Pawan Kalyan Next CM Of AP: బ్రహ్మంగారు ముందే ఊహించి చెప్పిన కాలజ్ఞానం ప్రకారమే ఇప్పుడు అంతా జరుగుతోంది. తెల్లకాకులు సంచరిస్తున్నాయి.. తిరుమల దేవస్థానం కరోనాతో కొన్ని నెలలు మూతపడింది. కరోనాతో చాలా మంది చనిపోయారు. విధవరాలు (ఇందిరాగాంధీ) దేశాన్ని ఏలారు. ఇలా ఆ కాలజ్ఞాని చెప్పినవన్నీ దేశంలో నిజమయ్యాయి. ఈ క్రమంలో ఓ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పవన్ కళ్యాణ్ గురించే చెబుతున్నట్లు బ్రహ్మంగారి చెప్పిన కాలజ్ఞానానికి సంబంధించిన ఓ ఫోటో హల్ చల్ చేస్తోంది.

బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని ఫోటో చూస్తే.. ‘తెలుగు రాష్ట్రమున పవనుడు వచ్చెనయ.. రాజ వారసత్వం (జగన్) నశించునయ.!.ప్రజారాజ్యం విలసిల్లునయ!’ అంటూ రాసి ఉంది. అది ఇప్పుడు జనసైనికులు, పవన్ అభిమానులు తెగ వైరల్ చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నెక్ట్స్ సీఎం అని హోరెత్తిస్తున్నారు. ఇప్పుడిదే తెలుగునాట చర్చనీయాంశమైంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే టాపిక్ నడుస్తోంది.
పోతలూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. తన కాలజ్ఞానంలో చెప్పిన చాలా విషయాలు ప్రపంచంలో వెలుగుచూశాయి. ఆయన ప్రవచనాలకు.. జరుగుతున్న పరిణామాలకు దగ్గర పోలికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బ్రహ్మంగారు ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్ని శతాబ్ధాల కిందటే అంచనా వేసినట్టు ఫొటో వైరల్ కావడం అందరి ద్రుష్టిని ఆకర్షించింది.అయితే ఇది ఒక్క వ్యాఖ్యతో ఆగలేదు. రెండవ లైన్‌లో ‘రాజవారసత్వము నశించునయ ’అంటూ.. ఉంది. ఇదే తరహా రాజకీయం ఇప్పుడు ఏపీలో నడుస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా జగన్ ఏపీ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు.ఆయన అకాల మరణంతో ప్రజల్లో ఉన్న సెంటిమెంట్ ను రగిలించి ముఖ్యమంత్రి అయ్యారు. రాజుల కాలంలో మాదిరగా వారసత్వం నడుస్తోంది.

ఒకవేళ బ్రహ్మంగారు చెప్పినట్లు వైరల్ అవుతున్న ఫోటోలో వారసత్వాలు పోయి పవనుడు వచ్చేడయా మొదటి లైన్‌లో చెప్పినట్లు చూస్తే పవన్ కళ్యాన్ సీఎం అవ్వడం ఖాయమంటున్నారు..
ఇటు పవన్ కళ్యాన్ కూడా ఈ సారి రాజకీయాల్ని ఎన్నికల్ని సీరియస్‌గా తీసుకున్నారు. నెక్ట్స్ ఏపీ సీఎం కావాలన్న పట్టుదలతో పాలిటిక్స్ నడుపుతున్నారు. ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలన్న తపనతో సీరియస్‌గా పనిచేస్తున్నారు. ఇటు జనసైనికులు కూడా ఈసారి గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాజాగా బ్రహ్మంగారి వాక్కు నిజం కావాలని కోరుకుంటున్నారు.