Irumudi Movie: మాస్ మహారాజ రవితేజ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఇరుముడి’ పై అటు అభిమానుల్లోనూ , ప్రేక్షకుల్లోనూ అంచనాలు భారీ రేంజ్ లో ఉన్నాయి. రవితేజ గత 5 ఏళ్ళ నుండి వరుస ఫ్లాప్స్ ని అందుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ ఈ చిత్రానికి ఈ రేంజ్ క్రేజ్ రావడానికి ప్రధాన కారణం అయ్యప్ప స్వామి బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కడమే. దానికి తోడు పాటలు , టీజర్ , ట్రైలర్ , ఇలా ప్రతీ ఒక్కటి పేలడం తో ఈ సినిమా పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని నిన్న రాత్రే మొదలు పెట్టారు. ఈమధ్య కాలం లో ఏ రవితేజ సినిమాకు రానటువంటి అద్భుతమైన రెస్పాన్స్ , ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ కి వచ్చాయి.
బుక్ మై షో యాప్ లో నిన్న రాత్రి ఈ చిత్రానికి గంటకు 11 వేల రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోయాయి. ఈ ట్రెండ్ ని చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు. హైదరాబాద్ లో అయితే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ చిత్రానికి ఇండియా వైడ్ గా 4 కోట్ల రూపాయిల రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వచ్చింది. సాయంత్రానికి దీనికి డబుల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అంటే రవితేజ గత చిత్రాలకు వచ్చిన ఓపెనింగ్స్ ని ఈ సినిమా కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే దాటేయబోతుంది అన్నమాట. అదే కనుక జరిగితే మొదటి రోజు ఈ చిత్రానికి కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 10 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. నేడు కూడా ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 7 వేల రేంజ్ లో టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.
ఇక టాక్ రావడం ఒక్కటే బ్యాలన్స్ , కనీవినీ ఎరుగని రేంజ్ లో రవితేజ కం బ్యాక్ ఇస్తాడని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే , ఈ చిత్రానికి ఓవర్సీస్ లో కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బలంగా జరిగాయి. ఇప్పటి వరకు రవితేజ కి నార్త్ అమెరికా లో 1 మిలియన్ డాలర్లను రాబట్టిన సినిమానే లేదు. అలాంటిది ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 2 లక్షల 50 వేల డాలర్లు వచ్చాయి. పాజిటివ్ టాక్ వస్తే మొదటి రోజు + ప్రీమియర్ షోస్ కి కలిపి ఈ చిత్రానికి హాఫ్ మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వస్తాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. చూడాలి మరి ఈ సినిమాతో రవితేజ ఏ రేంజ్ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడు అనేది.