AP IAS Officer Indecent Behavior: అతడు ఒక సివిల్ సర్వెంట్. వయసు ఐదుపదులు దాటింది. పనిచేస్తోంది ఏపీ కేడర్ లో.. సౌమ్యుడిగా.. విషయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తిగా ఆయనకు పేరుంది. పైగా సీనియర్ అధికారి కావడంతో సివిల్ సర్వెంట్ వర్గాలలో కూడా ఆయనకు మంచి గౌరవం ఉంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈయనకు మంచి స్థానం లభించింది. అప్పట్లో ఈయనకు డబ్బులు దండిగా వచ్చేవి. దీంతో చూస్తుండగానే స్థాయి పెరిగిపోయింది. ఆస్తులు పెరిగాయి. అంతస్తులు కూడా పెరిగాయి. డబ్బుంటే రకరకాల అవ లక్షణాలు అలవడతాయని ఓ సామెత. ఈ సామెత ఈయన విషయంలో కూడా నిజమైంది.
Also Read: కల్వకుంట్ల కవిత చెప్పింది అబద్దమా… వైఎస్ ను హరీష్ అందుకే కలిశారా.. వెలుగులోకి సంచలన వీడియో
హైదరాబాద్ నగరంలో ఉండే ఓ మహిళతో ఈ అధికారికి పరిచయం ఏర్పడింది. ఒక పని నిమిత్తం ఆమె అమరావతి వెళ్ళినప్పుడు సార్ పరిచయం చేసుకున్నాడు. దాని కాస్త శారీరక సంబంధానికి మార్చాడు. ఎప్పుడైతే ఆమె ఇతడికి స్వర్గ సుఖాలు అందించడం మొదలుపెట్టిందో.. అమరావతి నుంచి హైదరాబాద్ కు తిరగడం మొదలు పెట్టాడు. ఇటీవల కాలంలో ఈ ఐఏఎస్ అధికారికి ఓ వ్యాధి సోకింది. దీంతో హైదరాబాద్ లోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో అత్యంత ఖరీదైన చికిత్స చేయించుకున్నాడు. దీంతో అతడి ఆరోగ్యం కుదుటపడింది. తనకు ఆరోగ్యం బాగా లేనప్పుడు సదరు మహిళ వేరే వారితో సన్నిహితంగా ఉంటుందని ఈయనకు అనుమానం వచ్చింది. అంతేకాదు ఆమెపై నిఘా కూడా పెట్టాడు.. అందులో ఏం తెలీందో తెలియదు.. ఆమె ఎవరితో సన్నిహితంగా ఉందో తెలియదు.. మొత్తానికి అయితే ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఇటీవల తెలంగాణ రాజధానికి అధికారి వెళ్ళాడు. ఇద్దరి మధ్య ఇదే విషయంపై వాగ్వాదం జరిగింది. వాస్తవానికి ఆయన వయసు ఐదు పదులు అయినప్పటికీ.. లేని బలాన్ని తెచ్చుకుని ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తలను గోడకేసి కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. భయపడిన ఆ అధికారి వెంటనే తనకున్న పలుకుబడి ద్వారా కిందపడిపోయి చనిపోయింది అన్నట్టుగా ఆసుపత్రి రికార్డుల్లో రాయించాడు. మొత్తానికి తనకు ఎటువంటి మరకలేకుండా చూసుకున్నాడు. కానీ ఈ వ్యవహారం ఇక్కడితోనే ఆగలేదు. సదరు అధికారి లీలలు తెలిసిన కొంతమంది సివిల్ సర్వెంట్లు ఈ విషయాన్ని జర్నలిస్ట్ సర్కిల్స్ లో చెప్పుకున్నారు. అది కాస్త అందరికీ తెలిసిపోయింది.
ఈ విషయం తెలియడంతో సదరు అధికారి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారం ఇంటెలిజెన్స్ ద్వారా ఏపీ ప్రభుత్వానికి తెలిసినట్టు సమాచారం.. దీనిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? ఆయనను సస్పెండ్ చేస్తుందా? గతంలో ఈయన కీలక అధికారిగా ఉన్నప్పుడు ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.