Unstoppable 2 With NBK- Minister Roja: హోస్ట్ గా బాలయ్య వీర విహారం చేస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 సైతం రికార్డు వ్యూస్ రాబడుతుంది. ఫస్ట్ ఎపిసోడ్ కి ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ హాజరయ్యారు. చంద్రబాబు జీవితంలో అతిపెద్ద ఆరోపణ వెన్నుపోటు అంశంపై చంద్రబాబు-బాలకృష్ణ మాట్లాడటం సంచలనం రేపింది. ఇక్కడ బాబుకు అనుకూలంగా మాట్లాడుకున్నప్పటికీ ఆగస్టు సంక్షోభం తెరపైకి తెచ్చి చర్చిస్తారని ఊహించలేదు. ఈ క్రమంలో ఫస్ట్ ఎపిసోడ్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంది.

సెకండ్ ఎపిసోడ్ గెస్ట్స్ గా యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. కుర్రాళ్లలో కుర్రాడిగా కలిసిపోయిన బాలకృష్ణ వారిద్దరినీ క్రేజీ ప్రశ్నలు అడిగారు. అమ్మాయిలతో అఫైర్స్ మేటర్స్ నుండి సాయంత్రం వేసే మందు పెగ్గు వరకూ అన్నీ చర్చించారు. అన్ స్టాపబుల్ సెకండ్ ఎపిసోడ్ ఫుల్ ఎనర్జిటిక్ గా సాగింది. విశ్వక్, సిద్ధు తమ కెరీర్లోని లోటు పాట్లు కష్టాల గురించి కూడా మాట్లాడారు.
బ్యాక్ టు బ్యాక్ రెండు ఎపిసోడ్స్ కి మంచి ఆదరణ దక్కిన నేపథ్యంలో ఎవరు నెక్స్ట్? అనే ఆత్రుత ప్రేక్షకుల్లో మొదలైపోయింది. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా షోకి వస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఇదే నిజమైతే బాలయ్య-రోజా మధ్య వార్ మాములుగా ఉండదు. ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న రోజా-బాలయ్య ఎదురుపడితే యుద్ధమే అని చెప్పొచ్చు. రాజకీయ నేపథ్యం ఉన్నవారిని బాలయ్య అలాంటి ప్రశ్నలే అడుగుతారు కాబట్టి… షో హీటెక్కడం ఖాయం.

అందులోనూ రోజా రాజకీయ ప్రస్థానం మొదలైంది టీడీపీలోనే. ఆమె ఆ పార్టీ తరపున కొన్ని కీలక బాధ్యతలు కూడా నెరవేర్చారు. 2009 ఎన్నికలకు ముందు రోజా టీడీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అక్కడ తనకు సరైన గుర్తింపు, గౌరవం దక్కడం లేదని అప్పట్లో ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆమె వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. బాలయ్య ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. కాబట్టి రోజా కనుక బాలయ్య షోకి వస్తే ఆ కిక్కే వేరు. ఇక సినిమాల పరంగా చూస్తే వీరిద్దరిదీ సూపర్ హిట్ కాంబినేషన్. భైరవ ద్వీపం, పెద్దన్నయ్య, బొబ్బిలి సింహం వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల్లో జతకట్టారు.