MLC Kavitha Vs Harish Rao: “ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే కాకుండానే హరీష్ మంత్రి అయ్యారు. అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిని సంక్షోభంలో నెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. చివరికి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ ను కూడా కలిశారు. ఇదంతా అబద్ధమా.. కొంతమంది ఏదో చెబుతున్నారు గాని.. గతంలో ఉన్న వారికి తెలియదా.. నాడు వైఎస్ ను తెలంగాణ రాష్ట్ర సమితి సర్వనాశనం చేయాలనుకోలేదా” ఇవీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రిని ఉద్దేశించి జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలు. ఈ ఆరోపణలను ఆయన వర్గం ఖండిస్తోంది. మాజీ మంత్రి ఎలాంటి తప్పూ చేయలేదని.. మొదటినుంచి కూడా కెసిఆర్ వెంటే ఉన్నారని.. సంక్షోభ సమయాలలో పార్టీని కాపాడారని గుర్తు చేస్తున్నారు. ఇదే సమయంలో గతంలో సిద్దిపేట ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు సంబంధించిన ఒక వీడియోను ఆయన అనుచరులు బయటపెడుతున్నారు.
Also Read: అందర్నీ మేనేజ్ చేసింది.. హోమ్ మినిస్టర్ కుర్చీపై కర్చీఫ్ వేసింది.. కానీ చివరికి..
ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే
గతంలో హరీష్ రావు వేమూరి రాధాకృష్ణ నిర్వహించిన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో నాడు వైయస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు వెళ్లి కలిసిన విషయాన్ని రాధాకృష్ణ ప్రస్తావించారు. దీనికి సంబంధించి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు..” నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ ను కలిసింది నిజం. ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్న రవిచంద్ అక్కడ ఉన్నారు. నేను ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళినప్పుడు.. రవి చంద్ చేతిలో ఒక పుష్పగుచ్చం ఉంది. అకస్మాత్తుగా దానిని ఆయన నాకు ఇచ్చారు. దీంతో నేను వైయస్ ను కలిసినప్పుడు ఇవ్వాల్సి వచ్చింది. అనూహ్యంగా దానిని కొంతమంది ఫోటో తీసి రకరకాలుగా రాసుకుంటూ వచ్చారు. దీంతో స్వయంగా నేను వచ్చి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలోని ఓ ప్రాంతానికి వైఎస్ డిగ్రీ కాలేజీ మంజూరు చేశారు. దానికంటే ముందు సిద్దిపేట నియోజకవర్గం డిగ్రీ కాలేజీ అవసరం ఉందని చెప్పాను. అదే విషయం ఆయన వద్ద ప్రస్తావించాను. వాస్తవానికి జరిగింది ఇది.. కానీ జరిగిన ప్రచారం వేరని” హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు.
ఇప్పుడు మళ్లీ చర్చ
నాడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ ను సిద్దిపేట ఎమ్మెల్యే కలిశారని.. అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిని ఆగం చేయాలని ప్రయత్నించారని.. జాగృతి అధినేత్రి ఆరోపించారు. ఈ ఆరోపణలు సహజంగానే తెలంగాణ రాజకీయాలలో చర్చకు దారితీసాయి. ఈ నేపథ్యంలో హరీష్ రావు వర్గీయులు నాడు జరిగిన విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వేమూరి రాధాకృష్ణతో హరీష్ రావు చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోను బయటపెడుతున్నారు. అడ్డగోలుగా ఆరోపణలు చేస్తే.. అబద్ధాలు నిజాలు కావని.. అసలైన నిజాలు ఇదిగో ఇలా ఉన్నాయని వారు వ్యాఖ్యానిస్తున్నారు.
That day, Harish Rao clearly explained why he met Y. S. Rajasekhara Reddy garu listen to it. Today, this is the answer to the allegations made by @RaoKavitha pic.twitter.com/AjKzMFKdua
— Captain Fasak 2.0 (@2Captainparody) September 3, 2025