Homeఆంధ్రప్రదేశ్‌Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఊహించని ట్విస్ట్ : సీఐ నాగరాజుతోపాటు ఆ ముగ్గురు..

Sai Krishna Case: సాయికృష్ణ కేసులో ఊహించని ట్విస్ట్ : సీఐ నాగరాజుతోపాటు ఆ ముగ్గురు..

Sai Krishna Case: ఏపీలోనే సంచలనం సృష్టిస్తోంది సాయి కృష్ణ లాకప్ డె*త్ మిస్టరీ. తొలుత అదృశ్యం కేసుగా పోలీసులు భావించారు. ఆ దిశగానే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయి కృష్ణ ఇప్పటికే మరణించాడని.. కస్టోడియల్ టార్చర్ పెట్టి చంపేశారని.. లాకప్ డె*త్ అని కేసు విచారణ చేపడుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తన చార్జ్ షీట్లో స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును అరెస్టు చేసే క్రమంలో […]

Sai Krishna Case: ఏపీలోనే సంచలనం సృష్టిస్తోంది సాయి కృష్ణ లాకప్ డె*త్ మిస్టరీ. తొలుత అదృశ్యం కేసుగా పోలీసులు భావించారు. ఆ దిశగానే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాయి కృష్ణ ఇప్పటికే మరణించాడని.. కస్టోడియల్ టార్చర్ పెట్టి చంపేశారని.. లాకప్ డె*త్ అని కేసు విచారణ చేపడుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం తన చార్జ్ షీట్లో స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సిఐ నాగరాజును అరెస్టు చేసే క్రమంలో కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించింది ప్రత్యేక దర్యాప్తు బృందం. అందులో కస్టోడియల్ టార్చర్ అని తేల్చుతూ ఈ అంశాన్ని బయటపెట్టింది.

Also Read: జగన్ రాజకీయంలో ‘ముద్రగడ’ కుటుంబం!

* ఏ కేసులో స్పష్టత లేదు..
అయితే సిట్ ప్రాథమిక ఛార్జ్ షీట్లో సాయి కృష్ణ మరణాన్ని ధ్రువీకరించింది. టాస్క్ ఫోర్స్ పోలీసులు మార్కాపురంలో సాయి కృష్ణ అదుపులోకి తీసుకొని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సీఐ నాగరాజుకు అప్పగించారు అని స్పష్టం చేసింది. కానీ అది ఏ కేసులో అని చెప్పడం లేదు. అసలు జగ్గయ్యపేట కేసులో అని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఓ ల్యాండ్ డీల్ అంటూ కొత్త ప్రచారం జరుగుతోంది. కానీ ఏ కేసులో సాయి కృష్ణను అదుపులో తీసుకున్నారు అనేది మాత్రం బయటపడడం లేదు. ఈ కేసు విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. కానీ 20 కి పైగా కేసులు ఉన్నాయి సాయి కృష్ణ పై అని మాత్రం టాక్ నడుస్తోంది. సీఐ నాగరాజు కస్టోడియల్ టార్చర్ ఎందుకు చేయవలసి వచ్చింది.. ఏ కేసులో చేయవలసి వచ్చింది అనేది మాత్రం చెప్పడం లేదు సిట్.

* ప్రైవేట్ వ్యక్తి పేరు..
అయితే సాయి కృష్ణ కస్ట్టోడియల్ టార్చర్ విషయంలో ఒక ప్రైవేటు వ్యక్తి పేరు కూడా వినిపిస్తోంది. ప్రధానంగా నిందితుడు సిఐ నాగరాజుకు ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు సాయం చేశారని.. సీఐ స్నేహితుడు కూడా ఇందులో పాలుపంచుకున్నారు అనేది సీట్ గుర్తించినట్లు సమాచారం. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు పరారీలో ఉండడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. అయితే సీఐ నాగరాజు స్నేహితుడు కూడా స్టేషన్కు వచ్చి పాల్గొన్నారని తెలియడం మాత్రం కొత్త మలుపు కనిపిస్తోంది. ఏదైనా సీఐ నాగరాజుకు ఆబ్లికేషన్ కేసులో సాయి కృష్ణ ఉన్నాడా? అసలు జగ్గయ్యపేట కేసుతో సిఐ నాగరాజు ప్రమేయం ఎందుకు? ఇలాంటి చిక్కుముడులు ఇంకా కొనసాగుతున్నాయి. అవి కొలిక్కి వస్తే కానీ.. ఈ కేసు మిస్టరీ వీడదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper