YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై విరుచుకు పడే క్రమంలో ఒక్కోసారి సెల్ఫ్ గోల్ వేసుకుంటారు. ఇప్పుడు అదే మాదిరిగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారు మంత్రి లోకేష్ విషయంలో. డీఎస్సీ 2025లో అవకతవకలు జరిగాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో దగా డిఎస్సి అంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతోంది. ఇంకోవైపు డీఎస్సీ 2025లో ఎంపికైన ఉపాధ్యాయులు ఆత్మ గౌరవం పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే దీనిపై శాసనసభలో మంత్రి నారా లోకేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. సుదీర్ఘ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో స్పోర్ట్స్ కోటా గురించి కూడా స్పష్టతనిచ్చారు. మధ్యలో క్రీడాకారిణి పీవీ సింధు కు సైతం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిది అని లోకేష్ తేల్చారు.
* మండలిలో రచ్చ..
శాసనసభలో ఒకవైపు ప్రభుత్వం స్పష్టతనిస్తుండగా.. శాసనమండలిలో మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు రభస సృష్టిస్తున్నారు. అదే సమయంలో తాడేపల్లిలో వారాంతపు తూర్పు వచ్చిన జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడారు. ఈ క్రమంలో డీఎస్సీ 2025 పై అదే ఎదురు దాడి చేశారు. భారీగా అవకతవకలు జరిగాయని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రెస్మీట్లో లోకేష్ బైట్ ను ప్రదర్శించాలని జగన్ ఆదేశించారు. ఈ క్రమంలో పీవీ సింధుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది తమ ప్రభుత్వమే అని లోకేష్ చెబుతున్న క్లిప్పు ప్లే అయ్యింది. దీంతో వెంటనే ఓకే సెట్ చేసుకోండి అంటూ జగన్ చెప్పడం.. అటు తరువాత ఆయన హావభావాలు మారిపోవడం ప్రెస్ మీట్ లో కనిపించింది మీడియా ప్రతినిధులకు.
* మీడియా ముందుకు వస్తే చాలు..
ఇటీవల జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వస్తే చాలు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఆయనపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. మీడియా ముందు మాట్లాడే క్రమంలో ఆయన మాట తీరి బాగుండడం లేదు. పైగా పార్టీ నేతల పరామర్శలకు వెళ్లే సమయంలో.. ప్రెస్ మీట్ లో మాట్లాడే క్రమంలో కొన్ని రకాల తప్పులు దొర్లుతున్నాయి. అధినేత నోటి నుంచి ఆ మాటలు వచ్చేసరికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం చికాకు పడుతున్నాయి. అయితే తాజాగా లోకేష్ పై విమర్శలు చేసేందుకు ఆయన తన ప్రెస్ మీట్ లో ప్రయత్నించారు. కానీ అదే లోకేష్ పీవీ సింధుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన ఘనత తమదేనని చెప్పిన క్లిప్ రావడంతో ఒక్కసారిగా అసహనానికి గురయ్యారు. దానికి సంబంధించిన దృశ్యం సోషల్ మీడియాలో అప్పుడే వైరల్ అంశంగా మారిపోయింది.
లోకేష్ వీడియో ప్లే చేయమని ప్రెస్ మీట్‌లో జగన్ సెల్ఫ్ గోల్!
ప్రెస్ మీట్‌లో లోకేష్ బైట్‌ను ప్రదర్శించాలని వైఎస్ జగన్ ఆదేశించగా.. “పీవీ సింధుకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది తమ ప్రభుత్వమే” అని లోకేష్ చెప్తున్న క్లిప్ ప్లే అయింది. దీంతో వెంటనే “ఓకే.. సెట్ చేసుకోండి” అంటూ జగన్ చెప్పడం, ఆ… pic.twitter.com/43uBMbaUIi
— Telugu360 (@Telugu360) August 20, 2026