AP Toll Gates: ఏపీలో రహదారుల అభివృద్ధి పై కూటమి ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇప్పటికే రహదారులపై గుంతలు కప్పే కార్యక్రమాన్ని చేపడుతోంది. సంక్రాంతి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని కృత నిశ్చయంతో ఉంది.మరోవైపు పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యంతో రోడ్ల అభివృద్ధికి పక్కాగా ప్లాన్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. జాతీయ రహదారుల పరహాలోనే రాష్ట్ర రహదారులను దశలవారీగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. వాటిపై టోల్ గేట్లు పెట్టి వాహనదారుల నుంచి సుంకం వసూలు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీనిపై ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కాగా తొలి దశలో 18 రహదారులను అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది కూటమి సర్కార్.. వాటిని అభివృద్ధి చేసిన తర్వాత అదే రహదారులపై టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఆ 18 రహదారుల నిర్మాణం పూర్తయితే.. తర్వాత మరో 68 రోడ్లు అభివృద్ధి చేసి టోల్ వసూలు చేయనున్నారు. ఇప్పటికే జాతీయ రహదారులపై ఈ విధానం కొనసాగుతోంది. ఇదే విధానాన్ని రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ఉపయోగించాలన్నది కూటమి ప్రభుత్వ ప్లాన్. ఈ రహదారులను ప్రైవేటు సంస్థలకు అప్పగించి వాటిని అభివృద్ధి చేయడంతో పాటు టోల్ టాక్స్ వసూలు చేసే బాధ్యత కూడా అప్పగిస్తుంది.
* తొలి దశలో ఈ రహదారులు
తొలి దశలో 18 రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. చిలకపాలెం- రామభద్రపురం- రాయగడ మధ్య 130 కిలోమీటర్లు, విజయనగరం- పాలకొండ మధ్య 72.5 కిలోమీటర్లు, కళింగపట్నం- శ్రీకాకుళం- పార్వతిపురం మధ్య 113.40 కిలోమీటర్లు, భీమునిపట్నం- నర్సీపట్నం మధ్య 78 కిలోమీటర్లు, కాకినాడ జొన్నాడ మధ్య 48.84 కిలోమీటర్లు, కాకినాడ- రాజమండ్రి కెనాల్ మధ్య 65.20 కిలోమీటర్లు, ఏలూరు- మేడిశెట్టి వారి పాలెం మధ్య 7.90 కిలోమీటర్లు, నరసాపురం- అశ్వరావుపేట మధ్య 100 కిలోమీటర్లు,ఏలూరు- జంగారెడ్డిగూడెం మధ్య 51.73 కిలోమీటర్లు,గుంటూరు- పర్చూరు మధ్య 41.44 కిలోమీటర్లు, గుంటూరు -బాపట్ల మధ్య 51.24 కిలోమీటర్లు, మంగళగిరి -తెనాలి- నారాకోడూరు మధ్య 40 కిలోమీటర్లు, బెస్తవారిపేట- ఒంగోలు మధ్య 113.25 కిలోమీటర్లు, రాజంపేట- గూడూరు మధ్య 95 కిలోమీటర్లు, ప్యాపిలి-బనగానపల్లి మధ్య 54. 44 కిలోమీటర్లు, దామాజీ పల్లి -నాయన పల్లి క్రాస్- తాడిపత్రి మధ్య 99 కిలోమీటర్లు,జమ్మలమడుగు- కొలిమిగుండ్ల మధ్య 43 కిలోమీటర్లు, సోమందేపల్లి- హిందూపురం- తూముకుంట మధ్య 35.53 కిలోమీటర్లు రహదారులను అభివృద్ధి చేయనున్నారు. వాటిపైనే టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి సుంకం వసూలు చేయనున్నారు.
* ఐదేళ్లుగా నిర్వహణ లేదు
గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో రహదారులు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. కనీస నిర్వహణకు కూడా నోచుకోని రహదారులు చాలా ఉన్నాయి. దీంతో రహదారులు దారుణంగా తయారయ్యాయి. రాకపోకలు సాగించేందుకు ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. కానీ జగన్ సర్కార్ ఇటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రహదారులను పూర్తిగా బాగు చేయాలని సంకల్పించింది. అయితే నిధుల కొరత కారణంగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని భావిస్తోంది. దీనిపై ప్రజల నుంచి విశ్రమ స్పందన వస్తోంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: The development of those 18 roads and then the toll gates is a key decision of the ap government
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com