Vangalapudi Anitha : ఇటీవల కొంతమంది మంత్రులు ప్రజల నుంచి నిలదీతలను ఎదుర్కొంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు కొన్ని రకాల హామీలు ఇచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక అవి కార్యరూపం దాల్చకపోవడంతో ప్రజల ఆగ్రహానికి వారు బాధితులుగా మిగులుతున్నారు. ఈ జాబితాలో హోం మంత్రి అనిత( home minister Anita) ముందంజలో ఉంటారు. అయితే ఆమె తన సొంత ప్రాంతంలో పర్యటిస్తున్న సమయంలోనే ప్రజల నుంచి నిలదీతలు, ప్రశ్నలు ఎదురవుతుండడం విశేషం. విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. పరిశ్రమల కోసం నిర్వాసితులకు సరైన న్యాయం జరగడం లేదు. అందుకే బాధితులు తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు.
* వైసిపి హయాంలోనే..
ప్రస్తుతం ఉమ్మడి విశాఖ జిల్లాలో( Visakha district ) పాయకరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వంగలపూడి అనిత. అయితే వైసిపి హయాంలో పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పరిశ్రమ ఏర్పాటుకు నిర్ణయం జరిగింది. దానిపై పెద్ద ఎత్తున పోరాటాలు కూడా జరిగాయి. అప్పట్లో విపక్షంలో ఉన్న వంగలపూడి అనిత పోరాటానికి మద్దతు తెలిపారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదన్న విమర్శ ఆమెపై ఉంది. అందుకే గత ఏడాది సెప్టెంబర్ లో ఏకంగా ఆమె కాన్వాయ్ ను అడ్డుకున్నారు. అప్పట్లో మద్దతు ఇచ్చి.. ఇప్పుడు ఎందుకు పట్టించుకోవడంలేదని గట్టిగానే నిలదీశారు.
* సహచర మంత్రులు మధ్యనే..
తాజాగా అనకాపల్లి జిల్లాలో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మిగతా మంత్రులతో కలిసి ఆమె పాల్గొన్నారు. మంత్రులు అనగాని సత్యప్రసాద్, కొల్లు రవీంద్ర, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ తదితరులు హాజరయ్యారు. మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ జిల్లాకు పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తుండడాన్ని ఆహ్వానించారు. అయితే అప్పుడే తమ భూములకు పరిహారం ఇవ్వాలంటూ పాయకరావుపేట నియోజకవర్గం లోని మూలపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అనితను నిలదీసినంత పని చేశారు. సహజంగానే మిగతా సహచర మంత్రులు హాజరైన ఈ కార్యక్రమంలో.. సొంత ప్రాంతంలోనే మంత్రి అనితకు చుక్కెదురు అయినట్లు అయ్యింది. అయితే ఆమె హోం మంత్రి. ఆమె పర్యటనల్లో భద్రత కూడా ఉంటుంది. కానీ సొంత ప్రాంతం కావడంతో ఆమె ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. కానీ ఒక్కసారిగా ప్రజలు తిరగబడే సరికి ఆమె షాక్ కు గురయ్యారు. అయితే దీని వెనక సొంతవారే ఉన్నారని ఆమె అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తరచూ ఇలా నిలదీతలు ఎదురు కావడం వెనుక కుట్ర ఉందని అనుమానిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఏపీ హోంమంత్రి అనితకు నిరసన సెగ
అనకాపల్లి జిల్లాలోని పాయకరావుపేటలో పర్యటిస్తున్న మంత్రులు అనిత, అనగాని సత్య ప్రసాద్, కొల్లు రవీంద్రలను అడ్డుకున్న స్థానిక మహిళలు
భూసేకరణలో భాగంగా తమ భూములు తీసుకుని పరిహారం చెల్లించలేదని నిలదీసిన మహిళలు
నిలదీసిన మహిళలపై దురుసుగా ప్రవర్తించి,… pic.twitter.com/NyB3yBCOR8
— Telugu Scribe (@TeluguScribe) January 5, 2026