Homeఆంధ్రప్రదేశ్‌Egg puf scam : నీయమ్మ బడవ..తాడేపల్లి ప్యాలెస్ ఎగ్ పఫ్ ఖర్చు రూ.3.60 కోట్లు!

నీయమ్మ బడవ..తాడేపల్లి ప్యాలెస్ ఎగ్ పఫ్ ఖర్చు రూ.3.60 కోట్లు!

Egg puf scam :వైసిపి ఐదేళ్ల పాలనలో ప్రజాధనం వృధాగా ఖర్చు చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. చివరకు జగన్ ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే హెలికాప్టర్, వందలాదిమంది భద్రతా సిబ్బంది ఖాయంగా ఉండాల్సిందే. జిల్లాల పర్యటనకు వెళితే బడులు మూసుకోవాల్సిందే. ఆ ప్రాంతంలో రోడ్లు, చెట్లు కొట్టేయాల్సిందే. దాదాపు వేలాదిమంది పోలీసులు భద్రతా వలయంగా ఉండాల్సిందే. ఎవరూ చూడకుండా పరదాలు కట్టేయాల్సిందే. ఇక ఖర్చు గురించి చెప్పనవసరం లేదు. వేల కిలోమీటర్ల దూరం నుండి ఆర్టీసీ బస్సులు వేశారు. జనాలను తరలించారు. ఐదేళ్లుగా ఎన్ని రకాల విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. ఇప్పుడు తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. 2019 నుంచి 2024 మధ్య తాడేపల్లి ప్యాలెస్.. అనగా జగన్ రెడ్డి ఇంట్లో ప్రజాధనం అక్షరాల మూడున్నర కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. టిడిపి ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా వైసీపీ మీద దుమ్మెత్తి పోస్తోంది. రాత్రికి రాత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేరు కాస్త ఎగ్ పఫ్ రెడ్డి గా టిడిపి మార్చేయడం గమనార్హం. ఇంతకుముందు వరకు ఎ లెవెన్ మోహన్ రెడ్డి అంటూ జగన్ని టిడిపి సోషల్ మీడియా వేదికగా ర్యాగింగ్ చేసిన సంగతి తెలిసిందే.2014 నుంచి 2019 మధ్య టిడిపి కాలంలో నారా లోకేష్ స్నాక్స్ ఖర్చులు అంటూ అప్పట్లో వైసీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు దానికి ధీటుగా జగన్ పఫ్ రెడ్డి అంటూ టిడిపి ప్రచారం మొదలెట్టింది.

* సీఎం క్యాంప్ కార్యాలయంలో
తాడేపల్లి ప్యాలెస్ అంటే నిజానికి ఇది జగన్ సొంత భవనం. కానీ గత ఐదేళ్లుగా సీఎం క్యాంపు కార్యాలయంగా వాడుకున్నారు. ఇక్కడ వందలాదిమంది అధికారులు, సిబ్బంది పని చేస్తున్నారు. సాధారణంగా టీ తో పాటు స్నాక్స్ ఖర్చు అధికంగా ఉంటుంది. అయితే ఏకంగా కోసం మూడున్నర కోట్ల ఖర్చు చూపడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ప్రజాధనం అంటే ఇంత చులకన భావమా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. దీనిపై సెటైర్లు పడుతున్నాయి.

* వైసిపి దుష్ప్రచారం అంతా ఇంతా కాదు
టిడిపి ప్రభుత్వ హయాంలో చిన్నపాటి వివాదాన్ని సైతం భూతద్దంలో పెట్టి వైసిపి ప్రచారం చేసేది. అప్పుడెప్పుడో తాత్కాలిక శాసనసభలో చిన్నపాటి నీరు చిమ్మింది. అయితే అది వైసీపీ చేసిన పని. చంద్రబాబు సర్కార్ తాత్కాలిక సచివాలయ నిర్మాణంలో అవకతవకలకు పాల్పడడం వల్లే.. నీరు చిమ్మిందంటూ ఆరోపణలు చేసింది. కృత్రిమంగా మీరు చిమ్మే విధంగా కొన్ని లోపాలు చేసి చూపించారు. అంతటితో ఆగకుండా అప్పట్లో లోకేష్ నిర్వర్తించిన శాఖలు స్నాక్స్ ఖర్చులు లక్షల్లో చూపారన్నది అప్పట్లో వచ్చిన ఆరోపణ.

* రోజుకు 1000 ఎగ్ పఫ్లు
తాజాగా తాడేపల్లి ప్యాలెస్ ఎగ్ పఫ్ కుంభకోణం బయటపడడం విస్మయ పరుస్తోంది. రోజుకు 1000 ఎగ్ పఫ్లు తిన్నారన్నది వారి చూపిన ఖర్చు. అంటే నెలకు 30 వేల వరకు ఎగ్ పఫ్లు తిన్నారు. అయితే సిబ్బంది అంతమంది పనిచేస్తున్నారా? అనే వాదన తెరపైకి వచ్చింది. అంటే చివరికి ఆహార పదార్థాలను సైతం విడిచిపెట్టలేదా? వాటిని కూడా మీ అవినీతికి వాడుకున్నారా? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. దీనిపై కూటమి ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేస్తే మరిన్ని నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular