Homeఆంధ్రప్రదేశ్‌Vangalapudi Anitha: ఆ మహిళా మంత్రి మార్పు!?

Vangalapudi Anitha: ఆ మహిళా మంత్రి మార్పు!?

Vangalapudi Anitha: రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంకోవైపు శాంతిభద్రతల అంశం కూడా తెరపైకి వస్తోంది. ప్రధానంగా హోం శాఖ పై చర్చ నడుస్తోంది. సంబంధిత మంత్రి వంగలపూడి అనిత పనితీరుపై కూడా చర్చ జరుగుతోంది. ఆమె హోం శాఖ మంత్రిగా రెండేళ్లపాటు తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ఒకానొక దశలో హోంశాఖ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మంత్రి అనిత […]

Vangalapudi Anitha: రాష్ట్రంలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇంకోవైపు శాంతిభద్రతల అంశం కూడా తెరపైకి వస్తోంది. ప్రధానంగా హోం శాఖ పై చర్చ నడుస్తోంది. సంబంధిత మంత్రి వంగలపూడి అనిత పనితీరుపై కూడా చర్చ జరుగుతోంది. ఆమె హోం శాఖ మంత్రిగా రెండేళ్లపాటు తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అయితే ఒకానొక దశలో హోంశాఖ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. మంత్రి అనిత సీరియస్ గా వ్యవహరిస్తారా? లేకుంటే హోం శాఖలో కూడా వేలు పెట్టాల్సి వస్తుంది అన్నట్టు పవన్ మాట్లాడినట్లు ప్రచారం నడిచింది. తర్వాత పవన్ దీనిపై సర్దుబాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు పవన్ డిప్యూటీ సీఎం పోస్ట్ తీసుకోవాలన్న వారి సంఖ్య పెరుగుతోంది. కానీ వంగలపూడి అనిత గత ప్రభుత్వాలతో పోల్చితే.. హోం శాఖ పరంగా గట్టి చర్యలే చేపడుతున్నారు.

అప్పట్లో సైతం మహిళలే..
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలే హోం శాఖ మంత్రులుగా ఉండేవారు. తొలుత మేకతోటి సుచరిత, తరువాత దానేటి వనిత హోం శాఖ మంత్రులుగా వ్యవహరించారు. అయితే వారిద్దరూ అనుకున్న స్థాయిలో ముద్ర చూపలేకపోయారు. అప్పట్లో వారు శాంతిభద్రతలపై సమీక్షించిన దాఖలాలు కూడా లేవు. అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాలను మాత్రమే యంత్రాంగం పాటించేది అనే విమర్శ ఉండేది. ఒక్క మాటలో చెప్పాలంటే అప్పట్లో మంత్రులు డమ్మీలు అనే ఆరోపణలు ఉన్నాయి. దానికి చాలా రకాల కారణాలు ఉండేవి. హోం శాఖ పరంగా సంబంధిత మంత్రుల కంటే అప్పుడు సలహాదారుడుగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి క్రియాశీలకంగా వ్యవహరించేవారు అనే విమర్శ ఉంది.

నిత్య సమీక్షలు..
కానీ ఇప్పుడు వంగలపూడి అనిత మాత్రం హోం శాఖ విషయంలో గట్టిగానే చర్యలు చేపడుతున్నారు. నిత్య సమీక్షలు చేస్తున్నారు. ఆదిలో తడబడ్డారు కానీ.. ఇప్పుడు శాఖలో ఇమిడిపోయారు. స్వతహాగా ఆమె విద్యాధికురాలు. ఉపాధ్యాయురాలిగా ఉంటూ రాజకీయాల్లోకి వచ్చారు. క్రమశిక్షణ విషయంలో ఎలా ఉండాలో అలా ఉన్నారు. చంద్రబాబు సైతం ఆమెకు స్వేచ్ఛ ఇచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం శాఖ విషయంలో కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. అయితే తన రెండు సంవత్సరాల శాఖ ప్రగతి పరంగా మంచి మార్కులు పడుతున్నాయి. అయితే పవన్ హోం మంత్రి అంటూ కొత్త ప్రచారం మొదలైంది. కానీ తాను ఏరి కోరి తీసుకున్న గ్రామీణ శాఖలను విడిచిపెట్టి పవన్ హోం శాఖను అందిపుచ్చుకునే అవకాశం లేదు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper