Homeఆంధ్రప్రదేశ్‌AP Panchayat Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముహూర్తం ఫిక్స్!

AP Panchayat Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముహూర్తం ఫిక్స్!

AP Panchayat Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తోంది. సెప్టెంబర్ లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డిసెంబర్లో పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కొత్త సంవత్సరం నాటికి కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా చూడాలని ప్రభుత్వం కూడా చూస్తోంది. ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసింది ముందుగా. తర్వాత పంచాయితీ పాలకవర్గాల గడువు కూడా ముగిసింది. వచ్చే నెలలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాల గడువు […]

AP Panchayat Elections 2026: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తోంది. సెప్టెంబర్ లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. డిసెంబర్లో పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. కొత్త సంవత్సరం నాటికి కొత్త పాలకవర్గాలు కొలువుదీరేలా చూడాలని ప్రభుత్వం కూడా చూస్తోంది. ఇప్పటికే మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగిసింది ముందుగా. తర్వాత పంచాయితీ పాలకవర్గాల గడువు కూడా ముగిసింది. వచ్చే నెలలో జిల్లా పరిషత్, మండల పరిషత్ పాలకవర్గాల గడువు ముగియనుంది. దాదాపు స్థానిక సంస్థలన్నీ పాలకవర్గాలు లేక ప్రత్యేక అధికారుల పాలనలోకి వచ్చాయి. అందుకే వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది ప్రభుత్వం. ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ప్రారంభించింది.

*ఆ నిబంధనతో..
రాష్ట్రవ్యాప్తంగా వందకు పైగా మున్సిపాలిటీలు, 12 కార్పొరేషన్లకు సంబంధించిన పాలకవర్గాల పదవీకాలం గడువు మార్చి 17 తో ముగిసింది.. దీంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13వేల పంచాయితీలకు సైతం పాలకవర్గాల గడువు ఏప్రిల్ 2తో ముగిసింది. వచ్చే నెలలో జిల్లా పరిషత్తులతో పాటు మండల పరిషత్తుల పదవి కాలం కూడా ముగియనుంది. ఇప్పటికే పంచాయతీలతో పాటు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారులు వచ్చారు. జిల్లా పరిషత్తులకు సైతం ప్రత్యేక అధికారులు రానున్నారు. పాలకవర్గాల పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించి కొత్త కార్యవర్గాలను ఎన్నుకోవాలన్న నిబంధన ఉంది. అందుకే సెప్టెంబర్ నుంచి ఎన్నికల ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ లోగా పూర్తి చేయాలని ఎన్నికల సంఘం గట్టి వ్యూహంతోనే ఉంది.

* ముందుగా పంచాయితీలకు..
ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. చివరిసారిగా 2021లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా పంచాయితీలను గెలుచుకుంది. అప్పట్లో ఎన్నికలు జరిగిన తీరు కూడా అందరికీ తెలిసిన విషయమే. వాలంటీర్లతో పాటు సచివాలయ ఉద్యోగుల ద్వారా పంచాయితీల్లో నెగ్గుకు వచ్చింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. మొన్నటి వరకు స్థానిక సంస్థలన్నీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతిలోనే ఉండేవి. ఆ పార్టీ యాక్టివ్ గా ఉండడానికి అదొకటి కారణం. ముందుగా పంచాయితీలకు, తరువాత మున్సిపాలిటీలకు, చివరిగా జిల్లా పరిషత్తులతో పాటు మండల పరిషత్తులకు ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. సెప్టెంబర్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఖాయం అని తెలుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper