spot_img
Homeఆంధ్రప్రదేశ్‌AP Elections 2024: చివరి రోజు రంగంలోకి మెగాస్టార్.. చంద్రబాబు మైండ్ బ్లోయింగ్ స్కెచ్

AP Elections 2024: చివరి రోజు రంగంలోకి మెగాస్టార్.. చంద్రబాబు మైండ్ బ్లోయింగ్ స్కెచ్

AP Elections 2024: ఏపీ ఎన్నికల్లో పట్టు బిగించాలని చంద్రబాబు కృత నిశ్చయంతో ఉన్నారు. అంది వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. పోలింగ్ నాటికి ప్రజలపై ప్రభావితం చూపే అన్ని అంశాలను, అస్త్ర శస్త్రాలను ప్రయోగిస్తున్నారు. పొత్తుల అంశాన్ని సానుకూలంగా సర్దుబాటు చేసుకున్నారు. తక్కువ సీట్లతో జనసేన, బిజెపిని తన దారికి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎన్నికల ముంగిట బిజెపి ద్వారా అధికారుల బదిలీలు, ఎలక్షన్ క్యాంపెయిన్ వినియోగించుకునే పనిలో పడ్డారు. ఈ తరుణంలోనే చంద్రబాబు చూపు మెగాస్టార్ పై పడింది. కూటమికి ఎలాగైనా చిరంజీవితో మద్దతు ప్రకటింపజేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే చిరంజీవి కూటమిలో ఉన్న జనసేన, బిజెపి అభ్యర్థులను ఆశీర్వదించారు. మెగా అభిమానులకు స్పష్టమైన సంకేతాలు పంపగలిగారు. జనసేనకు ఏకంగా ఐదు కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు. ఈరోజు ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఎన్నుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెనువెంటనే టాలీవుడ్ కు చెందిన హీరోలు ఒక్కొక్కరు పవన్ కళ్యాణ్ కు మద్దతు ప్రకటించారు. అయితే దీని వెనుక చంద్రబాబు ప్రత్యేక వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ లోపు వీలైనంతవరకు టాలీవుడ్ ప్రముఖులతో కూటమికి మద్దతుగా ప్రకటనలు ఇప్పించాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే పవన్ కు మద్దతుగా చిరంజీవి ప్రచారం చేస్తారని జోరుగా టాక్ నడిచింది. ఇప్పటికే చిరంజీవి సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. అయితే చివరి రోజు ఈ నెల 11న పిఠాపురంలో చిరంజీవి ప్రచారం చేస్తారని ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది. ఇందుకుగాను పదో తేదీ చిరంజీవి విజయవాడ చేరుకుంటారని.. చంద్రబాబుతో కలిసి మీడియాతో మాట్లాడతారని కూడా టాక్ నడుస్తోంది. తరువాత అదే రోజు విజయవాడలో నారా రోహిత్ నటించిన ప్రతినిధి 2 సినిమాను వీక్షిస్తారని కూడా తెలుస్తోంది. 11న అక్కడ నుంచి నేరుగా పిఠాపురం ప్రచారానికి వెళ్తారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా చంద్రబాబు స్కెచ్ లో భాగంగా జరుగుతోందన్నది ప్రాధాన్యత సంతరించుకుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Oktelugu Epaper