Homeఆంధ్రప్రదేశ్‌Nandhamuri Balakrishna : అమరావతిలో బాలకృష్ణ కీలక ప్రాజెక్ట్.. కూటమి గ్రీన్ సిగ్నల్

Nandhamuri Balakrishna : అమరావతిలో బాలకృష్ణ కీలక ప్రాజెక్ట్.. కూటమి గ్రీన్ సిగ్నల్

Nandhamuri Balakrishna :  అమరావతి రాజధాని నిర్మాణం పై కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభమయ్యాయి. ఇటీవల సిఆర్టిఏ భవన నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. జనవరి నుంచి పూర్తిస్థాయిలో నిర్మాణాలు ప్రారంభించాలని భావిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ఇందుకు సంబంధించి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు మంజూరు కానున్నాయి. గత అనుభవాల దృష్ట్యా వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని టిడిపి కూటమి ప్రభుత్వం భావిస్తోంది.మరోవైపు అమరావతిలో ప్రైవేటు కంపెనీలకు,సంస్థలకు భూములు కేటాయించిన సంగతి తెలిసిందే. వారంతా తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధపడుతున్నారు. ఈ తరుణంలో అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు ఆసుపత్రి చైర్మన్,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన ప్రయత్నాలు మొదలుపెట్టారు.ఆదివారం అమరావతి రాజధాని ప్రాంతాన్ని పరిశీలించారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని సందర్శించారు. త్వరలో పనులు మొదలు పెడతామని చెప్పారు.

* తొలి ప్రైవేట్ నిర్మాణం
అమరావతిలో తొలి ప్రైవేటు నిర్మాణం కూడా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి కావడం గమనార్హం. 2017లో ఇక్కడ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి ప్రభుత్వం భూమి కేటాయించింది.అప్పట్లో లీజుకు సంబంధించిన సొమ్మును బాలయ్య చెల్లించారు. పనుల నిర్మాణం చేపట్టే సమయానికి వైసీపీ అధికారంలోకి వచ్చింది. మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. దీంతో అన్ని ప్రాజెక్టులు మాదిరిగానే బాలయ్య ఆసుపత్రి నిర్మాణం పనులు కూడా నిలిచిపోయాయి. తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో అమరావతి నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కేంద్ర సాయంతో 15 వేల కోట్లు, సొంతంగా మరో 12 వేల కోట్లు, నాబార్డు ద్వారా మరో 15 వేల కోట్ల రూపాయల తీసుకుని రాజధాని నిర్మాణ పనులను శరవేగంగా జరిపించాలని భావిస్తోంది.

* అమరావతి బాటపడుతున్న సంస్థలు
మరోవైపు గతంలో దూరమైన ప్రైవేటు కంపెనీలు, సంస్థలు తిరిగి అమరావతి బాట పడుతున్నాయి. అందులో భాగంగా బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ ఆసుపత్రికి కేటాయించిన భూములను పరిశీలించారు. ఇప్పటికీ అక్కడ జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి.ఈ నేపథ్యంలో పనులు చేపట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు ప్రభుత్వానికి నివేదిక సమర్పించాయి. అందులో భాగంగానే సిఆర్డిఏ అధికారులతో కలిసి బాలకృష్ణ ఆ భూములను పరిశీలించినట్లు సమాచారం. ఈనెల చివరిలో ప్రారంభానికి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే అమరావతిలో ఏర్పడే తొలి ప్రైవేట్ నిర్మాణం కూడా ఇదే అవ్వనుంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper