Homeఆంధ్రప్రదేశ్‌YCP  Illegal Affairs :  మొన్న విజయసాయి.. నిన్న దువ్వాడ.. రేపు ద్వారంపూడి.. తెలుగు మీడియాకు...

YCP  Illegal Affairs :  మొన్న విజయసాయి.. నిన్న దువ్వాడ.. రేపు ద్వారంపూడి.. తెలుగు మీడియాకు పసందైన విందు

YCP  Illegal Affairs : ఏపీలో మీడియాకు మరో పసందైన వార్త. వైసీపీలోని మరో కీలక నేత రాసలీలలు బయటపడనున్నట్లు తెలుస్తోంది. టిడిపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం నేతల వ్యవహారం బయటపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అయ్యేది. కానీ ఇప్పుడు దాస్తామన్న దాగడం లేదు. ఒక్కో ఎపిసోడ్ బయట పడుతూనే ఉంది. తొలుత విజయసాయిరెడ్డి పేరు బయటకు వచ్చింది. నేరుగా మీడియాలో కథనాలు కాకుండా.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి భర్తను తెరపైకి తెచ్చారు. ఆమె కడుపులో ఉన్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలంటూ ఆయన ప్రశ్నించేసరికి ఇది వివాదాస్పదంగా మారింది. క్రమేపి విజయసాయి రెడ్డి పై ఆరోపణలు వెళ్లాయి. దీంతో ఆయన ఉక్కిరిబిక్కిరి అయ్యారు. మీడియా ప్రతినిధులకు కుట్రగా అభివర్ణిస్తూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఏపీలో ఉండకుండా ఎక్కువగా ఢిల్లీలోనే గడుపుతున్నారు. అటు తరువాత అక్కడకు నెల రోజులు పోయేసరికి దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. రచ్చ రచ్చ నడుస్తోంది. పేరుకే ఇది దువ్వాడ వ్యవహారం కానీ.. వైసీపీని అప్రతిష్ట పాలు చేసింది. ఇంతవరకు హై కమాండ్ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఇంకా చాలామంది నేతల రాసలీలలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.ముఖ్యంగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. గత ఐదేళ్లుగా ఆయన సాగించిన రాసలీలలకు సంబంధించిన వార్త ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఈసారి మీడియా అంతా అటువైపు ఫోకస్ చేసే అవకాశం ఉంది.

* జనసేన నేత హాట్ కామెంట్స్
ఇటీవల జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా విషయాలను బయటపెట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక దళిత మహిళతో వివాహేతర సంబంధంతో ఉన్నారని ఆరోపించారు. ఆమె గర్భవతి అయితే.. కడుపులో ఉన్నది ఆడ, మగ బిడ్డ అని తెలుసుకోవడానికి స్కానింగ్ కూడా చేయించారని ఆరోపించారు. అలా పుట్టిన బిడ్డకు తలనీలాలను తిరుపతిలో ఇప్పించారని.. తన ఒడిలో పెట్టుకునే ప్రత్యేక పూజలు చేశారని కూడా బొలిశెట్టి ఆరోపణలు చేశారు.

* అప్పట్లో ద్వారంపూడి దూకుడు
జనసేన విషయంలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దూకుడుగా ఉండేవారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అందుకే పవన్ సైతం ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కి గట్టిగానే హెచ్చరికలు పంపించారు. ఉక్కు పాదంతో అణచివేస్తానని కూడా హెచ్చరించారు. ఇప్పుడు జనసేన అదే పనిలో ఉంది. అందులో భాగంగానే బొలిశెట్టి సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి కూడా ఆరోపణలు చేశారు. ఇది మరో పది రోజులపాటు మీడియాకు హాట్ టాపిక్ గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

* హౌస్ అరెస్టులో బాధిత మహిళ
అయితే సదరు దళిత మహిళ ఇప్పుడు ద్వారంపూడి ఆధీనంలో ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత ఏడాదిగా ఆమె హౌస్ అరెస్ట్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి బయట 28 కెమెరాలను పెట్టి బయటకు రానివ్వకుండా కట్టడి చేశారని బొలిశెట్టి సత్యనారాయణ చెప్పారు. ఆమె కారులో సైతం డివైస్ పెట్టి ఎప్పటికప్పుడు రాకపోకలు గమనిస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. అయితే బొలిశెట్టి తాజా వ్యాఖ్యలతో మీడియా గుట్టును బయటపెట్టే అవకాశం ఉంది. అదే జరిగితే తెలుగు మీడియాఆకలి తీరినట్టే.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular