Homeఎంటర్టైన్మెంట్Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10' లోకి వైల్డ్ కార్డు గా ఎంట్రీ...

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లోకి వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇవ్వనున్న అమర్ దీప్.. రెమ్యూనరేషన్ ఎంతంటే!

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో ఎవ్వరూ ఊహించని సంఘటనలు , పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని కలలో అయినా ఊహించి ఉంటామా?, కానీ ఒక ఎలిమినేషన్ కాదు , వీకెండ్ లోపు రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. నిన్నటి ఎపిసోడ్ లో చరణ్ ఎలిమినేట్ కాగా , నేటి ఎపిసోడ్ లో చైత్ర ఎలిమినేట్ కానుంది. ఇలా వీకెండ్ వచ్చే లోపు ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ […]

Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ లో ఎవ్వరూ ఊహించని సంఘటనలు , పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మొదటి వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందని కలలో అయినా ఊహించి ఉంటామా?, కానీ ఒక ఎలిమినేషన్ కాదు , వీకెండ్ లోపు రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. నిన్నటి ఎపిసోడ్ లో చరణ్ ఎలిమినేట్ కాగా , నేటి ఎపిసోడ్ లో చైత్ర ఎలిమినేట్ కానుంది. ఇలా వీకెండ్ వచ్చే లోపు ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వడం , అది కూడా రోహిత్ టీం కి సంబంధించిన వాళ్ళే అవ్వడం గమనార్హం. ఈ ఒక్క అంశాన్ని పట్టుకొని త్రిగున్ వచ్చే వారం నామినేషన్స్ లో రచ్చ చేయొచ్చు. అలా తయారైంది పరిస్థితి. ఇకపోతే వీకెండ్ లో ఆడియన్స్ ఓటింగ్ ద్వారా మరో కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అదే కనుక జరిగితే సుధీర్ ఎలిమినేట్ అవుతాడట.

ఇదంతా పక్కన పెడితే నాలుగు వారాలు పూర్తి అయ్యాక , వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకొని రాబోతున్నారు. ఇప్పటికే పలువురి పేర్లు వినిపించాయి. ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న మరో పేరు అమర్ దీప్ చౌదరి . ‘బిగ్ బాస్ 7’ రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ , ఆ షో ద్వారా ఎంతటి క్రేజ్ ని సంపాదించుకున్నాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈయన్ని గత సీజన్ లోనే వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా తీసుకొని రావాలని అనుకున్నారు. కానీ రెమ్యూనరేషన్ విషయం లో చర్చలు విఫలం అవ్వడం తో రాలేకపోయాడు. కానీ ఈ సీజన్ లో మాత్రం ఆయన కోరినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట మేకర్స్. ఎందుకంటే ప్రస్తుతం వార్ వన్ సైడ్ అయిపోయింది. మొదటి వారం లోనే రోహిత్ ఎవ్వరికి అందనంత రేంజ్ కి వెళ్ళిపోయాడు.

ఓటింగ్ లో ప్రస్తుతం అతనికి పోటీ వచ్చే వాళ్ళే లేరు. అందుకే అమర్ దీప్ ని రంగం లోకి దించుతున్నట్టు సమాచారం. అమర్ దీప్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, కానీ ప్రస్తుతం రోహిత్ ఊపు ని మ్యాచ్ చేయగలడా అనే అనుమానాలు ఉన్నాయి. ఒక సీజన్ రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ , మరో సీజన్ లో కూడా రన్నర్ గా నిలవడానికి ఇష్టపడడు కదా, ఇదొక్కటే ప్రస్తుతం ఆలోచిస్తున్నాడట. ఇంకా ఆయన నిర్ణయం చెప్పలేదని సమాచారం. మేకర్స్ అమర్ దీప్ కి వారానికి 4 లక్షలకు పైగా రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు సిద్ధం గా ఉన్నారట. మరి అమర్ దీప్ వస్తాడో లేదో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper