Vangalapudi Anitha: దేశవ్యాప్తంగా రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. సోదర బంధానికి ప్రతీకగా నిలిచిన రక్షాబంధన్ నాడు సోదరులకు రాఖీ కట్టడం సంప్రదాయం. ఎంత దూరంలో ఉన్న.. తమ సోదరులకు రాఖీ కట్టేందుకు సోదరీమణులు వస్తుంటారు. అయితే నిన్న ఏపీలో ఒక ప్రత్యేక పరిణామం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ కు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత రాఖీ కట్టడమే కాదు.. పాదాభివందనం కూడా చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. హోంమంత్రి పట్ల అభినందనలు వెలువెత్తుతున్నాయి. మరోవైపు కానిస్టేబుల్ కాళ్లు మొక్కిన హోం మంత్రి అంటూ కొందరు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. దీనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
* నక్కపేటలో..
పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వంగలపూడి అనిత. ఆమె ప్రస్తుతం హోమ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ క్రమంలో రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. తన సొంత నియోజకవర్గం నక్కపల్లిలో పర్యటించారు. ఈ క్రమంలో అక్కడ ఓ కానిస్టేబుల్ కు రాఖీ కట్టారు. ఆయన కాలికి నమస్కారం చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లను ఆకట్టుకుంటుంది.
* చీరలను అందించిన పవన్..
రక్షాబంధన్ సందర్భంగా ఏపీలో చాలా రకాల అంశాలు వెలుగులోకి వచ్చాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గ పరిధిలోని పిఠాపురంలో 2439 మందికి పట్టుచీరలతో పాటు నూలు చీరలు పంచిపెట్టారు. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఒంటరి మహిళ పింఛన్ అందుకుంటున్న మహిళలకు.. రక్షాబంధన్ సందర్భంగా చీరలను అందించారు. మరోవైపు ప్రముఖులకు మహిళలు రాఖీలు కట్టారు. అయితే హోం మంత్రి వంగలపూడి అనిత ఒక సాధారణ కానిస్టేబుల్ కు రాఖీ కట్టడమే కాదు.. ఆయన కాలికి నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
View this post on Instagram