Homeఆంధ్రప్రదేశ్‌CI Nagaraju Arrest: సిఐ నాగరాజు బలి పశువు అయ్యారా..

CI Nagaraju Arrest: సిఐ నాగరాజు బలి పశువు అయ్యారా..

CI Nagaraju Arrest: రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు. ఆయనను విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసుకు సంబంధించి రోజుకొక విషయాన్ని బయటపెడుతోంది. దీనికి తోడు పేరు పోగు క్రాంతి కుమార్ కేసు కూడా తెరపైకి వచ్చింది. క్రాంతికుమార్ తండ్రి.. ఎమ్మార్పీఎస్ నాయకుడు పేరు పోగు వెంకటేశ్వరరావు విజయవాడలో విలేకరుల సమావేశంలో కీలక విషయాలను […]

CI Nagaraju Arrest: రౌడీ షీటర్ సాయి కృష్ణ కేసులో కృష్ణలంక సీఐ నాగరాజు ను పోలీసులు అరెస్ట్ చేశారు. రిమాండ్ కు తరలించారు. ఆయనను విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసుకు సంబంధించి రోజుకొక విషయాన్ని బయటపెడుతోంది. దీనికి తోడు పేరు పోగు క్రాంతి కుమార్ కేసు కూడా తెరపైకి వచ్చింది. క్రాంతికుమార్ తండ్రి.. ఎమ్మార్పీఎస్ నాయకుడు పేరు పోగు వెంకటేశ్వరరావు విజయవాడలో విలేకరుల సమావేశంలో కీలక విషయాలను వెల్లడించారు. క్రాంతి కుమార్ ఆత్మహత్య వెనుక సిఐ నాగరాజు ఉన్నారని ఆరోపించారు.

Also Read: వాళ్ల వల్లే టీమిండియా చెత్త ప్రదర్శన.. టి20 చరిత్రలో ఇదే ఫస్ట్ టైం..

అటు సాయి కృష్ణ.. ఇటు క్రాంతికుమార్ వ్యవహారాలు సిఐ నాగరాజుకు తలపోటుగా మారాయి. ఇదే సమయంలో పోలీస్ శాఖలో పనిచేసేవారు నాగరాజును బలి పశువును చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. సిఐ నాగరాజు మీద నాలుగు రోజుల క్రితం కేసు నమోదయింది. సాయి కృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత పోలీసులు సిఐ నాగరాజును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు.

సాయి కృష్ణ తల్లి ఫిర్యాదు చేయడం ఇదే తొలిసారి కాదు. తన కుమారుడు కనిపించడం లేదని గతంలో ఆమె డీజీపీకి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో హైకోర్టు మెట్లు ఎక్కింది. హేబియస్ కార్పస్ పిటిషన్ వేసింది. దీనిని విచారించిన కోర్టు డిజిపి కి.. నోటీసులు పంపించింది. అప్పుడు పోలీస్ శాఖలో చలనం వచ్చింది. ఆ తర్వాత ఈ కేసులో ఒక్కొక్క అంశం తెరపైకి రావడంతో సాయి కృష్ణ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత దీనిని వైసిపి తన రాజకీయాల కోసం వాడుకోవడం మొదలుపెట్టింది.

సిఐ నాగరాజు మీద ఫిర్యాదు చేయడానికి సాయి కృష్ణ తల్లి వెళ్లినప్పుడు.. ఆ కంప్లైంట్ మొత్తాన్ని అక్కడ ఉన్న పోలీసులు రాసినట్టు తెలుస్తోంది. దీనికి తోడు.. టాస్క్ ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను పట్టుకొచ్చారని.. సిఐ నాగరాజు తన కొడుకుని కొట్టాడని.. చస్తే చస్తాడు.. చచ్చిన తర్వాత శవాన్ని దహనం చేస్తూ అన్నట్టుగా తనతో మాట్లాడారని సాయి కృష్ణ తల్లి చెప్పినట్టుగా పోలీసులు కంప్లెంట్ రాశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం నాగరాజును అరెస్ట్ చేసింది. వాస్తవానికి నాగరాజు సాయి కృష్ణ వ్యవహారంలో ఏం చేశారో తెలియదు కానీ.. పోలీసులు మాత్రం కావాలని నాగరాజును బలి పశువును చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటిదాకా కేసు నమోదు చేయని పోలీసులు.. కేవలం నాలుగు రోజుల క్రితమే నాగరాజు మీద కేసు రిజిస్టర్ చేయడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper