Homeక్రీడలుక్రికెట్‌South Africa vs Australia: ఆస్ట్రేలియాను నేల నాకించిన సౌత్ ఆఫ్రికా.. టెస్ట్ క్రికెట్లో ఇది...

South Africa vs Australia: ఆస్ట్రేలియాను నేల నాకించిన సౌత్ ఆఫ్రికా.. టెస్ట్ క్రికెట్లో ఇది అద్భుతం కాదు అంతకుమించి..

South Africa vs Australia: టెస్ట్ క్రికెట్లో ముఖ్యంగా యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య పోరాటం గట్టిగా ఉంటుంది. దశాబ్దాలుగా ఈ రెండు జట్లు టెస్ట్ క్రికెట్లో సమాంతర ప్రత్యర్థులుగా ఎదిగాయి. వన్డే.. టి20 ఫార్మేట్ లో టీమిండియా.. పాకిస్తాన్ మధ్య వైరం గట్టిగా ఉంటే.. టెస్ట్ క్రికెట్లో మాత్రం ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా మధ్య పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టులో చేవ చచ్చిపోయింది. యాషెస్ […]

South Africa vs Australia: టెస్ట్ క్రికెట్లో ముఖ్యంగా యాషెస్ సిరీస్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య పోరాటం గట్టిగా ఉంటుంది. దశాబ్దాలుగా ఈ రెండు జట్లు టెస్ట్ క్రికెట్లో సమాంతర ప్రత్యర్థులుగా ఎదిగాయి. వన్డే.. టి20 ఫార్మేట్ లో టీమిండియా.. పాకిస్తాన్ మధ్య వైరం గట్టిగా ఉంటే.. టెస్ట్ క్రికెట్లో మాత్రం ఇంగ్లాండ్.. ఆస్ట్రేలియా మధ్య పోటీ చాలా రసవత్తరంగా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. ఎందుకంటే ఇంగ్లాండ్ జట్టులో చేవ చచ్చిపోయింది. యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇవ్వడం దేవుడెరుగు.. కనీసం వైట్ వాష్ నుంచి తప్పించుకుంటే అదే పది వేలు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా జట్టుకు ఇంగ్లాండుకు మించిన స్థాయిలో పోటీ ఇచ్చేందుకు దక్షిణాఫ్రికా రంగంలోకి వచ్చింది. గత ఏడాది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో విజయం సాధించి.. ఆస్ట్రేలియా నుంచి టెస్ట్ గదను సొంతం చేసుకున్న దక్షిణాఫ్రికా.. ఇప్పుడు కూడా అదే టెంపో కొనసాగిస్తోంది. అంతేకాదు ప్రస్తుతం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ సైకిల్ లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది దక్షిణాఫ్రికా.

ఆస్ట్రేలియా జట్టుతో మూడు టెస్టుల సిరీస్ ను ఆడుతోంది దక్షిణాఫ్రికా. ఈ సిరీస్లో ఒక మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా.. మరో మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలిచాయి. ఇక సిరీస్ భవితవ్యాన్ని నిర్ణయించే మూడవ టెస్టులో ఆస్ట్రేలియా బలమైన పోటీ ఇచ్చింది. కాకపోతే చివరి వరకు పోరాడి దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆస్ట్రేలియా మీద తన ఆధిపత్యాన్ని ముఖ్యంగా టెస్ట్ క్రికెట్లో తన సత్తాని మరోసారి నిరూపించుకుంది దక్షిణాఫ్రికా. మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో 100 పరుగులు వెనుకబడినప్పటికీ సౌత్ ఆఫ్రికా నిజమైన పోరాటాన్ని చేసి చూపించింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికా జట్టులో హర్మర్ ఏకంగా పది వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో నాలుగు.. రెండవ ఇన్నింగ్స్ లో ఆరు వికెట్లు సాధించి.. ఆస్ట్రేలియా పతనాన్ని శాసించాడు..

ఇక ఈ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తొలి ఇన్నింగ్స్ లో 329 పరుగులు చేసింది. రెండవ ఇన్నింగ్స్ లో 387 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 429 పరుగులు చేసింది. ఇక రెండవ ఇన్నింగ్స్ లో 111 పరుగులకు కుప్పకూలింది. ఆస్ట్రేలియా ఎదుట నలుగురు ఆటగాళ్లు 0 పరుగులకు ఔట్ అయ్యారు. దక్షిణాఫ్రికా విధించిన 288 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. ఏ దశలో కూడా గెలిచే మాదిరిగా కనిపించలేదు. దక్షిణాఫ్రికా బౌలర్ల వీరోచితమైన పోరాటం ముందు తలవంచక తప్పలేదు. వాస్తవానికి తొలి మూడు రోజుల పాటు మైదానం బ్యాటర్లకు అనుకూలంగా మారింది. ఆ తర్వాత నుంచి పిచ్ స్వరూపం పూర్తిగా మారిపోయింది. ఇదే క్రమంలో మైదానం మీద తేమలేకపోయినప్పటికీ దక్షిణాఫ్రికా బౌలర్లు బంతికి మంచి స్వింగ్.. స్పిన్ రాబట్టారు. తద్వారా ఆస్ట్రేలియా జట్టు పతనాన్ని శాసించారు. ఆస్ట్రేలియా జట్టు ఓడిపోవడంతో నెంబర్ వన్ రాంక్ కోల్పోయింది. అదేవిధంగా సిరీస్ ను కూడా దూరం చేసుకుంది. బవుమా నాయకత్వంలో దక్షిణాఫ్రికా స్థిరమైన విజయాలు సాధిస్తోంది. ఇప్పుడు ఏకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ సైకిల్లో దక్షిణాఫ్రికా నెంబర్ వన్ స్థానంలో నిలవడం విశేషం.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper