Homeక్రీడలుక్రికెట్‌Harmanpreet Kaur: కెప్టెన్ మాత్రమే కాదు.. మహిళల క్రికెట్ గతినే మార్చేసిన క్రికెటర్..

Harmanpreet Kaur: కెప్టెన్ మాత్రమే కాదు.. మహిళల క్రికెట్ గతినే మార్చేసిన క్రికెటర్..

Harmanpreet Kaur: క్రికెట్ లో కొందరు ప్లేయర్లు పరుగులు చేస్తారు. మరికొందరు మ్యాచులు గెలిపిస్తారు. మరికొందరు మాత్రం తమ ప్రయాణంతోనే ఒక తరానికి దారి చూపిస్తారు. హర్మన్ ప్రీత్ కౌర్ ఈ జాబితాలో మూడవ కోవకు వస్తారు. పంజాబ్లో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఆమె తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత భారత మహిళాల జట్టుకు సారధిగా ఎదిగింది. ప్రపంచ కప్ విజేతగా భారత జట్టును నిలిపింది. చివరికి భారత మహిళా క్రికెట్లో ఒక శకానికి […]

Harmanpreet Kaur: క్రికెట్ లో కొందరు ప్లేయర్లు పరుగులు చేస్తారు. మరికొందరు మ్యాచులు గెలిపిస్తారు. మరికొందరు మాత్రం తమ ప్రయాణంతోనే ఒక తరానికి దారి చూపిస్తారు. హర్మన్ ప్రీత్ కౌర్ ఈ జాబితాలో మూడవ కోవకు వస్తారు.

పంజాబ్లో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడుతూ ఆమె తన ప్రయాణం మొదలుపెట్టింది. ఆ తర్వాత భారత మహిళాల జట్టుకు సారధిగా ఎదిగింది. ప్రపంచ కప్ విజేతగా భారత జట్టును నిలిపింది. చివరికి భారత మహిళా క్రికెట్లో ఒక శకానికి ప్రతీకగా నిలిచే స్థాయికి ఆమె ఎదిగింది. 11వ తరగతిలో ఉన్నప్పుడే క్రికెట్ ను ఆమె సీరియస్ గా తీసుకుంది. అప్పటికే ఆమె పంజాబ్ అండర్ 19 జట్టుకు సారధిగా వ్యవహరించింది.

కథలో అసలు ప్రత్యేకత ఆమె కెరియర్లో సాధించిన గణాంకాలు మాత్రమే కాదు.. ఒకప్పుడు భారత మహిళల క్రికెట్ కు అంతగా గుర్తింపు లేని సమయంలో ఆమె వచ్చింది. ఆ తర్వాత తరానికి ఇక్కడి నుంచే ప్రపంచ స్థాయికి వెళ్లొచ్చు అనే నమ్మకాన్ని కలిగించింది. 2017 ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియా పై ఆమె సాధించిన 171* పరుగులు భారత మహిళల క్రికెట్ చరిత్రలో అద్భుతమైన ఇన్నింగ్స్ అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఆమె కేవలం భారత క్రికెట్ లోనే కాదు.. ప్రపంచ క్రికెట్లో కూడా తనదైన ముద్ర వేసింది

అక్కడితోనే ఆమె ప్రయాణం ఆగిపోలేదు. ప్రపంచ కప్ సాధించలేదనే నిరాశ.. కెప్టెన్సీ ఒత్తిడి.. ఇవన్నీ కూడా ఆమెను ఇబ్బంది పెట్టాయి. వీటన్నిటిని కూడా ఆమె సానుకూల దృక్పథంతో దాటుకుంటూ ముందుకు వెళ్ళింది. చివరికి 2025 లో భారత మహిళల జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచ కప్ గెలిచేలాగా చేసింది. ఆ ట్రోఫీని అందుకున్న తర్వాత కౌర్ తన కెరియర్లో అద్భుతమైన అధ్యాయాన్ని రాసుకున్నట్టు ప్రకటించింది.

ఆ విజయం ఆమెకు కేవలం మరొక ట్రోఫీ మాత్రమే కాదు.. అమ్మాయిలు కూడా క్రికెట్లో అత్యున్నతస్థాయి శిఖరాలు అందుకోగలరనే నమ్మకాన్ని ఆమె కలిగించింది. 2026లో ఆమె ఒక అద్భుతమైన మైలురాణి అందుకుంది. దక్షిణాఫ్రికా జట్టుతో జరిగిన మ్యాచ్లో 200 t20 అంతర్జాతీయ మ్యాచులు ఆడిన తొలి అంతర్జాతీయ క్రికెటర్ గా అమెరికా సృష్టించింది. 2009లో టి20 లో ఆమె ప్రవేశించింది. 17 సంవత్సరాలకు పైగా ఆమె తన టి20 కెరియర్ సాగించింది. ఇక అదే ఏడాది ఆసియా కప్ లో భారత్ 8వ సారి టైటిల్ గెలిచింది. అది కూడా కౌర్ నాయకత్వంలో కావడం విశేషం. అంతేకాదు 150 అంతర్జాతీయ మ్యాచ్లకు సారథిగా వ్యవహరించి.. ప్రపంచంలోనే తొలి సారధిగా రికార్డ్ సృష్టించింది. ఇక 2026 అక్టోబర్ 6న కౌర్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. 2016లో టి20 కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి.. 2022లో అన్ని ఫార్మాట్లకు సారధిగా ఎదిగింది. దాదాపు ఒక దశాబ్దం పాటు భారత మహిళా క్రికెట్ కు నాయకురాలుగా వ్యవహరించింది.

హర్మన్ ను కేవలం ఒక సారధిగా చూస్తే ఆమె కథలో సగభాగం మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆమె అసలు కథ మహిళల క్రికెట్ కి వచ్చిన తర్వాత కనిపిస్తుంది. భారత మహిళా క్రికెట్ కు దూకుడును.. శాంతాన్ని.. స్థిర చిత్తాన్ని అందించిన ఘనత మాత్రం ముమ్మాటికి కౌర్ కు ఉంటుంది. ఇందులో ఏమాత్రం సందేహం లేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper