్గుచేటు.
* వైసిపి హయాంలో మౌనం..
గత ఐదు సంవత్సరాల్లో అమరావతి రైతుల విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని విజయసాయి రెడ్డి లాంటి నేతలకు తెలుసు. ఇప్పుడు ఆయన నీతి కబుర్లు చెబుతుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. అంటే ఎలాగోలా అమరావతి రాజధాని చట్టబద్ధతను అడ్డుకోవడం లక్ష్యంగా ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే జూన్లో రాజకీయ ప్రకటన ఉండనుందట విజయసాయిరెడ్డి నుంచి. ఇప్పుడు అమరావతి రైతుల గురించి వైసిపి మాదిరిగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు చూస్తుంటే తిరిగి రీఎంట్రీ ఉంటుందా? అనే అనుమానం కలగక మానదు. అందుకే విజయసాయిరెడ్డి ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉంటారన్న అనుమానం వ్యక్తం అవుతోంది. అయితే ఒక్క విజయసాయిరెడ్డి మాత్రమే కాదు. వైసిపి నేతలంతా ఇప్పుడు అమరావతి ని నేరుగా వ్యతిరేకించడం లేదు. ప్రజలతోపాటు రైతుల ప్రస్తావన తీసుకొస్తూ సరికొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు.